ETV Bharat / technology

అబ్బబ్బా ఏమి డిమాండ్ రా సామీ!- 11 నెలల్లో లక్షమంది కొన్న కారు ఇదే! - KIA SONET SALES IN INDIA

రికార్డ్ స్థాయిలో కియా సోనెట్ ఫేస్​లిఫ్ట్ సేల్స్- సన్​రూఫ్​ వేరియంట్​కూ ఫుల్ డిమాండ్!

Kia Sonet Facelift
Kia Sonet Facelift (Photo Credit- Kia India)
author img

By ETV Bharat Tech Team

Published : Dec 29, 2024, 2:44 PM IST

New Kia Sonet Sale In India: కియా మోటార్స్ కొత్త సోనెట్ మార్కెట్లో సంచలనం సృష్టించింది. ఈ ఫేస్​లిఫ్ట్ కారును ప్రారంభించిన 11 నెలల్లోనే లక్ష సేల్స్ మార్క్​ను దాటింది. ప్రతినెలా సగటున ఈ సోనెట్ 10,000 వాహనాలు అమ్ముడవుతున్నాయంటే ఇది ఎంత ప్రజాదరణతో దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

కంపెనీ ఈ కియా సోనెట్ ఫేస్​లిఫ్ట్​ను జనవరి 2024న రూ. 7.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో ప్రారంభించింది. ప్రస్తుతం మార్కెట్లో పెట్రోల్ వేరియంట్‌లు ఎక్కువ ప్రాచుర్యం పొందుతున్నాయి. సన్‌రూఫ్‌లు ఉన్న వాహనాలకు కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో కస్టమర్ల ఆసక్తి, అభిరుచులను గుర్తించి వారి అవసరాలను తీర్చే విధంగా దీన్ని లాంఛ్ చేయడంతోనే ఈ ఘన విజయం సొంతమైందని కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇక ఈ కొత్త కియా సోనెట్ కారు 6 డిఫరెంట్ పవర్​ట్రెయిన్ ఆప్షన్లతో 22 విభిన్న వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది.

సేల్స్ డేటా ప్రకారం.. 76 శాతం మంది వినియోగదారులు పెట్రోల్ ఇంజిన్ వాహనాలపై మొగ్గు చూపిస్తున్నారు. అయితే 24 శాతం మంది మాత్రం డీజిల్ ఇంజిన్‌లను ఎంచుకుంటున్నారు. ఈ మొత్తం సేల్స్​లో ఆటోమేటిక్ అండ్ ఇంటెలిజెంట్ మాన్యూవల్ ట్రాన్స్‌మిషన్ (iMT) ఉన్న వేరియంట్స్ 34 శాతం వాటాను కలిగి ఉన్నాయి. iMT అంటే ఇంటెలిజెంట్ మాన్యువల్ సిస్టమ్. ఇది మాన్యువల్-గేర్డ్ వెహికల్​లో క్లచ్ ఆపరేషన్‌ను ఆటోమేట్ చేసే సిస్టమ్. ఇది డ్రైవింగ్‌ను మరింత సులభతరం చేస్తుంది.

సన్‌రూఫ్ వేరియంట్లకూ భారీ డిమాండ్: కొత్త కియా సోనెట్ సన్‌రూఫ్ వేరియంట్‌లకు కూడా ఫుల్ డిమాండ్ ఉంది. కంపెనీ విక్రయించిన ఈ వెహికల్స్​లో 79 శాతం సన్​రూఫ్​లు ఉన్న వేరియంట్లే ఉన్నాయి. ఈ కొత్త సొనెట్ భద్రతా పరంగా కూడా మెరుగ్గానే ఉంది. ఇందులో 15 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అధునాతన డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్‌లో లెవల్-1 ఫీచర్లు, 70 కంటే ఎక్కువ కనెక్టింగ్ ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. ఇందులో డ్రైవింగ్ సేఫ్టీ ADAS టెక్నాలజీ సూట్​ కూడా ఉంది. ఈ సూట్.. లేన్ కీపింగ్ అసిస్ట్, ఆటోమేటిక్ సడన్ బ్రేకింగ్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ కారులోని కనెక్టింగ్ ఫీచర్లతో వాహనాన్ని మీ స్మార్ట్‌ఫోన్‌కి కూడా కనెక్ట్ చేసుకుని అనేక పనులు చేసుకోవచ్చు.

యాపిల్ లవర్స్​కు షాక్- చాలా దేశాల్లో ఈ 3 ఐఫోన్ల విక్రయాలు బంద్!- ఎందుకో తెలుసా?

మార్బుల్ ఫినిష్​తో లావా కొత్త 5G ఫోన్- కేవలం రూ.9,499లకే!- ఇంటివద్దే ఫ్రీ సర్వీస్ కూడా!

'విశ్వంలో డార్క్ ఎనర్జీ అనేదే లేదు- ఆ సిద్ధాంతాలు తప్పు'- వీడిన అతిపెద్ద మిస్టరీ!

అత్యాధునిక ఫీచర్లతో 2025 హోండా యూనికార్న్- ధర కూడా పెరిగిందిగా!- ఇప్పుడెంతంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.