ETV Bharat / sukhibhava

పండగ వేళ.. మీ ఊపిరితిత్తులు జాగ్రత్త! ఈ టిప్స్​ ఫాలో అవ్వండి - దీపావళి పండగ జాగ్రత్తలు

Tips to Maintain Healthy Lungs in Diwali 2023: దీపావళి.. జీవితంలో వెలుగులు నింపే పండగ. ఈరోజు బాణాసంచాను పెద్ద ఎత్తున కాలుస్తారు. అలా కాల్చడం వల్ల వచ్చే కాలుష్యం అంతా ఇంతా కాదు. అది చుట్టు పక్కల ఉన్న గాలిని సైతం కలుషితం చేస్తుంది. ఈ గాలిని పీల్చడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులకు ఎఫెక్ట్​ అవుతంది. మరి అలాంటి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 11, 2023, 9:34 AM IST

How to Protect Lungs in Diwali 2023: దీపావళి అంటే చిన్నా పెద్ద అందరికీ చాలా ఇష్టం. ఈ పండుగ రోజున పెద్దలు కూడా చిన్నపిల్లలలై తమ పిల్లలతో కలసిపోతారు. ఒకప్పుడు దీపావళి అంటే ఇల్లంతా దీపాలు పెట్టడం, కొన్ని టపాసులు పేల్చడం జరిగేది. కానీ ఇప్పుడు మాత్రం అలా లేదు. కేవలం దీపావళి మాత్రమే కాదు శుభకార్యాలు.. మొదలు చాలా సందర్బాలలో బాణసంచా పెద్ద ఎత్తున కాలుస్తున్నారు. దీని కారణంగా వాయుకాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. అంతే కాకుండా గతంతో పోలిస్తే శ్వాస సంబంధ సమస్యలు కూడా ఎక్కువ అయ్యాయి. ఇక దేశం అంతా పెద్ద ఎత్తున జరుపుకునే దీపావళి నాడు బాణసంచా కూడా చాలా ఎక్కువగానే కాలుస్తారు. అయితే బాణాసంచా కాల్చడం వల్ల వచ్చే పొగతో ఎక్కువ ఎఫెక్ట్​ అయ్యేవి.. ఊపిరితిత్తులు.

శ్వాస సంబంధ సమస్యల ముప్పు..: ఇప్పటికే ఆస్తమా, ఊపిరితిత్తుల బలహీనత, ఇతర శ్వాస సంబంధ సమస్యలు ఉంటే దీపావళి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బాణసంచా కాల్చినప్పుడు.. సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, చిన్న రేణువులతో కూడిన అనేక హానికరమైన వాయువులు గాలిలోకి విడుదల అవుతాయి. ఇవి గాలిని కలుషితం చేస్తాయి. ఇవి శ్వాసకోశ వ్యవస్థ ద్వారా శరీరంలోకి ప్రవేశించి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తాయి. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే శ్వాస సంబంధ సమస్యలున్నవారు, మామూలుగా ఉన్నవారు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

దీపావళి స్పెషల్​ గ్రీటింగ్స్ - మీ ఆత్మీయులకు ఇలా శుభాకాంక్షలు చెప్పండి!

ఇంటి లోపల కొవ్వత్తులు వద్దు: ఇంటి లోపల కొవ్వొత్తులు, దియాలను వెలిగించడం మానుకోవాలి. దీని వల్ల ఇండోర్ కాలుష్యం అదుపులో ఉంటుంది. వాటి ప్లేస్​లో LED లైట్లను ఉపయోగించవచ్చు. అలాగే టెర్రస్​ దీపాలు ఉపయోగించండి, ఎందుకంటే అవి పర్యావరణానికి అనుకూలమైనవి. అయినప్పటికీ, అధిక లైటింగ్ కూడా పర్యావరణ కాలుష్యానికి దోహదం చేస్తుంది.

యూజ్​ గ్రీన్​ క్రాకర్స్​: దీపావళికి సంబంధించిన కాలుష్యాన్ని తగ్గించడానికి గ్రీన్ క్రాకర్స్ బెస్ట్​. ఇవి ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ క్రాకర్లు గాలిలోని సూక్ష్మ కణాలు, హానికరమైన వాయువులను 30 నుంచి 40 శాతం వరకు తగ్గిస్తాయి.

