ETV Bharat / sukhibhava

హెర్బల్​ చాయ్..​ ఆరోగ్యానికి ఎంతో హాయ్​! - drumstick leaf tea

ఎంతటి తలనొప్పైనా సరే చిటికెలో మాయం చేసే ఔషదం చాయ్​.. ఇంటికెవరైనా వస్తే వేడిగా పలకరించే సంప్రదాయం చాయ్​.. స్నేహితుల కబురులకు తోడు​​ చాయ్​.. సీతాకాలంలో చలిని కాచే వెచ్చదనం చాయ్.. లాక్​డౌన్​లో సాయంకాలం సేదదీర్చేది చాయ్​! ఇంతలా మన జీవితంలో భాగమైన చాయ్ ఆరోగ్యానికి హానికరమని చాలామంది చెబుతుంటారు. కానీ, డా. యాస్మిన్ మాత్రం హెర్బల్​​ టీ తాగితే అనారోగ్యమే దరి చేరదంటున్నారు. అదెలా అంటారా?

how to prepare healthy herbal tea by doctors
హెర్బల్​ చాయ్..​ ఆరోగ్యానికి ఎంతో హాయ్​!
author img

By

Published : Jun 7, 2020, 6:47 PM IST

ప్రపంచమంతా ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవరుచుకుంటున్న వేళ.. ఏళ్లుగా అలవాటైపోయిన చాయ్​ని వదిలి ఉండలేక, తాగి అనారోగ్యం తెచ్చుకోలేక సతమతవుతున్నారు చాయ్ ప్రియులు. అయితే ఎంతో ఇష్టంగా సేవించే టీని కూడా ఆరోగ్యకరంగా మలచుకోవచ్చని అంటున్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డా. యాస్మిన్.​ అవును, చాయ్​కు కాసింత ప్రకృతిని కలిపితే.. మీరు మెచ్చే ఫ్లేవర్లలో హెర్బల్​ టీని ఆస్వాధించమంటున్నారు. ఈ హెర్బల్​ టీతో ఆరోగ్యం మీ సొంతం అవుతుందంటున్నారు.

హెర్బల్​ టీ అంటే..

ఆయుర్వేదం పుట్టిన భారతంలో ఎన్నో ఆరోగ్యవంతమైన పానీయాలను కనుగొన్నారు మన పూర్వీకులు. అందులో ఫాంటా ఒకటి. ఫాంటా​కు మరో పేరే చాయ్. వివిధ రకాల పూలు, వేర్లు, మొగ్గలు, బెరడు, ఆకులు, పళ్లు, గింజలు లేదా ఔషద గుణాలున్న మొక్కలకు చెందిన ఏ భాగంతోనైనా తయారయ్యే టీని హెర్బల్​ టీ అంటారు. హెర్బల్​ టీలో మంచి సువాసన, రుచి, రోగనిరోధక శక్తిని పెంపొందించే సుగుణాలు పుష్కలంగా ఉంటాయి.

how to prepare healthy herbal tea by doctors
హెర్బల్​ చాయ్..​ ఆరోగ్యానికి ఎంతో హాయ్​!

మరి ఆ హెర్బల్​ చాయ్​లు తయారు చేసుకోవడం ఎలా అనుకుంటున్నారా? మీ కోసం పలు రకాల హెర్బల్​ టీ రెసిపీలను ఈటీవీ భారత్​తో పంచుకున్నారు యాస్మిన్​. (ఈ కొలతలన్నీ 100 మి.లీ నీటికి సరిపడతాయి)

రోజ్​ టీతో ఆరోగ్యం

నీటిలో నాలుగైదు ఎండబెట్టిన రోజా రెబ్బలు తీసుకోండి. అందులో 2 గ్రాముల ధనియాలు, చిటికెడు కుంకుమ పువ్వు, అర గ్రాము సోంపు గింజలను వేసి ఐదు నిమిషాల పాటు మరిగించండి. అంతే, వడగట్టేసుకుని తాగడమే. ఈ రోజ్​ టీ మంచి రంగు, రుచిలో ఉంటుంది. జీర్ణక్రియను పెంచుతుంది.. ఎన్నో వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది.

జీలకర్ర చాయ్​​..

ఒక గ్రాము జీలకర్ర, అర గ్రాము లికరిక్​, ఓ గాము అల్లం ముక్క, ఓ గ్రాము ధనియాలు, ఒక గ్రాము లవంగాలు, కొద్దిగా బెల్లం వేసుకున్న నీటిని కనీసం 5 నిమిషాలు మరిగించాలి. కావాలంటే అందులో కాసిన్ని పాలు పోసుకోవచ్చు. బాగా మరిగాక వడగట్టిన టీలో ఇలాచీ వేసుకుని సేవించండి.

ఎంతో రుచిగా ఉండే ఈ జీలకర్ర చాయ్​ ఆకలిని పెంచుతుంది, జీర్ణక్రియ సరిగ్గా జరిగేలా సహకరిస్తుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మలబద్దకాన్ని తరిమికొడుతుంది.

