ETV Bharat / sukhibhava

International Yoga Day 2023 : ఫిట్​గా ఉండాలా?.. ఈ 5 ఆసనాలు వేస్తే చాలు!

International Yoga Day 2023 : ఫిట్‌నెస్, ఆరోగ్య స్పృహ పెరిగిన నేపథ్యంలో చాలామంది జీవితాల్లో యోగా ఓ భాగమైపోయింది. దీనివల్ల శారీరకంగానే కాదు.. మానసికంగానూ ఎన్నో ప్రయోజనాలను పొందచ్చు. ఈ నేపథ్యంలో.. సులభంగా చేసుకునే కొన్ని ఆసనాల గురించి తెలుసుకుందాం.

International Yoga Day 2023
International Yoga Day 2023
author img

By

Published : Jun 21, 2023, 12:30 AM IST

Updated : Jun 21, 2023, 6:21 AM IST

International Yoga Day 2023 : ప్రతి ఏడాది జూన్​ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకొంటారు. దీనిని 2015లో ప్రారంభించారు. 2014లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. యోగాకు ప్రత్యేకంగా ఒకరోజు ఉండాలని ప్రతిపాదించారు. దీనికి 193 దేశాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. దీంతో ప్రతి ఏడాది జూన్​ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని 2014 డిసెంబర్​ 11న ఐరాస ప్రకటించింది. ఫలితంగా శారీరక, మానసిక ఆరోగ్యం కోసం యోగా ఎంత ఉపయోగపడుతుందో ప్రపంచవ్యాప్తంగా అవగాహన కలుగుతోంది. ఈ ఏడాది 'వసుదైక కుటుంబానికి యోగా' అనే థీమ్​తో ప్రచారం చేస్తున్నారు. ఈ జూన్​ 21న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐక్యరాజ్య సమితిలో యోగా చేయనున్నారు.

యోగాతో శారీరక ఆరోగ్యంతో పాటు ఎన్నో మానసిక ప్రయోజనాలు ఉన్నాయి. యోగా.. కండరాలు, జాయింట్లతో పాటు మొత్తం శరీరాన్ని దృఢంగా చేస్తుంది. రోజూ యోగా ప్రాక్టీస్ చేస్తే ప్రశాంతంగా నిద్రపోతారు. ఒత్తిడిని తగ్గించి పాజిటివ్ థింకింగ్​ను పెంచుతుంది. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కూడా కోలుకునేందుకు.. యోగా ఉపకరిస్తుంది. క్రమం తప్పకుండా యోగా చేయడం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండొచ్చని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంట్లోనే చేసుకునే ఐదు యోగాసనాలు, వాటి ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకోండి. నిత్యం వీటిని ఆచరించి ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నించండి.

శవాసనం
Shavasana Benefits : ఈ ఆసనం ఒత్తిడిని తగ్గించి శరీరానికి విశ్రాంతిని ఇస్తుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతాయి. ముఖ్యంగా నిద్రలేమి సమస్య దూరమవుతుంది. ఈ ఆసనం చేయడం కూడా సులభమే. ఈ ఆసనం వేసేందుకు వెల్లకిలా పడుకోవాలి. కాలి మడమలు లోపలికి, కాలి వేళ్లు బయటకు ఉండేలా రెండు కాళ్లను అడుగు దూరంలో ఉంచాలి. చేతులను శరీరం పక్కన ఉంచాలి. అరచేతులు ఆకాశం వైపు ఉండేలా పెట్టి చేతి వేళ్లను కొంచెం ముడిచి ఉంచాలి. ప్రశాంతంగా కళ్లు మూసుకుని విశ్రాంత స్థితిలో ఉండాలి.

International Yoga Day 2023
శవాసనం

వజ్రాసనం
Vajrasana Benefits : ఇది సులభంగా కూర్చొని చేసే ఆసనం. ఈ ఆసనం వల్ల అనేక లాభాలున్నాయి. కాలి కండరాలతో పాటు మడమలకు ఈ ఆసనం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఆసనం మొదలుపెట్టినపుడు మీ మడిమలు నొప్పి పెడతాయి. కొన్ని నిమిషాలు చేసిన తర్వాత మీకే అలవాటు అవుతుంది. ఈ ఆసనం వేసేందుకు మోకాళ్లపై కూర్చోవాలి. మడమలు, కాలి వేళ్లను లోపలికి పెట్టుకుని చేతులను మోకాలిపై ఉంచాలి.

International Yoga Day 2023
వజ్రాసనం

అపనాసనం
Apanasana Benefits : ఈ యోగాసనం వెన్నెముకను సాగదీసి నడుము నొప్పిని తగ్గిస్తుంది. అంతేకాకుండా వెన్నుముకను దృఢంగా చేస్తుంది. ఈ ఆసనం వేసేందుకు సాధారణంగా పడుకోవాలి. ఆ తర్వాత మోకాలు, తుంటిని వంచి చేతులతో పట్టుకోవాలి. అనంతరం మోకాళ్లను ఛాతీకి తాకేలా పెట్టి శ్వాస తీసుకోవాలి.

International Yoga Day 2023
అపనాసనం

పద్మాసనం
Padmasana Benefits : యోగాలో ఎంతో ముఖ్యమైన ఆసనాలలో పద్మాసనం ఒకటి. మొదట్లో ఈ ఆసనం వేయడం కొంచెం కష్టమే అయినా.. రోజు ప్రాక్టీస్ చేస్తే సులభంగా మారుతుంది. ఇది మీ వెన్నెముక, కాలి కండరాలను బలంగా చేస్తుంది. దీంతో పాటు రక్త సరఫరా, జీర్ణ వ్యవస్థను పటిష్ఠం చేస్తుంది. ఈ ఆసనం వేసేందుకు ప్రశాంతంగా కూర్చోవాలి. మీ కుడి మడమను ఎడమ కాలి తొడపై.. ఎడమ మడమను కుడి కాలి తొడపై పెట్టుకోవాలి. అనంతరం మీ కాళ్లను సౌకర్యవంతంగా చేసుకుని చేతులను మోకాలిపై పెట్టుకుని కూర్చోవాలి.

International Yoga Day 2023
పద్మాసనం

ఉత్కటాసనం
Utkatasana Benefits : ఈ ఆసనం వేసేందుకు నిటారుగా నిలబడి మీ పాదాలను కొద్దిగా దూరంగా ఉంచాలి. రెండు చేతులను పైకి చాచాలి. ఇప్పుడు మీరు కుర్చీపై కూర్చున్నట్లుగా మీ మోకాళ్లను నెమ్మదిగా వంచాలి. బ్యాలెన్స్‌ను మెయింటైన్ చేస్తూ వీపును నిటారుగా ఉంచుతూ వీలైనంత వంగేందుకు ప్రయత్నించాలి. కొద్దిసేపు అలాగే ఉండి, ఆపై సాధారణ స్థితికి రావాలి. ఇది వెనుక కండరాలను బలంగా చేస్తుంది. ముఖ్యంగా బ్యాలెన్సింగ్​ను పెంచుతుంది.

International Yoga Day 2023
ఉత్కటాసనం

ఇవీ చదవండి : ఆస్తమాతో బాధపడుతున్నారా.. ఈ యోగాసనాలు వేస్తే అంతా సెట్​!

ఇంట్లోనే చేసుకునే ఐదు ఈజీ యోగాసనాలు... కండరాలకు బలం.. ఒత్తిడి దూరం!

Last Updated : Jun 21, 2023, 6:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.