నాలుకను చూసి గుండెను చూడండి. చైనా పరిశోధకుల అధ్యయన ఫలితలు తెలిస్తే మీరూ అదే అంటారు. గుండె ఆరోగ్యస్థితికి సంబంధించిన కీలక జాడలను నాలుక పట్టిస్తున్నట్లు తేలింది మరి.
మామూలుగా నాలుక పాలిపోయిన ఎరుపు రంగులో, కాస్త తెల్లటి పూతతో కనిపిస్తుంది. అదే గుండె వైఫల్యం ఉన్న బాధితుల్లో మరింత ఎర్రగా, నాలుక మీది పూత ఒకింత పసుపురంగులో ఉంటున్నట్లు బయటపడింది. ముఖ్యంగా ఇలాంటి పూత నాలుక వెనుక భాగంలో ఉండటం విశేషం.
గుండెజబ్బు ముదురుతున్న కొద్దీ మార్పులు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయమని, దీనికి కారణం నాలుక మీది సూక్ష్మక్రిముల్లో తేడాలేనని పరిశోధకులు భావిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నవారితో పోలిస్తే గుండె వైఫల్యం బాధితుల్లో నాలుక మీది బ్యాక్టీరియా రకాలు, సంఖ్యల వంటివన్నీ వేరుగానే ఉంటున్నాయని వివరిస్తున్నారు.
ఇదీ చూడండి:నిద్ర తక్కువైనా, ఎక్కువైనా ముప్పే!