లవంగం టీ​తో క్యాన్సర్​కు చెక్​..

2,3 లవంగాలను నీటిలో వేసుకుని 5 నిమిషాలు మరిగించి వడగట్టుకుని తాగేయండి. ఈ లవంగం చాయ్​ జీర్ణవ్యవస్థను సక్రమంగా నడిపిస్తుంది, క్యాన్సర్​ను దూరం చేస్తుంది, అంటు వ్యాధులను దరి చేరనివదు, శ్వాసకోశ సమస్యలు, ప్రేగు సిండ్రోమ్​ను అదుపు చేస్తుంది.

దాల్చిన చెక్కతో తేనీరు..​

ఓ గ్రాము దాల్చిన చెక్క, ఓ గ్రాము శొంఠి వేసిన నీటిని బాగా మరిగించి, వడగట్టి తాగాలి. అంతే, ఈ దాల్చిన చెక్క చాయ్​.. కఫంతో కూడిన దగ్గు, గొంతు నొప్పి, శ్వాసకోశ అలెర్జీలు, తలనొప్పికి చక్కని ఔషధంగా పని చేస్తుంది. ఇది కోవిడ్ 19ను సైతం నివారిస్తుంది.

ధనియా చాయ్​..

రెండు గ్రాముల ధనియాలు, 2 గ్రాముల జీలకర్ర, ఓ గ్రాము శొంఠిని 5 నుంచి 6 నిమిషాల పాటు బాగా మరిగించి వడపోసుకోవాలి. ఈ ధనియా టీ జీర్ణవ్యవస్థ, శ్వాసకోశ వ్యాధులను తప్పిస్తుంది.

శతమూలీ టీ..

ఇంగ్లీష్​లో అస్పరగస్​గా పిలిచే ఈ శతమూలీ(శతవరి) ఆకులను 5 గ్రాములు తీసుకోండి, అందులో నానబెట్టుకున్న 2 గ్రాముల ధనియాలు వేసి మరగబెట్టండి. ఈ శతమూలీ చాయ్​తో జ్వరం, ఒంటి నొప్పులు, వేడి.. ఆడవారిలో అధిక రక్త స్రావం ఇట్టే తగ్గిపోతాయి.

మునగ తేనీరు​..

అరకప్పు నీటిలో మునగాకు వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత వడగట్టిన మునగ టీలో ఓ టేబుల్​ స్పూన్​ తేనే లేదా చెక్కర వేసుకుని తాగాలి. ఇది, ఊబకాయాన్ని పోగొట్టి శక్తినిస్తుంది, అధిక మొత్తంలో విటమిన్లు, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఈ మునగ టీలో కొలెస్ట్రాల్​ను కరిగించి, క్యాన్సర్​తోనూ పోరాడే గుణాలున్నాయి.

త్రిఫల టీ..

5 గ్రాముల త్రిఫల చూర్ణాన్ని 5 గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత వడగట్టి పక్కన పెట్టుకోవాలి. దాల్చిన చెక్కను మరిగించిన నీటిలో వడగట్టి పెట్టుకున్న త్రిఫల రసాన్ని పోసుకోవాలి. పోయి కట్టేసి ఓ టేబుల్​ స్పూన్​ తేనె వేసుకుని తాగండి.. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహకరిస్తుంది, శ్వాస, గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్లను నివారించడం, శరీర బరువును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ త్రిఫల చాయ్​లో యాంటీ ఫంగల్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. శరీరంలో వేడిని తగ్గిస్తుంది, క్యాన్సర్‌తో పోరాడుతుంది.

"హెర్బల్ టీలు జీవక్రియను సమతుల్యం చేస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి, నిర్విషీకరణకు సహాయపడతాయి. విటమిన్లు, మినరళ్లు విరివిగా లభిస్తాయి. గొప్ప మూలం. వాటిలో యాంటీ ఏజింగ్ లక్షణాలు కూడా ఉన్నాయి. అయితే ఈ హెర్బల్ టీను మోతాదుకు మించి తీసుకుంటే.. తలనొప్పి, వికారం, మైకము, నోటిలో నొప్పి, గుండెల్లో మంట, వాంతులు, హార్మోన్ల అసమతుల్యత దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది. అలాంటి టీలు రోజుకు ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి.''

-డాక్టర్ యాస్మిన్, ఆయుర్వేద నిపుణురాలు

ఇన్ని రోజులు మీ ఆరోగ్యానికి హాని కలిగించే డైట్ కోక్, తియ్యటి కాఫీలు తీసుకున్నారు. ఇకపై వాటి బదులు ఒక కప్పు హెర్బల్ టీ తాగి చూడండి. మీరు పొందే ఫలితాలను ఈటీవీ భారత్​తో పంచుకోండి.

ఇదీ చదవండి:మీరు మెచ్చే రుచులతోనే ఆరోగ్యం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.