ETV Bharat / sukhibhava

మునగ ఆకుతో 300 వ్యాధులకు చెక్ - ఈ బెనిఫిట్స్​ తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

Drumstick Leaves Health Benefits: ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన చెట్లలో మునగ చెట్టు ఒకటి. ఈ చెట్టు కాయలు నిత్యం మనం తినే ఆహారంలో భాగం చేసుకుంటాం. అయితే.. మునక్కాయలే కాకుండా.. దాని ఆకుల్లోనూ అద్భుతమైన హెల్త్​ బెనిఫిట్స్​ ఉన్నాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Drumstick Leaves Health Benefits
Drumstick Leaves Health Benefits
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 22, 2023, 10:41 AM IST

Moringa Oleifera Leaves Health Benefits : మునక్కాయలతో సాంబార్​, కూర వంటివి చేసుకోవడం అందరికీ తెలుసు. కానీ.. మునగ ఆకు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా..? ఎన్నో ఆరోగ్య సమస్యలను నయం చేయడానికి ఇవి దివ్యౌషధంలా పనిచేస్తాయని ఆయుర్వేదం చెబుతోంది.

300 వ్యాధులకు చెక్: ఆయుర్వేదంలో మునగకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. దీనిని అమృతంలా పరిగణిస్తారు. ఎందుకంటే మునగ 300 కంటే ఎక్కువ జబ్బులను నయం చేస్తుందట! దీని ఆకులు, కాడలను కూరగాయలుగా ఉపయోగిస్తారు. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న మునగ.. రక్తంలో షుగర్​ లెవల్స్​ను నియంత్రిస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి.

ఏళ్లనాటి మైగ్రేన్ బాధలు - ఇలా తిండితోనే తగ్గించుకోవచ్చు!

పోషకాల పవర్​హౌజ్​: NCBI నివేదిక ప్రకారం.. మునగ ఆకుల్లో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్-ఎ, సి, బి కాంప్లెక్స్, బీటా-కెరోటిన్, అమైనో యాసిడ్స్‌, ఫినోలిక్‌లతో పాటు, 40 కంటే ఎక్కువ రకాల యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి.

ఇతర ఆహారపదార్థాలతో పోలిస్తే:

  • క్యారెట్లు తినడం ద్వారా వచ్చే విటమిన్ ఎ ని 10 రెట్లు అధికంగా మునగాకు ద్వారా పొందొచ్చు.
  • నిమ్మకాయలో ఉండే దాని కంటే 5 రెట్లు ఎక్కువ విటమిన్ సి కలిగి ఉంటుంది.
  • పాల నుంచి లభించే క్యాల్షియం కన్నా.. మునగాకు నుంచి 17 రెట్లు అధికంగా లభిస్తుంది.
  • పెరుగు తినడం వల్ల లభించే ప్రొటీన్ల కన్నా.. మునగాకు నుంచి 8 రెట్లు అధికంగా పొందవచ్చు.
  • అరటిపండ్ల నుంచి పొందే పొటాషియం కన్నా.. ఎండిన మునగాకులో 15 రెట్లు అధికంగా ఉంటుంది.

మీ పిల్లలు బరువు తగ్గుతున్నారా? కారణం ఇదేనట!

మునగాకు తినడం వల్ల ప్రయోజనాలు:

  • మునగ ఆకులు విటమిన్ C ని కలిగి ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.
  • మునగాకులోని ఔషధ గుణాలు జుట్టు రాలడం, ఉబ్బసం, కీళ్లనొప్పులు వంటి సాధారణ వ్యాధులకు చికిత్స చేయడంలో ఉపయోగపడతాయి.
  • ఈ ఆకులు ఊబకాయం, బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి.
  • డయాబెటిస్‌తో బాధపడేవారికి కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
  • పరిగడుపున ఈ ఆకులను తీసుకోవడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్​ కంట్రోల్ అవుతుంది.
  • "డయాబెటిక్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి మోరింగా ఒలిఫెరా లీఫ్ ప్రభావం చూపిస్తుంది" అని Journal of Ethnopharmacology లో ప్రచురితమైంది.
  • మునగ ఆకులు ఎముకలకు అవసరమైన కాల్షియం, మెగ్నీషియం అందిస్తాయి.
  • దీనితో పాటు బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
  • ప్రతిరోజూ మునగాకుల రసాన్ని తాగడం వల్ల శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియా మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది.
  • మునగ ఆకులను తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, అల్సర్ వంటి అనేక కడుపు సంబంధిత సమస్యలను నయం చేయవచ్చు.
  • ఇందులో ఉండే పీచు, జీర్ణవ్యవస్థతో పాటు పొట్టను ఆరోగ్యంగా ఉంచి, ఆరోగ్యకరమైన ప్రేగు కదలికకు కూడా దోహదపడుతుంది.

మీ మోచేతులు నల్లగా మారాయా? - ఈ టిప్స్​తో అందంగా మెరిసిపోవడం ఖాయం!

  • ఇది రక్తహీనతను ఎదుర్కోవటానికి సహాయపడుతుంది. అంటే ఎర్ర రక్త కణాల లోపాన్ని నివారిస్తుంది.
  • పాలు ఇచ్చే అమ్మలకు మునగాకును కూరగా వండి పెడితే పాలు పెరుగుతాయి.
  • గుప్పెడు మునగాకులను వంద మిల్లీ లీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు ఉడికించి.. ఆ నీరు చల్లారినతర్వాత అందులో కొంచెం ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం కలిపి తాగితే ఆస్థమా, టీబీ, దగ్గు తగ్గుతాయి.
  • మునగాకు రసం ఒక స్పూన్​ తీసుకుని దాన్ని గ్లాసు కొబ్బరినీళ్లలో కలిపి కొద్దిగా తేనె కలిపి తాగితే విరేచనాలు తగ్గిపోతాయి.
  • మునగాకు రసానికి నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే మొటిమలు, బ్లాక్ హెడ్స్ పోయి.. ముఖం అందంగా తయారవుతుంది.

చుండ్రు సమస్య వేధిస్తోందా? ఇలా ట్రై చేస్తే ఎలాంటి ఖర్చు లేకుండా సమస్యకు చెక్​ పెట్టొచ్చు!

వందగ్రాముల మునగాకులో ఉండే పోషక పదార్థాలు:

  • నీరు: 75.9 శాతం
  • పిండి పదార్థాలు: 13.4 గ్రా
  • కొవ్వులు: 17 గ్రా
  • మాంసకృత్తులు: 6.7 గ్రా
  • కాల్షియం: 440 మిల్లీగ్రా
  • పాస్పరస్: 70 మిల్లీగ్రా
  • ఐరన్: 7 మిల్లీగ్రా
  • విటమిన్ సి: 200 మిల్లీగ్రా
  • ఖనిజ లవణాలు: 2.3 శాతం
  • పీచు పదార్థం: 0.9 మిల్లీగ్రా
  • శక్తి: 97 కేలరీలు

మిరియాలు- ఘాటైన రుచే కాదు, గమ్మత్తైన హెల్త్ బెనిఫిట్స్​ కూడా! మిస్​ అయ్యారంటే అంతే!

ఇంట్లో బియ్యం పురుగు పడుతోందా? - ఇలా చేశారంటే ఏడాదంతా నిల్వ చేసుకోవచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.