ETV Bharat / sukhibhava

ఈ 12 చిట్కాలతో 'పగాకు' వ్యసనం నుంచి విముక్తి!

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి ఇప్పటికే 3.71లక్షలకుపైగా మంది మృత్యువాతపడ్డారు. దాదాపు 61 లక్షల మందికి పైగా ఈ వైరస్‌కు బాధితులుగా మారారు. ఈ మహమ్మారి ముఖ్యంగా మానవ శ్వాసకోస వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇలాంటి సమయంలో పొగాకు వాడకం ఎంత ప్రమాదకరమో తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కరోనా వేళ ప్రాణాలకు ముప్పు తెచ్చే 'పగాకు'ను దూరంపెట్టాలని సూచిస్తున్నారు నిపుణులు. నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా ఆ వివరాలు ఓసారి చూద్దాం.

No Tobacco Day: take a holiday from smoking and nicotine
కరోనా వేళ ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవడం ఎంత మూల్యానికి?
author img

By

Published : May 31, 2020, 4:29 PM IST

పొగాకు వాడకం వల్ల ఏటా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వీరిలో 70 లక్షల మంది పొగాకు ఉత్పత్తులను నేరుగా తీసుకోవడం వల్ల చనిపోతుండగా.. మరో 12 లక్షల మంది పరోక్షంగా దీన్ని పీల్చడం వల్ల బలైపోతున్నారని ప్రకటించింది. అంతేకాకుండా ధూమపానం అలవాటు ఉన్నవారిలో కొవిడ్‌-19 తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ నిపుణుల బృందం గుర్తించింది. కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న తరుణంలో ధూమపానం, నికోటిన్‌ వాడకం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించింది.

మే 31- పొగాకు వ్యతిరేక దినం

1988లో ప్రపంచ ఆరోగ్య సంస్థ పొగాకు వల్ల కలిగే అనర్థాలపై చర్చ జరిపింది. ఆ సమావేశంలో మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినంగా నిర్వహించాలని ప్రకటించింది. ఈ రోజును ఏటా నిర్వహించి.. ధూమపానం వల్ల వచ్చే ఆరోగ్య ఇబ్బందులు, దుష్ప్రభావాలు, ఆర్థిక పరిస్థితులపై ప్రభావం వంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. సాధారణంగానే పొగ తాగేవారిలో రక్తనాళాల్లో గడ్డకట్టే సమస్య ఉంటుంది. తాజగా కరోనా నేపథ్యంలో పొగాకు వాడేవారి ప్రాణాలకు ముప్పు మరింత ఎక్కువని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

పొగ పీల్చేవారు ఎందరంటే?

  • ప్రపంచవ్యాప్తంగా ధూమపానం చేసేవారిలో 12 శాతం మంది భారత్​లోనే ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) తెలిపింది.
  • టొబాకో అట్లాస్​ సర్వే 2017-18 ప్రకారం 50 లక్షల మంది పిల్లలు ప్రతిరోజు సిగరెట్లు తాగుతున్నారట.
  • దేశవ్యాప్తంగా యువతలోని 34.6% మంది ( 47.9% పురుషులు, 20.3% మహిళలు) ధూమపానం చేస్తున్నారు.
  • 1998లో 79 మిలియన్లు ఉండే పొగరాయుళ్లు 2015 నాటికి 108 మిలియన్లకు పెరిగారు. సిగరెట్లపై ఎక్సైజ్​ సుంకాన్ని 70 శాతం ఉండాలని డబ్ల్యూహెచ్​ఓ సూచించినా.. భారత్​లో 26 శాతంగా మాత్రమే ఉంది.

ధూమపానం మానేస్తే లాభాలు?

ధూమపానం వల్ల వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీర్ఘకాల వ్యాధులతో సంబంధం లేని వాళ్లు అనారోగ్యానికి గురవుతున్నారు. ధూమపానం మానేయడం వల్ల హృద్రోగ సమస్యల నుంచి ముప్పు తప్పుతుంది. ముఖ్యంగా మహిళలు పొగాకు దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.

రుచి, వాయి వ్యవస్థ బాగుపడుతుంది. నోరు, శరీరం నుంచి దుర్గంధం రావడం, జుత్తు ఊడిపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి.

4 వారాలు ధూమపానం మానేసి వ్యాయామం చేస్తే.. ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది. లంగ్​ క్యాన్సర్​ ముప్పు తగ్గుతుంది. ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నవాళ్లు.. పదేళ్లు ధూమపానం మానేస్తే.. వ్యాధి ప్రభావం సగం తగ్గిపోతుంది.

ధూమపానం మానేసిన ఎనిమిది వారాల్లో వ్యాధి నిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఏడాది పాటు మానేస్తే.. గుండె సంబంధిత వ్యాధులు సగానికి తగ్గుతాయి.

