ETV Bharat / sukhibhava

తగ్గిన బరువు మళ్లీ పెరగకుండా ఉండాలంటే..? - బరువు తగ్గించుకునేందుకు చిట్కాలు

రకరకాల కసరత్తులు చేసి, ఇష్టమైనవన్నీ తినకుండా నోరుకట్టేసుకుని కొంత బరువుని తగ్గించుకుంటారు చాలామంది. అక్కడితో లక్ష్యాన్ని వదిలేయొద్ధు అలా తగ్గిన బరువు మళ్లీ పెరగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

Precautions to prevent reduced weight gain again in telugu
తగ్గిన బరువు మళ్లీ పెరగకుండా ఉండాలంటే..?
author img

By

Published : Aug 24, 2020, 1:31 PM IST

  • బరువు తగ్గేందుకు మీరు పాటించిన నియమాలు మీ ఆరోగ్యానికీ మేలు చేసేవి అయి ఉండాలి. వాటిని భవిష్యత్తులోనూ అలవాటుగా మార్చుకోవాలి. పదిహేను రోజులకోసారయినా మీ బరువును గమనించుకోవడం వల్ల తగిన క్రమశిక్షణ తప్పకుండా ఉంటారు.
  • కసరత్తులు...చేయడానికి సమయం చిక్కకపోయినా సరే రోజూ ఓ అరగంట వాకింగ్‌, జాగింగ్‌, తాడాట, సైక్లింగ్‌ వంటివి ఇంట్లోనే ఉండి చేయండి. అదీ కుదరకపోతే కనీసం బస్కీలు అయినా తీయండి. ఇవన్నీ మీ శరీరాన్ని చురుగ్గా ఉంచుతాయి. కండరాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.
  • పీచుశాతం ఎక్కువగా ఉన్న పదార్థాలు తినండి. ముఖ్యంగా పొట్టుతీయని గింజలు వాటితో చేసిన పదార్థాలు, కూరగాయలూ, పండ్లు తినండి. వీటిల్లో కెలొరీలూ తక్కువగా ఉంటాయి. వీటిని తింటే త్వరగా పొట్ట నిండినట్లు అనిపిస్తుంది. ఇవి బరువు పెరగనివ్వవు.
  • వేపుళ్లకు బదులు గ్రిల్డ్‌, బేక్‌, ఆవిరిపద్ధతిలో చేసిన పదార్థాలు ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోండి. పాల పదార్థాలు బరువు పెంచుతాయని దూరంగా ఉంటారు కొందరు. వాటిల్లో కొవ్వులు లేనివి ఎంచుకోవాలి. నూనె, వెన్న, నెయ్యి, క్రీం ఉన్న వంటకాలు, మైదాతో వండిన పదార్థాలు తగ్గించాలి.

ఇదీ చదవండి: హార్మోన్లు పద్ధతిగా పనిచేయాలంటే ఇలా చేయాలి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.