Plumbing Tips in Telugu : బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ప్లంబింగ్ కీ రోల్ పోషిస్తుంది. ఇంటి నిర్మాణంలో భాగంగా ఉపయోగించే పైప్లైన్లు, డ్రెయిన్ పైపులు.. వంటివి ప్లంబింగ్ కిందకు వస్తాయి. కాబట్టి భవనాన్ని కట్టేటప్పుడే ఒక ప్లాన్ ప్రకారం ప్లంబింగ్ ఏర్పాటు చేసుకుంటే.. తర్వాత ఇంటికి సంబంధించి నీటి వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఇకపోతే కొన్నిసార్లు మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్లంబింగ్ విషయంలో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో మనం ప్లంబర్‌ను పిలుస్తుంటాం. చాలా మంది ఏదైనా చిన్న సమస్య వచ్చినా వెంటనే మెకానిక్కు ఫోన్ చేస్తుంటారు. అలాకాకుండా ప్రతి ఇంటి యజమాని కొన్ని ప్లంబింగ్ టిప్స్ తెలుసుకొని ఉంటే ఈజీగా ఆ సమస్యను మీరే సాల్వ్ చేసుకోవచ్చు. మరి, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
షటాఫ్ వాల్వ్ స్థానాన్ని తెలుసుకోవాలి : మీ ఇంట్లో అతి ముఖ్యమైన షటాఫ్ వాల్వ్ 'వాటర్ మెయిన్'. కాబట్టి మీరు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒకసారి వాటర్ మెయిన్‌ను ఆపివేస్తే.. అది వెంటనే మీ ఇంటికి నీటి సరఫరాను నిలిపివేస్తుంది. మీ భవనంలో ఏదైనా పైపు పగిలిన సందర్భంలో.. ఈ షటాఫ్ వాల్వ్‌ను మూసివేయడం కీలకం.
అడ్డుపడే కాలువలకు పరిష్కారం కనుగోనాలి : ఇంట్లో అత్యంత సాధారణ ప్లంబింగ్ సమస్య.. మూసుకుపోయిన డ్రెయిన్స్. ఆహార వ్యర్థాలు, వెంట్రుకలు, సబ్బు ఒట్టు, మొదలైనవి పైపుల్లో చిక్కుకుపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ క్రమంలో డ్రైన్‌ను శుభ్రపరిచేటప్పుడు.. కఠినమైన క్లీనర్‌ని ఉపయోగించకుండా ప్లంగర్ లేదా డ్రైన్ స్నేక్‌ని ఉపయోగించాలి. వీటి ద్వారా ఈజీగా అడ్డుపడే వాటిని తొలగించుకోవచ్చు.
ప్లంబింగ్ ఎమర్జెన్సీ కిట్‌ని కలిగి ఉండాలి : ప్రతి ఇంటి యజమాని ప్లంబింగ్ ఎమర్జెన్సీ కిట్‌ని కలిగి ఉండాలి. స్క్రూడ్రైవర్, డ్రెయిన్ స్నేక్, చిన్న గొట్టము ఓపెనర్, పైప్ రెంచ్, రాగ్స్ వంటి కొన్ని అవసరమైన ప్లంబింగ్ సాధనాలు అందులో ఉంటాయి ఇవి ప్లంబింగ్ ఎమర్జెన్సీ టైమ్‌లో ఎంతో ఉపయోగపడతాయి.
ఇల్లు తళతళా మెరిసిపోవాలా? కెమికల్ లిక్విడ్స్ వద్దు - ఇంట్లోనే తయారు చేసుకోండిలా!
బహిర్గత పైపులను ఇన్సులేట్ చేయాలి : భవన నిర్మాణంలో ఏమైనా తుప్పు పట్టిన పైపులు ఉంటే వాటి ద్వారా లీకేజీలకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి తుప్పు పట్టిన పైపులను వీలైనంత త్వరగా ఇన్సులేట్ చేయాలి. అయితే మీరు పైపులను ఇన్సులేట్ చేయడానికి పైప్ చుట్టలు లేదా ఫోమ్ షీట్లను ఉపయోగించవచ్చు.
నీటి మీటర్ ఉపయోగించి లీక్‌లను చెక్ చేయండి : మీ ఇంట్లో ఎక్కడైనా పైప్‌లైన్ లీక్ అయినట్లు అనుమానం వస్తే.. అప్పుడు మీరు వాటర్ మీటర్ ఉపయోగించి దీన్ని ఈజీగా తనిఖీ చేయవచ్చు. ఫస్ట్ మీటర్ రీడింగ్ చెక్ చేసి.. ఒక గంట పాటు నీటి వినియోగాన్ని ఆపి.. మళ్లీ మీటర్‌ను చెక్ చేయండి. అందులో ముళ్లు ఏమైనా కదిలితే ఎక్కడో నీరు కారుతుందని మీరు గమనించవచ్చు..
వార్షిక నివారణ తనిఖీ : మీరు తప్పక తెలుసుకోవాల్సిన మరో టిప్ ఏంటంటే.. మీ ఇంట్లో లీకేజీ లేకపోయినా, మీరు అప్పుడప్పుడు కచ్చితంగా ఇంటి ప్లంబింగ్ సిస్టమ్‌ను చెకప్ చేయాలి. ఇలా ముందుగా చెక్ చేయడం వల్ల చాలా డబ్బు ఆదా అవుతుందనే విషయం గమనించాలి.
మీ కిచెన్ సింక్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందా? - ఈ టిప్స్ ట్రై చేస్తే స్మెల్ పరార్!