ధూమపానం మానేయడం వల్ల అధిక రక్తపోటు, హృదయ స్పందనలు సాధారణ స్థితికి వస్తాయి. రక్త ప్రసరణలో కార్బన్‌మోనాక్సైడ్‌ నామమాత్రపు స్థాయికి చేరుతుంది. మరో 2నుంచి 12వారాల్లో రక్తప్రసరణ మెరుగవడమే కాకుండా ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. ఇలా ఒకటి నుంచి తొమ్మిది నెలల కాలంలో దగ్గు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయని డబ్ల్యూహెచ్‌ఓ నిపుణుల బృందం తెలిపింది.

ధూమపానం మానేసేందుకు మార్గాలివే...

  • వ్యాయామం
  • నడక
  • చాకెట్లు లేదా బబుల్​గమ్​ నమలడం
  • ఏదో ఒక పనిలో బిజీగా ఉండటం
  • మొబైల్​లో ఆటలు​ ఆడటం
  • ఎక్కువ మంచినీళ్లు సేవించడం
  • దీర్ఘశ్వాస తీసుకొనే ఆసనాలు వేయడం(యోగా)
  • సినిమా చూడటం
  • ఎక్కువ సమయం కుటుంబంతో గడపడం. ధూమపానం చేయనివారితే స్నేహం చేయడం
  • ధూమపాన నిషేధిత రెస్టారెంట్లలో సరదాగా డిన్నర్​కు వెళ్లడం
  • ఎప్పటికప్పుడు వైద్యుల​ సలహాలు తీసుకొని ఆచరించడం
  • ప్రాబ్లమ్​ సాల్వింగ్​ వంటి థెరపీలపై దృష్టిపెట్టడం

ధూమపానం వల్ల కలిగే నష్టాలు...

ధూమపానానికి బానిసైన కొందరు దానిపై భారీగా ఖర్చు చేస్తుంటారు. ఈ పరిస్థితుల వల్ల ఆర్థికంగా ఇబ్బందులతో పాటు కుటుంబ సమస్యలు ఎదుర్కొంటారు.

  • కుటుంబానికి ఇబ్బందులు: కుటుంబంలో ప్రతి ఒక్కరి ఆరోగ్యం చాలా ముఖ్యం. చదువుకుంటున్న పిల్లలు ఉండే ఇళ్లలో ధూమపానం చేసే వ్యక్తి వల్ల.. వాళ్లూ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు.
  • జీవితకాలం హరీ: ధూమపానం చేసే వారి సగటు జీవితం తక్కువగానే ఉంటుంది. ఒక్క సిగరెట్​ వల్ల వ్యక్తి జీవితంలో 12 నిమిషాల జీవితకాలం తగ్గుతుంది. ఐదు సిగరెట్లు తాగితే ఒక గంట జీవితం తగ్గుతుంది.
  • కెరీర్​పైనా ప్రభావం: అనారోగ్యం వల్ల సరిగ్గా పనిచేసుకోలేరు. దీని వల్ల కంపెనీలో పదోన్నతులు పొందలేరు. ఎందుకంటే అనారోగ్య కారణాలతో ఉన్న వారికి ఉన్నత స్థాయి పదవులు ఇచ్చేందుకు సంస్థలు అంగీకరించవు.
  • నాణ్యమైన జీవితం​: పేలవమైన ఆరోగ్యం వల్ల జీవన నాణ్యత గణనీయంగా తగ్గుతుంది. కఠినమైన శారీరక శ్రమలను చేయకుండా నిరోధిస్తుంది.

ధూమపానానికి ప్రత్యామ్నాయాలు..

ధూమపానానికి మానేయడానికి ప్రత్యామ్నాయాలు సూచించింది మెడికల్​ సైన్సెస్ జర్నల్​. వాటి పనితీరు, అందుకు అయ్యే వ్యయంపై ఓసారి చూద్దాం.

  • నికోటిన్​ ఆధారిత బబుల్​ గమ్​: రూ. 50 నుంచి రూ.3,000

ఇది నమిలినప్పుడు నికోటిన్​ విడుదలవుతుంది. ఇది రక్తంలో కలిసి పొగ తాగాలన్న ఆలోచనను తృప్తిపరుస్తుంది.

  • నికోటిన్​ ప్యాచ్​లు: రూ.600

ఈ ప్యాచ్​లను శరీరంపై పెట్టగానే నికోటిన్​ను​ విడుదల చేస్తాయి. ఇది రక్తనాళాల్లోకి చేరి.. పొగాకు వైపు దృష్టిమరలకుండా ప్రభావితం చేస్తాయి.

  • ఆయుర్వేదం: రూ.550

శరీరంలోని రక్త సరఫరా, అరుగుదల వంటి శరీర పనితీరును ఇది మెరుగుపరుస్తుంది.

  • బుప్రోపిన్​ హైడ్రోక్లోరైడ్​ మాత్రలు: రూ.150

మెదడులోని న్యూరో ట్రాన్స్​మిటర్స్​పై ఇది ప్రభావం చూపించి పొగాకు సేవించాలన్న కోరికను పోగొడుతుంది.

