ETV Bharat / sukhibhava

పురాతన ఆయుర్వేద పద్ధతిలో.. నోరు శుభ్రమైపోతుంది! - oil pulling tips

నోరు శుభ్రంగా ఉంచుకోవడం ఎంతో అవసరం. పళ్లు దృఢంగా ఉంటేనే కదా శరీరానికి మంచి పోషకాలు అందుతాయి. అప్పుడే కదా మనం సంపూర్ణ ఆరోగ్యం పొందుతాం. మరి నోటిని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు పురాతన ఆయుర్వేదంలో ఉన్న పద్ధతులేంటో చూసేద్దాం రండి...!

know-uses-of-oil-pulling-and-how-to-do-oil-pulling
పురాతన ఆయుర్వేద పద్ధతిలో నోరు మంచిదైపోతుంది!
author img

By

Published : Jul 26, 2020, 10:31 AM IST

ఉదయాన్నే లేచి బ్రష్‌ చేసుకున్న తర్వాత మౌత్‌వాష్‌తో నోరు పుక్కిలించడం మనలో చాలామంది చేసేదే. దంతాలు-చిగుళ్ల ఆరోగ్యానికి, నోటి దుర్వాసనను దూరం చేయడానికి ఈ ప్రక్రియ బాగా తోడ్పడుతుంది. అయితే సాధారణంగా బయట దొరికే మౌత్‌వాష్‌లలో ఉండే రసాయనాల గాఢత నోటి ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అందుకే మన వంటింట్లో ఉండే కొన్ని రకాల నూనెలతో నోటిని పుక్కిలించడం వల్ల నోరు శుభ్రపడడమే కాదు.. ఇతర ఆరోగ్య ప్రయోజనాలూ చేకూరతాయని వారు సూచిస్తున్నారు.

know-uses-of-oil-pulling-and-how-to-do-oil-pulling
ఆరోగ్యానికి.. ‘ఆయిల్‌ పుల్లింగ్’!

ఆరోగ్యానికి.. ‘ఆయిల్‌ పుల్లింగ్’!

ఆయిల్‌ పుల్లింగ్‌ అనేది ఒక పురాతన ఆయుర్వేద పద్ధతి. దీన్ని ‘కవల’, ‘గండూషా’ అనే పేర్లతో కూడా పిలుస్తారు. పరగడుపునే కొద్దిగా నూనెను నోట్లో వేసుకొని కొన్ని నిమిషాల పాటు పుక్కిలించి.. ఆ తర్వాత ఉమ్మివేయాలి. దంతాలు-చిగుళ్ల ఆరోగ్యానికి ఇదొక అద్భుతమైన ప్రక్రియ. అలాగే నోటిని తాజాగా ఉంచడానికీ ఇది తోడ్పడుతుంది. శరీరంలోని విషపదార్థాలను బయటికి పంపించి వేయడానికీ ఆయిల్‌ పుల్లింగ్‌ సహకరిస్తుంది. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో మనమంతా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, రోగనిరోధక శక్తిని పెంచుకోవడంలోనూ ఆయిల్ పుల్లింగ్ కీలక పాత్ర పోషిస్తుంది.

ఈ ప్రయోజనాలు కూడా!

  • ఈ ఆయిల్‌ పుల్లింగ్‌ ప్రక్రియ ద్వారా బోలెడన్ని ప్రయోజనాలు చేకూరతాయంటున్నారు నిపుణులు. అవేంటంటే..!
  • మన నోట్లో దాదాపు 700 రకాల బ్యాక్టీరియాలుంటాయట! అందులో కొన్ని హానికారకమైనవి కూడా ఉంటాయి. అవి పంటి నొప్పి, చిగుళ్లకు సంబంధించిన వ్యాధులు, నోటి దుర్వాసనకు కారణమవుతాయి. అయితే ఆయిల్‌ పుల్లింగ్‌ ప్రక్రియ ఇలాంటి బ్యాక్టీరియాను సమూలంగా నాశనం చేసినట్లు కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది.
  • నోటిని చక్కగా శుభ్రపరచుకోకపోవడం, నోటి ఇన్ఫెక్షన్లు, చిగుళ్లలో సమస్యల వల్ల నోటి దుర్వాసన రావడం కామన్‌. అయితే ఈ సమస్య నుంచి బయటపడాలంటే బయట దొరికే మౌత్‌వాష్‌ల కంటే మన వంటింట్లో ఉండే నూనెలే సమర్థంగా పనిచేస్తున్నట్లు మరో పరిశోధనలో తేలింది.

