ETV Bharat / sukhibhava

పొట్ట పెరుగుతుందా?.. తగ్గడానికి ఇవిగో చిట్కాలు - అధిక బరువు తగ్గించుకోండి ఇలా!

అధిక బరువుతో పాటు వచ్చిన పొట్ట ఇబ్బంది కలిగిస్తుందా? కొత్త చీర కట్టుకోవాలన్నా, నచ్చిన డ్రెస్ వేసుకోవాలన్నా పొట్ట అడ్డొస్తుందా? అయితే ఈ చిట్కాలు పాటించండి. దానిని వీలైనంత త్వరగా తగ్గించేసుకోండి.

fitness
ఫిట్​నెస్
author img

By

Published : Aug 20, 2021, 7:35 AM IST

కొత్త చీర కట్టుకోవాలంటే పెరిగిన పొట్ట వద్దంటోందా.. నచ్చిన డ్రెస్‌ వేసుకోవాలంటే పొట్ట అడ్డొస్తోందా.. అందాన్నే కాదు.. ఆరోగ్యాన్నీ పాడు చేసే అధిక పొట్టను తగ్గించుకోవాల్సిందే. ఎలాగంటే..

  1. మధ్యాహ్నం భోజనంలో ఆ రోజు తీసుకునే కెలొరీల్లో దాదాపు 50 శాతం ఉండాలి. ఎందుకంటే ఆ సమయంలో జీర్ణవ్యవస్థ శక్తివంతంగా పనిచేస్తుంది. రాత్రి భోజనంలో తక్కువ కెలొరీలనిచ్చే ఆహారాన్ని తీసుకోవాలి. రాత్రి ఏడు గంటలలోపు డిన్నర్‌ ముగించేయాలి.
  2. పొట్ట తగ్గాలనుకునే వారు వేపుడు పదార్థాలను తగ్గించాలి. శీతల పానీయాలు, స్వీట్లు, బ్రెడ్‌, పాస్తా, బిస్కట్లు, నూనెలో వేయించిన పదార్థాలకు దూరంగా ఉండాలి.
  3. మెంతి పొడిని గోరువెచ్చని నీళ్లలో కలిపి ఉదయం పూట పరగడుపున తీసుకోవాలి. అలాగే మెంతులను రాత్రంతా నానబెట్టి ఆ నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తాగితే పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరుగుతుంది.
  4. ఆయుర్వేద వైద్యుల సలహాతో త్రిఫల చూర్ణాన్ని ఆహారంలో చేర్చుకోండి. ఇది శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా మారుస్తుంది. భోజనానికి ముందు గ్లాసు గోరువెచ్చటి నీటిలో చెంచా త్రిఫల చూర్ణాన్ని వేసి తాగితే చక్కటి ఫలితాలు కనిపిస్తాయి.
  5. శొంఠి పొడిని గోరువెచ్చని నీటిలో వేసుకుని తాగినా పొట్టలోని కొవ్వు కరుగుతుంది. లేదా అల్లాన్ని నేరుగా కూరలు, టీలో వేసుకుని తీసుకోవచ్చు.
  6. రోజూ అరగంటపాటు నడవడం వల్ల కూడా పొట్ట తగ్గుతుంది. యోగా, పిలేట్స్‌నూ సాధన చేస్తే మరింత త్వరగా కొవ్వు కరుగుతుంది.
  7. ఉదయం పరగడుపున మొదలుకుని మీకు దాహం వేసినప్పుడల్లా ‘గోరువెచ్చని’ నీళ్లను తాగండి. ఇలా చేస్తే జీవక్రియలు వేగవంతమై బరువు తగ్గుతారు. వేడి నీళ్లను మాత్రం ఎక్కువగా తాగొద్దు.
  8. ఆహారం బాగా నమిలి తినాలి. ఇలా చేస్తే నోట్లోనే చాలా వరకు ఆహారం జీర్ణమవుతుంది. అంతేకాదు పొట్ట నిండిన భావన కలిగి తక్కువగా తింటాం.
  9. దాల్చిన చెక్క చక్కటి సువాసనలనిచ్చే సుగంధ ద్రవ్యం. అంతే కాదు రోగనిరోధకతనూ పెంచి జీవక్రియల రేటును మెరుగుపరుస్తుంది. దీంతో చేసిన పదార్థాలను తీసుకుంటే పొట్ట నిండిన భావన కలిగి చాలాసేపటి వరకు ఆకలి వేయదు. కాబట్టి దీంతో చేసిన టీను తరచూ తాగితే పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరుగుతుంది.

ఇవీ చూడండి: శృంగారంతో ఇమ్యూనిటీ పెరుగుతుందా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.