దుష్ప్రభావాలు...

రోజుకు 5 సిగరెట్లు మించి తాగే వారి ఊపిరితిత్తులు దాదాపు పాడైనట్లేనని ఓ నివేదిక స్పష్టం చేసింది. తక్కువ స్మోకింగ్​ చేసే వారి ఊపిరితిత్తులు పాడవ్వడానికి 1 ఏడాది పడితే.. ఎక్కవగా స్మోకింగ్​ చేసేవారు 9 నెలల్లోనే అదే పరిస్థితికి చేరుకుంటారని తెలిపింది.

ప్రతి సిగరెట్​ 7 వేల రసాయనాలతో పాటు 69 రకాలైన క్యాన్సర్​ కారకాలను కలిగి ఉంటుంది. 30 ఏళ్ల వయసున్న వ్యక్తి పొగ తాగడం మొదలుపెడితే.. 60 ఏళ్లు వచ్చేసరికి దాదాపు రూ.కోటి నష్టం వాటిల్లితుందని ఆ నివేదిక అంచనా వేసింది.

కరోనా ప్రభావం...

కొవిడ్‌ మహమ్మారి ముఖ్యంగా మానవ శ్వాసకోస వ్యవస్థపై దాడి చేస్తుంది. ఈ సమయంలో కరోనాతో పాటు ఇతర వ్యాధులను ఎదుర్కోవడంలో ధూమపానం శరీరాన్ని బలహీన పరుస్తుంది. గుండె సంబంధ వ్యాధులు, క్యాన్సర్‌, మధుమేహం ఉన్నవారు ఈ వైరస్‌ బారినపడినప్పుడు తీవ్ర అనారోగ్యానికి గురికావడమే కాక ప్రమాద తీవ్రతను పెంచుతుందని డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. దీంతో మరణాలు కూడా సంభవిస్తున్నట్లు తాజా పరిశోధనలు సూచిస్తున్నాయని తెలిపింది.

కొవిడ్‌-19 తీవ్రతను తగ్గించడంలో పొగాకు ఉత్పత్తులు, నికోటిన్‌ వాడకం వంటి ఉపయోగపడతాయన్న వాదనను డబ్ల్యూహెచ్‌ఓ తోసిపుచ్చింది. నిరూపితం కాని ఇలాంటి వాదనల విషయంలో శాస్త్రవేత్తలు, పరిశోధకులతోపాటు మీడియా సంస్థలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కొవిడ్‌-19 చికిత్స, నివారణకు పొగాకు ఉత్పత్తులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేసింది. ఇప్పటివరకు ధూమపానం అలవాటు ఉన్నవారిని పొగాకు ఉత్పత్తులకు దూరం చేయడానికి గమ్‌, ప్యాచెస్‌ వంటి నికోటిన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీలు ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. ప్రామాణికమైన పద్ధతుల ద్వారా మాత్రమే ధూమపానం అలవాటు మానుకోవాలని సూచించింది.

ప్రభుత్వం తీసుకునే చర్యలేంటి..?

ధూమపానం నిర్మూలనకు ప్రభుత్వం పలు చర్యలు అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. అయితే అవి మరింతగా ప్రజల్లోకి వెళ్లాలి.

పొగాకు సేవిస్తే వచ్చే అనర్థాలను తెలియజేస్తూ.. స్మోకింగ్​ ఫ్రీ వల్ల కలిగే ప్రయోజనాలను న్యూస్​ లెటర్లు, వెబ్​సైట్లు, ఇతర మాధ్యమాల ద్వారా తెలియజేయాలి. పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై ప్రభుత్వాలు దృష్టిసారించాలి. మైనర్లకు పొగాక ఉత్పత్తులను అమ్మితే కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా లైసెన్స్​ను రద్దు చేసేలా కఠిన నిబంధనలు విధించాలి. వాటిని పక్కాగా ఆమలు చేయాలి.

ప్రత్యేక హెల్ప్​లైన్​...

ధూమపానం అలవాటు ఉన్నవారికి, పొగాకు ఉత్పత్తులు వాడే వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చేందుకు నేషనల్‌ టొబాకో క్విట్‌ లైన్‌ సర్వీసులను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ అందుబాటులోకి తెచ్చింది. ఈ అలవాటుకు పూర్తిగా బానిసలుగా మారిన వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం, నిష్క్రమించే తేదీని నిర్ణయించడం, నిష్క్రమణ ప్రణాళికను రూపొందించడం వంటి చర్యలు చేపట్టనున్నారు. ఇందుకోసం టోల్ ఫ్రీ నంబర్ 1800-11-2356ను ఏర్పాటు చేశారు. మంగళవారం నుంచి ఆదివారం వరకు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల మధ్య సేవలందించనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.