ETV Bharat / sukhibhava

మీరు కూడా అలా నిద్రపోతున్నారా? అయితే జాగ్రత్త! - health problems

Sleep Position Effects: ఆకలిగా అనిపించగానే ఏదో ఒకటి తినాలనే కోరిక కలిగినట్లుగానే.. నిద్ర రాగానే ఎక్కడో చోట కాసేపు పడుకోవాలనుకోవడం సహజమే. అయితే.. మనం నిద్రపోయే ప్రాంతం, తీరును బట్టి ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. నిద్ర పోయే తీరు మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు చూద్దాం.

How Your Sleep Position Effects Your Health

author img

By

Published : Apr 2, 2022, 10:18 AM IST

Sleep Position Effects: రోజూ సగటున 8 గంటల నిద్ర అవసరమని వైద్యులు చెబుతుంటారు. అయితే ప్రస్తుతకాలంలో చాలా మంది దీనిని పెద్దగా పట్టించుకోవట్లేదు. కంటికి నిద్ర దూరమైతే ఎన్నో రకాల వ్యాధులకు దారి తీస్తుందని చాలా మందికి తెలియదు. సరిగా నిద్రపోక లేనిపోని రోగాలను కొనితెచ్చుకుంటున్నారు. అయితే.. నిద్ర పోవడం అనేది శారీరక శ్రమపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అధిక శారీరక శ్రమ చేసేవారికి మంచి నిద్ర ఉంటుందని అంటున్నారు.

అలాగే మనం నిద్ర పోయే విధానాలు, భంగిమలు ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తాయి. డైరెక్ట్​గా కాకున్నా.. నిద్ర పోయే తీరు కచ్చితంగా ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్నిసార్లు ఇబ్బందులు ఎక్కువయ్యే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ముఖ్యంగా వెల్లకిలా అంటే నడుంపై పడుకోవడం కరెక్ట్ కాదని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల నడుం నొప్పి ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయని సెలవిస్తున్నారు. గురకపెట్టి నిద్రపోయేవారు స్ట్రెయిట్​గా పడుకోవడం మంచిది కాదంట. భుజాలపై పడుకోవడం వెన్నెముక, మెడ ఆరోగ్యానికి మంచిదని.. కానీ ఈ భంగిమ గురక సమస్యకు దారి తీయొచ్చని వివరిస్తున్నారు. ఇంకా ఎలాంటి భంగిమలు మంచి నిద్రకు కారణమవుతాయి? ఏ పొజిషన్లు.. ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయో ఈ వీడియోలో చూడండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి: రాత్రి నిద్రపట్టడం లేదా? ఈ చిట్కాలు ట్రై చేయండి!

ఒకసారి శృంగారం.. ఎన్ని మైళ్ల నడకకు సమానమో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.