ETV Bharat / sukhibhava

ఈ వ్యాయామ చిట్కాలతో బద్దకానికి చెక్​! - ఫిట్​నెస్​ సూత్రాలు

కరోనా లాక్​డౌన్​తో ఇంట్లోనే ఉంటున్నారా? ఈ సమయంలో వ్యాయామమే మిమ్మల్ని చురుకుగా ఉండేలా చేస్తుంది. వ్యాయామం చేయకుంటే దుష్ప్రభావాలు తప్పవని వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. వ్యాయామం చేసేలా మీకు ప్రేరణ కల్పించేందుకు జాతీయ వెయిట్​ లిఫ్టర్​, క్రాస్​ఫిట్ కోచ్​ ప్రదీప్​ మౌర్య అందించిన సూచనలు మీకోసం.

home workout
వ్యాయామం
author img

By

Published : Jun 5, 2020, 10:01 AM IST

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మన ఆరోగ్య జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. మానసిక, శారీరక ఆరోగ్యానికి వ్యాయామం చాలా అవసరం. కానీ కొన్నిసార్లు వ్యాయామాన్ని వదిలేసి, బర్గర్లు తింటూ ఒకేచోట కూర్చొని ఉద్యోగం చేస్తుంటే.. ఆ ప్రభావం పనితోపాటు వ్యక్తిగత జీవితంపై పడుతుంది. ఆ ఇబ్బందులను తొలగించుకునేందుకు జాతీయ వెయిట్​లిఫ్టర్, క్రాస్​ఫిట్ కోచ్​​ ప్రదీప్ మౌర్య కొన్ని చిట్కాలు చెబుతున్నారు. ఈ లాక్​డౌన్ సమయంలో మీ ఫిట్​నెస్​ ఎందుకు కాపాడుకోవాలో కూడా వివరిస్తున్నారు.

ఎందుకో గుర్తించండి..

పెళ్లికి వెళ్లాలి, స్నేహితులను కలవాలి, ఏదైనా కార్యక్రమానికి హాజరుకావాలి అనే బయటి విషయాలపై ఆధారపడకండి. వాటి సాకుతో వ్యాయామాన్ని దాటవేయకండి. వ్యాయామం చేస్తే మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో గుర్తుకు తెచ్చుకోండి.

ఆలస్యం వద్దు..

మీకు వ్యాయామం ప్రయోజనాలు తెలిస్తే సరిపోదు. చురుకుగా లేకపోతే శరీరానికి ఎలాంటి నష్టాలు జరుగుతాయో తెలుసుకోవాలి. అందువల్ల ఎప్పుడూ వ్యాయామాన్ని దాటవేయాలని ఆలోచించకండి. ఇందుకు వయసుతో నిమిత్తం లేదు.

నెమ్మదిగా ప్రారంభించండి..

మీరు వ్యాయామాన్ని ప్రారంభిస్తే.. మొదట ఒళ్లు నొప్పులు, బద్దకం బాధిస్తాయి. ఇందుకు చాలా నెమ్మదిగా వ్యాయామం చేయాలి. రోజూ వ్యాయామం చేయడానికి 30 నిమిషాలు కేటాయించాలని మీరు విని ఉంటారు. కానీ మీది సెడేటరీ(అతి బద్దకం) జీవనశైలి అయితే.. ఈ సిఫార్సులను లక్ష్యంగా పెట్టుకోకండి. రోజురోజుకూ నెమ్మదిగా సమయాన్ని పెంచటం ఎల్లప్పుడూ మంచిది.

ఇష్టంతో చేయండి..

మనం చేసే పనిపై మనకు ఆసక్తి, ఇష్టం లేకపోతే మనసు కూడా అంగీకరించదు. అందువల్ల.. చేసే పనిని ఎంజాయ్​ చేయండి. లేదంటే ఎక్కువ సేపు మనం వ్యాయామం చేయలేము.

లక్ష్యం పెట్టుకోండి..

మీరు పరిగెడుతారా? లేదంటే శరీరాకృతి కోసం కృషి చేస్తున్నారా? అన్నది ఆలోచించుకోవాలి. కారణం వెతుక్కుని ప్రయత్నిస్తే మీకు ఎప్పుడూ ప్రేరణ లభిస్తుంది. ఉదాహరణకు మధుమేహం స్థాయి, ఒబెసిటీ రేట్​, ఒత్తిడి నియంత్రణ.. ఇలా మన అవసరాన్ని బట్టి ఎంచుకుంటే మంచిది. కారణం ఉంటే మీకు మరింత ప్రయోజనం కలుగుతుంది.

ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి..

ఎలాంటి పరిస్థితుల్లోనైనా వ్యాయామం చేయటానికి సిద్ధంగా ఉండాలి. మరీ అత్యవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. ఉదాహరణకు.. ఈ లాక్​డౌన్​లో జిమ్​లు మూతపడ్డాయి. ఈ సమయంలో బాడీవెయిట్​ ట్రైనింగ్ లేదా యోగా చేయటం మంచిది.

సమయాన్ని నిర్దేశించుకోండి..

ఏ వ్యాయామం చేయాలి? ఎంతసేపు చేయాలి? ఎక్కడ చేయాలి? అనే అంశాలను ముందుగానే నిర్ణయించుకోవాలి. ప్రతివారం ప్రణాళిక వేసుకోవాలి. ఇలా రోజూ క్రమం తప్పకుండా చేస్తే అలవాటుగా మారిపోతుంది.

సవాళ్లను గుర్తించండి..

లాక్​డౌన్​ వల్ల ఇప్పుడు అందరూ ఇళ్లలోనే ఉన్నారు. ఇదో సమస్యగా అందరూ భావిస్తున్నారు. ఈ సమయాన్ని ఇంటర్నెట్​లో వచ్చే రోజువారీ వ్యాయామ సవాళ్లతో గడిపేయండి. మీ ఫిట్​నెస్​ లక్ష్యాన్ని అనుసరించి మీరు ఎన్ని సవాళ్లైనా స్వీకరించవచ్చు.

ఎప్పుడైనా, ఎక్కడైనా..

వ్యాయామం అనేది ఎక్కడైనా ఎప్పుడైనా చేయవచ్చు. మెట్లు ఎక్కడం దిగడం; బ్రష్​ చేస్తున్నప్పుడు, ఫోన్​ మాట్లాడుతున్నప్పుడు ఒంటి కాలిపై నిలబడటం.. ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. ప్రత్యేకంగా జిమ్​కు వెళ్లాల్సిన పని లేదు.

వ్యాయామానికి సమయం కేటాయించటం కోసం ఏదైనా లక్ష్యాన్ని పెట్టుకోవాలి. మీరు ఎప్పుడైనా దాటవేయాలనుకుంటే ఆ లక్ష్యం మిమ్మల్ని మళ్లీ ప్రేరేపిస్తుంది.

ఇదీ చూడండి: వేసవిలో 'ఆమ్​ కా పన్నా' తాగాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.