  • చక్కెర, చక్కెర సంబంధిత పదార్థాలు అధికంగా తీసుకోవడం, దంతాల మధ్య చిక్కుకున్న పదార్థాల అవశేషాలను తొలగించుకోకపోవడం వల్ల పళ్లు పుచ్చిపోవడం మనం గమనిస్తూనే ఉంటాం. ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి నిపుణులు సూచించే అద్భుతమైన చిట్కా ఆయిల్‌ పుల్లింగ్‌. రోజూ ఉదయాన్నే బ్రష్‌ చేసుకున్న తర్వాత ఆయిల్‌ పుల్లింగ్‌ చేయడం వల్ల క్యావిటీస్‌ని కలిగించే బ్యాక్టీరియా నశిస్తుంది.
  • చిగుళ్లలో వాపు, రక్తస్రావం.. వంటి సమస్యలు కొంతమందిలో తలెత్తుతాయి. అలాంటి వారు ఈ ఆయిల్‌ పుల్లింగ్‌తో ఉపశమనం పొందచ్చు.
  • దంతాలపై పేరుకున్న పాచి, పసుపుదనాన్ని తొలగించి.. పళ్లను మెరిపించడంలోనూ ఈ ఆయుర్వేద పద్ధతి చక్కగా ఉపయోగపడుతుంది.
  • ఆయిల్‌ పుల్లింగ్‌ ప్రక్రియ ద్వారా దవడ, మెడ కండరాలకు చక్కటి వ్యాయామం అందుతుంది. తద్వారా ఆయా భాగాల్లో ఏదైనా నొప్పి ఉంటే తగ్గిపోతుంది.

ఎలా చేయాలంటే?

  • నోటి ఆరోగ్యానికి దోహదం చేసే ఆయిల్‌ పుల్లింగ్‌ ప్రక్రియను పాటించడానికీ ఓ పద్ధతుందంటున్నారు దంత వైద్య నిపుణులు. ఈ క్రమంలో ముచ్చటగా ఈ మూడు చిట్కాల్ని పాటించాలని సూచిస్తున్నారు.

  • ఆయిల్‌ పుల్లింగ్‌కి కొబ్బరి/ఆలివ్‌/నువ్వుల నూనెలు చక్కటి ఎంపిక. వీటిలో ఏదో ఒక దాన్ని ఎంచుకొని టేబుల్‌స్పూన్‌ నూనెను నోట్లోకి తీసుకోవాలి.
  • ఆపై ఇరవై నిమిషాల పాటు ఆ నూనె నోట్లోని మూలమూలకు వెళ్లేలా పుక్కిలిస్తూ ఉండాలి. ఈ క్రమంలో దీన్ని మింగకుండా జాగ్రత్తపడాలి. పని పూర్తయ్యాక ఉమ్మివేయాలి.
  • ఇక ఏదైనా తినేముందు లేదా తాగే ముందు నోటిని శుభ్రపరచుకొని ఆ తర్వాత ఆహారం తీసుకోవడం మంచిది.

నోటి ఆరోగ్యానికి, పరిశుభ్రతకు ఆయిల్‌ పుల్లింగ్‌ ఏవిధంగా ఉపయోగపడుతుందో తెలుసుకున్నారుగా! కాబట్టి మనమూ రోజూ బ్రష్‌ చేసుకోగానే ఈ చిట్కా పాటించేద్దాం.. నోటిని పరిశుభ్రంగా, తాజాగా ఉంచుకుందాం.. ఏమంటారు?

ఇదీ చదవండి: మనసు బాలేదా? అయితే ఇలా చేయండి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.