చలికాలంలో చర్మం పొడిబారే సమస్య అందరికీ ఎదరవుతుంది. మరి చర్మానికి తగిన తేమ అందాలన్నా, మృదువుగా ఉండాలన్నా లోషన్లు వాడడం తప్పనిసరి. అయితే.. ఇంట్లోనే సలువుగా ఈ లోషన్లను తయారు చేసుకోండి..
గ్లిజరిన్ లోషన్:
కావాల్సినవి: కప్పు కొబ్బరినూనె, పావు కప్పు గ్లిజరిన్, ఐదారు చుక్కల రోజ్ ఎసెన్షియల్ ఆయిల్.
తయారీ: ముందుగా ఒక గిన్నెలోకి కొబ్బరినూనె, గ్లిజరిన్ తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమంలో ఎసెన్షియల్ నూనె చుక్కలు వేసి మరోసారి కలిపితే చాలు. ఈ లోషన్‌ను నెలపాటు వినియోగించుకోవచ్చు. చర్మాన్ని పొడిబారకుండా మృదువుగా మెరిసేలా చేస్తుందిది.
తేనెతో...
కావాల్సినవి: మూడు చెంచాల తేనె, అరకప్పు చొప్పున షియాబటర్, కొబ్బరినూనె, ఐదారు చుక్కల ఎసెన్షియల్ నూనె.
తయారీ: కొబ్బరినూనె, తేనె, షియాబటర్‌ను గిన్నెలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని డబుల్ బాయిలర్ పద్ధతిలో వేడి చేయాలి. చిక్కగా అయ్యేంతవరకు చెంచాతో కలుపుతూనే ఉండాలి. ఆ తర్వాత చల్లార్చి గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. దీనికి ఎసెన్షియల్ నూనె చుక్కలు కలిపి సీసాలో భద్రపరుచుకుంటే మూడు నుంచి నాలుగువారాలు వాడుకోవచ్చు.
ఇవీ చూడండి: