మధుమేహం వ్యాధిగ్రస్థులకు తీపి కబురు అందించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ఐఐటీ మండీ శాస్త్రవేత్తలు. ఓపియమ్ డ్రగ్ నాల్ట్రిక్సోన్తో టైప్-2 డయాబెటిస్‌ను తగ్గించవచ్చని తమ అధ్యయనాల్లో వెల్లడైందని వివరించారు.
శరీరంలో అధిక మొత్తంలో విడుదలైన ఇన్సులిన్ టైప్-2 డయాబెటిస్‌కు దారి తీస్తుందని వెల్లడించారు. అయితే హైపర్ఇన్సలినీమియా (మధుమేహం) వ్యాధిగ్రస్థుల్లో కీలకమైన ప్రొటీన్‌ను నాల్ట్రిక్సోన్ డ్రగ్‌లో కనుగొన్నామని తెలిపారు. ఈ డ్రగ్ తీసుకున్నప్పుడు ప్రొటీన్ రిలీజై షుగర్ లెవెల్స్‌ను తగ్గించేందుకు తోడ్పడుతుందని వివరించారు.