Kidney Problems During Summer: కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఎండాకాలంలో మరిన్ని అవస్థలకు గురవుతుంటారు. అయితే ఎలాంటి సమస్యలు లేనివారు కూడా తీవ్ర ఉష్ణోగ్రతల బారినపడితే కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. మరి అలాంటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎండాకాలానికి, కిడ్నీలకు సంబంధం ఉంటుంది. వేసవిలో కిడ్నీ వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. భౌగోళికంగా కొన్ని దేశాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. ఆ ప్రదేశాల్లో కిడ్నీ జబ్బులు అధికంగా ఉంటున్నట్లు పరిశోధనల్లో తేలింది. ఎక్కువ ఉష్ణోగ్రతల బారినపడటం సహా తక్కువ నీరు తాగేవారిలో కిడ్నీ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
కిడ్నీ సమస్యలున్నవారు వేసవిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కిడ్నీ రోగులు చాలా త్వరగా డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతో కిడ్నీ పనిచేయడం తగ్గిపోతుంది. ఎండలో ఎక్కువగా తిరిగితే.. సమస్య మరింత తీవ్రమవుతుంది. కాబట్టి ఫ్లూయిడ్స్ తీసుకుంటూ ఉండాలి. ప్రతి గంటకూ ఒకటి, రెండు గ్లాసుల నీరు తాగాలి
- నీడపట్టున ఉండటానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉండాలి
- పద్ధతి ప్రకారం భోజనం చేయాలి
- కిడ్నీ ఫెయిల్యూర్ ఉంటే మాంసాహారం తగ్గించాలి
- కిడ్నీలో రాళ్లు ఉన్నా ఇవే జాగ్రత్తలు పాటించాలి
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: వేసవిలో షుగర్ పెరగడానికి కారణం అదే.. ఏం చేయాలంటే?