ETV Bharat / sukhibhava

ఈ శృంగార పప్పులు తీసుకుంటే.. ఆ తిప్పలు తప్పినట్టే!

Nuts to Boost Sex Life: శృంగార జీవితంలో సమస్యలు ఎదుర్కొనే వారికి పలు పప్పులను తినాలని సూచిస్తున్నారు పరిశోధకులు. వాటిని తీసుకుంటే ఫలితాలుంటాయని చెబుతున్నారు. ఇంతకీ ఆ పప్పులు ఏంటి? వాటి సంగతేంటి?

Nuts to Help Boost Your Sex Life
foods to increase sex drive
author img

By

Published : May 28, 2022, 7:20 AM IST

Nuts to Boost Sex Life: బాదం, జీడిపప్పు, అక్రోట్ల వంటి గింజపప్పులు (నట్స్‌) చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిని క్రమం తప్పకుండా తినటం వల్ల బరువు అదుపులో ఉండటం దగ్గర్నుంచి ఉత్సాహం, మేధోశక్తి, మూడ్‌ పుంజుకోవటం వరకు ఎన్నెన్నో ప్రయోజనాలు కలుగుతున్నట్టు అధ్యయనాలు చెబుతూనే ఉన్నాయి. ఇవి శృంగార జీవితం మెరుగుపడటానికీ తోడ్పడుతున్నట్టు తాజాగా బయటపడింది.

రోజుకు 60 గ్రాముల గింజపప్పులు తినేవారిలో శృంగార ఆసక్తి పెరగటం సహా మెరుగైన భావప్రాప్తిని పొందుతుండటం గమనార్హం. తాజా పండ్లు, కూరగాయలు తక్కువగా ఉండే పాశ్చాత్య ఆహార అలవాట్లు గల కొందరిపై పరిశోధకులు ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించారు. వీరిలో కొందరికి తమ మామూలు ఆహారం, మరికొందరికి బాదం, అక్రోట్లు, హేజెల్‌ నట్స్‌ కూడా తినమని సూచించారు. ఇలా 14 వారాలు చేసిన తర్వాత పరిశీలించగా.. గింజపప్పులు జతచేసినవారిలో శృంగారాసక్తి, భావప్రాప్తి మెరుగుపడినట్టు తేలింది.

గింజపప్పుల్లో ప్రొటీన్‌, పీచు, అత్యవసర విటమిన్లు, ఖనిజాలు దండిగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యం మెరుగుపడటానికి తోడ్పడేవే. వీటిల్లో ఫాలీఫెనాల్స్‌ వంటి యాంటీఆక్సిడెంట్లూ ఉంటాయి. ఇవి స్తంభనలోపం తగ్గటానికే కాకుండా గుండె రక్తనాళ వ్యవస్థకూ మేలు చేస్తుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారానికి గింజపప్పులనూ జోడించినట్టయితే అంగ స్తంభన, శృంగారాసక్తి మెరుగయ్యే అవకాశమున్నట్టు అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయని వివరిస్తున్నారు.

ఇదీ చూడండి: జుట్టును పెంచే గింజలు.. మీరు ట్రై చేస్తారా?!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.