ETV Bharat / sukhibhava

షుగర్ వ్యాధికి ఇన్సులిన్ తీసుకుంటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే చాలా ప్రమాదం! - ఇన్సులిన్ అంటే ఏమిటి

Insulin injection precautions : మధుమేహంతో బాధపడేవారు ఇన్సులిన్ తీసుకుంటూ ఉంటారు. ఇన్సులిన్ తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎలా పడితే అలా తీసుకుంటే నష్టాన్ని చేకూర్చే అవకాశముంటుంది. ఇన్సులిన్ ఇంజెక్షన్ వాడకంల పాటించాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.

Insulin Precautions
Insulin Precautions
author img

By

Published : May 19, 2023, 11:11 AM IST

Insulin injection precautions : ప్రపంచ దేశాల్లో కాదు.. భారతదేశంలోనూ ఎక్కువమంది మధుమేహ వ్యాధితో బాధపడుతున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. మధుమేహం రోగులు రక్తంలోని షుగర్ స్థాయిలను అదుపులో పెట్టుకునేందుకు మందులతో పాటు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటూ ఉంటారు. ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Insulin injection for diabetes : దేశంలో ఎక్కువమంది ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక వ్యాధుల్లో షుగర్ ఒకటి. ఒకసారి మధుమేహం వచ్చిందంటే జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. రక్తంలోని షుగర్ స్థాయిలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. దీంతో మధుమేహం రోగులు బ్లడ్‌లోని షుగర్ స్థాయిలను అదుపులో పెట్టుకుంటూ ఉండాలి. షుగర్ లెవల్స్ నియంత్రణలో లేకపోతే అనేక వ్యాధులు వచ్చే ప్రమాదముంటుంది.

Insulin administration procedure : షుగర్ స్థాయిలు అదుపులో పెట్టుకునేందుకు మందులు, ఇంజెక్షన్లు చాలామంది తీసుకుంటూ ఉంటారు. ఎక్కువమంది ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటూ ఉంటారు. కానీ ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇన్సులిన్‌ను ఇంట్లో ఎక్కబడితే అక్కడ పడేయకూడదు. ఫ్రిడ్జ్‌లో వైద్యులు సూచించిన ఉష్ణోగ్రతల స్థాయిల వద్ద భద్రపరుచుకోవాలి.

How to do store injection : : ఇన్సులిన్ పెన్స్‌ను వేరే ప్రాంతానికి తీసుకెళ్లేటప్పుడు ఉష్ణోగ్రతల్లోని మార్పుల వల్ల ఇవి పాడైపోతూ ఉంటాయి. దీంతో బయటకు తీసుకెళ్లేటప్పుడు ఐస్ ప్యాక్‌లో పెట్టుకుని తీసుకెళ్లాలి. ఇలా చేయకుండా తీసుకెళితే ఇన్సులిన్ పెన్‌లు పాడైపోయి సరిగ్గా పనిచేయకుండా ఉండే అవకాశం ఉంటుంది.

How to do insulin injection : పొట్టభాగంలోని బొడ్డుకి ఇరువైపుల ప్రాంతాల్లో ఎక్కడ నుంచైనా ఇన్సులిన్ తీసుకుంటే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. దీని వల్ల శరీరంలోకి ఇన్సులిన్ బాగా వెళ్లడంతో పాటు మెరుగ్గా పనిచేస్తుందని అంటున్నారు. ఇన్సులిన్ ఇంజెక్షన్లలో అనేక రకాల ఇంజెక్షన్లు ఉన్నాయి. అందులో ఒకటి ర్యాపిడ్ యాక్టింగ్ ఇన్సులిన్. ర్యాపిడ్ యాక్టింగ్ ఇన్సులిన్ శరీరంలోకి వెళ్లిన కొద్ది నిమిషాలకే పనిచేయడం ప్రారంభిస్తుంది. కొద్దిగంటలపాటు ఇది శరీరంలో కొనసాగుతుంది.

How does insulin work : అలాగే షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ తీసుకుంటే పనిచేయడానికి 30 నిమిషాలు పడుతుంది. ఇది మూడు నుంచి ఆరు గంటల పాటు కొనసాగుతుంది. ఇక ఇంటర్మీడియట్ యాక్టింగ్ ఇన్సులిన్ అయితే తీసుకున్న రెండు నుంచి మూడు గంటల తర్వాత పూర్తిగా పనిచేయడం మొదలవుతుంది. ఇక లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ తీసుకుంటే ఒక రోజు మొత్తం పనిచేస్తుంది. పాతకాలం ఇన్సులిన్ ఇంజెక్షన్లను అయితే భోజనం చేయడానికి 20 నిమిషాల ముందు తీసుకోవచ్చు.

కొత్త రకం షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ ఇంజెక్షన్లు అయితే ఆహారం తీసుకునేటప్పుడు లేదా తీసుకునే ముందు గుచ్చుకోవాలి. ఆహారానికి 20 లేదా 30 నిమిషాల ముందు తీసుకోవడం వల్ల 'లో షుగర్‌'కు దారితీస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ రోజులో ఎప్పుడైనా తీసుకోవచ్చు. కానీ ఒకరోజు పొద్దున లేదా ఒకరోజు రాత్రి తీసుకోకూడదు. వైద్యులను సంప్రదించి సరైన సమయాన్ని ఎంచుకుని తీసుకోవాలి.

అలాగే ఇన్సులిన్ మోతాదు ఎంత తీసుకోవాలనేది కూడా వైద్యులను అడిగి తెలుసుకోవాలి. ఎక్కువ డోస్ తీసుకుంటే షుగర్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఏర్పడి నష్టాన్ని కలిగించవచ్చు. దీంతో సరైన పద్దతుల్లో ఇన్సులిన్‌ను వాడటం వల్ల షుగర్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడంతో పాటు మధుమేహం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలను దూరం చూసుకోవచ్చు.

పొట్ట భాగంలోని బొడ్డుకు అంగుళం దూరంలో ఎక్కడైనా ఇన్సులిన్ వేసుకోవచ్చు. తొడ వెలుపలి, మధ్య భాగాల్లో కూడా ఇన్సులిన్ తీసుకోవచ్చు. ఇన్సులిన్ తీసుకున్న తర్వాత ఆహారం తినకపోతే మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే జిమ్‌లకు వెళ్లేవారు, ఇంట్లోనే వ్యాయామం చేసేవారు ఇన్సులిన్ తీసుకున్న వెంటనే వ్యాయామం చేయకూడదు. ఈ జాగ్రత్తలన్ని పాటించడం వల్ల ఇన్సులిన్ బాగా పనిచేస్తుందని డాక్టర్లు సూచిస్తున్నారు.

ఇన్సులిన్ తీసుకునేముందు జాగ్రత్త!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.