Mental Stress: మానసిక ఒత్తిడి వల్ల కేవలం ఆరోగ్యమే కాదు శృంగారం చేయాలన్న ఆసక్తి కూడా దెబ్బతింటుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ ఒత్తిడి వల్ల శరీరంలో విడుదలయ్యే కాటిజల్ అనే స్ట్రెస్ హార్మోన్ శృంగారం చేయాలన్న ఆసక్తిని సప్రెస్ చేస్తుందని చెప్పుకొచ్చారు. దీనితో పాటు లవ్ హార్మోన్స్ కూడా తగ్గిపోతాయని తెలిపారు. మనసు హుషారుగా ఉంటేనే సెక్స్‌పై కోరిక కలుగుతుందని స్పష్టం చేశారు.
అలా చేస్తే..
వివిధ రకాల మందులు వాడి ఈ సమస్యకు చెక్ పెట్టాలని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఆరోగ్య నిపుణులు.. ఈ సమస్య నుంచి బయటపడటానికి మందులు వాడాల్సిన అవసరం లేదని అంటున్నారు. వ్యాయామం, యోగా వంటి సహజ పద్ధతుల ద్వారానే దీని నుంచి బయటపడొచ్చు అని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా వాకింగ్‌తో దీనికి మెరుగైన పరిష్కారం లభిస్తుంది.. రోజూ ఉదయం ఒక అరగంట లేదా గంట సేపు వాకింగ్ చేస్తే మానసిక ఒత్తిడి బాగా తగ్గుతుందని పేర్కొన్నారు. తగిన నిద్ర అవసరం అని కనీసం 8 గంటలు నిద్రపోవాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే ఫీల్‌గుడ్ హార్మోన్స్ చక్కగా తయారై శృంగారం పట్ల ఆసక్తి పెరుగుతుందని తెలిపారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి : గుండెజబ్బు ఉన్నవాళ్లు శృంగారంలో పాల్గొనకూడదా..?