తలుపులు మూసేయండి: బయట బాణసంచా కాలుస్తున్నా, టపాసులు పేలుస్తున్నా ఆ సమయంలో పొగ పెద్ద ఎత్తున ఇంట్లోకి వచ్చేస్తుంది. కాబట్టి బయట ఎవరైనా టపాసులు కాల్చుకుంటూ ఉంటే ఇంటి తలుపుల్ని మూసి పెట్టండి. కిటికీ తలుపుల్నీ వేసేయండి.

దీపావళిని ఐదు రోజుల పండగంటారు?-ఎందుకో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి!

మాస్క్..: కరోనా వచ్చినప్పటి నుంచి మాస్క్ వినియోగం పెరిగింది. ఆ మాస్క్​లు అంటువ్యాధుల నుంచే కాదు విపరీతమైన వాయు కాలుష్యం నుంచి కూడా కాపాడుతాయి. బాణసంచా ప్రభావం నుంచి రక్షణ కావాలి అంటే మాస్క్ ధరించడం చాలా మంచిది. మాస్క్​ వేసుకున్న తర్వాత దాన్ని పదే పదే ముట్టుకోవడం, తీసి పెట్టుకోవడం లాంటివి చేయకండి. అందువల్ల అది ఇన్‌ఫెక్ట్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బయటకు వెళ్లి వచ్చిన ప్రతి సారీ రీయూజబుల్‌ మాస్క్‌ అయితే దాన్ని తప్పకుండా ఉతికి శుభ్రం చేసుకోండి. ఇది శ్వాసకోశ సమస్యలు తలెత్తకుండా నిరోధిస్తుంది.

బయటకు వెళ్లొద్దు..: బాణసంచా కాల్చే సమయంలో అసలు బయటకు వెళ్లకుండా ఉండటం ఎంతో మేలు. ఇంట్లో కూడా గాలి వెలుతురు బాగా ఉండేలానూ, గాలి కాలుష్యం అరికట్టడానికి ఎయిర్ ప్యూరిపైయర్లు, గాలి కాలుష్యాన్ని అరికట్టే ఇండోర్ మొక్కలు వంటివి పెంచుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎయిర్ ప్యూరిఫైయర్‌లు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. ఈ పరికరాలు కాలుష్య కారకాలు, టాక్సిన్స్, అలెర్జీ కారకాలను తొలగిస్తాయి.

దీపావళి ఎప్పుడు - 12నా? 13వ తేదీనా? పంచాంగం ఏం చెబుతోంది?

ఇన్​హేలర్​ వాడండి: ఆస్తమా, శ్వాస కోశ సమస్యలున్నప్పుడు చాలా మంది ఇన్ హేలర్ ఉపయోగిస్తుంటారు. బాణసంచా పొగ, వాతావరణ కాలుష్యం మొదలైనవి ఎక్కువగా ఉండే ఈ సమయంలో.. బయట ఉన్నప్పుడు, అందరిలో సందడిగా ఉన్నప్పుడు ఉన్నట్టుండి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఇన్ హేలర్ ను వెంట ఉంచుకోవాలి. శ్వాస సమస్యలు ఏర్పడినప్పుడు ఇన్ హేలర్​లు ఉపయోగపడతాయి.

నోటితో గాలి పీల్చుకోకండి: బయటకు వెళ్లినప్పుడు పొరపాటున కూడా నోటి నుంచి గాలిని పీల్చే ప్రయత్నం చేయకండి. అలా చేయడం వల్ల గాలి ఏ మాత్రం ఫిల్టర్‌ కాకుండా నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోతుంది. అది మీ ఆరోగ్యానికి ఎంత మాత్రమూ మంచిది కాదు.

కళ్లద్దాలు ధరించండి: కాలుష్యం ముందుగా ప్రభావం చూపించేది కళ్లు ఇంకా చర్మం పైనే. కాబట్టి బయటకు వెళ్లాలనుకున్నప్పుడు తప్పకుండా కళ్లద్దాలు ధరించండి.

Note: నిరంతర దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్న ఎవరైనా తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.

దీపావళి వేళ - మీ ఇంటి డెకరేషన్ కోసం సూపర్​ ఐడియాస్​!

భక్తులకు అలర్ట్​ - దీపావళి రోజున తిరుమల వెళ్తున్నారా? ఈ విషయం తెలియకపోతే ఇబ్బందే!

దీపావళి గిఫ్ట్ - ఇలా ప్లాన్ చేస్తే అదుర్స్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.