ETV Bharat / sukhibhava

డిప్రెషన్ ఒక ఊబి - స్విమ్మింగ్ పూల్​లా మార్చేస్తే పోలా! - Overcome Depression

How to Overcome Depression : మనసు మాట వినదు.. ఎంత ప్రయత్నించినా బయటపడడం అసాధ్యంగా అనిపిస్తుంది. ఈ పరిస్థితి ముదిరిన వారు.. జీవితాన్ని ముగించాలనే నిర్ణయానికి సైతం వస్తారు! మనసుపై ఇంతటి ప్రభావం చూపే డిప్రెషన్​ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే అదొక ఊబి! అయితే.. దాన్ని కూడా స్విమ్మింగ్​ పూల్​లా మార్చేయొచ్చు!

How to Overcome Depression
How to Overcome Depression
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 31, 2023, 9:45 AM IST

How to Overcome Depression : ఈ బుర్ర ఉందే.. చీమల పుట్టకు తల్లిలాంటిది. పుట్టలో ఎన్ని చీమలుంటాయో ఎవరికీ తెలియదు. ఈ బుర్ర నిండా ఎన్ని ఆలోచనలుంటాయో ఎవరికీ అర్థం కాదు. అయితే.. పుట్టను గెలికితే చీమలు ఎలా చెల్లాచెదురువుతాయో.. మనసు చెదిరితే కూడా ఆలోచనలు పరిపరి విధాలుగా పరుగులు తీస్తాయి. దారీతెన్నూ లేకుండా పయనిస్తాయి. గమ్యం లేని ఎడారిలో చిక్కినట్టుగా.. బ్రెయిన్​ కూడా ఒక వలయంలో చిక్కుకుపోతుంది. అందులోంచి బయటపడే మార్గం తెలియక భవిష్యత్తుపైనే ఆశలు వదిలేసుకుంటుంది. నిరాశ.. నిస్సత్తువ.. నిర్వేదం.. చుట్టూ అలుముకుంటే.. చెట్టంత మనిషి కుప్ప కూలిపోతారు. ఈ పరిస్థితినే డాక్టర్లు "డిప్రెషన్" అంటారు.

అయితే.. ఈ పరిస్థితి నుంచి ఫీనిక్స్ పక్షిలా లేచిరావొచ్చు అంటున్నారు నిపుణులు. పూర్వవైభవాన్ని తిరిగి సాధించి.. రాకెట్​లా దూసుకుపోవచ్చని ఘంటాపథంగా చెబుతున్నారు. ఇందుకోసం పెద్దగా చేయాల్సిందేమీ లేదని.. చిన్న చిన్న విషయాలు పాటిస్తే సరిపోతుందని అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

"ఎక్స్​పైరీ డేట్" ఉంటుంది..

డిప్రెషన్​ అనేది ఒక కండిషన్. అది మీ మనసుపై ప్రభావం చూపబట్టి కొన్ని రోజులే. కానీ.. అంతకుముందు మీరు ఎంత ఉల్లాసంగా ఉండేవారు? ఓసారి గుర్తు చేసుకోండి. గతంలోనూ మీ మనసుకు చాలా ఎదురు దెబ్బలే తగిలిఉంటాయి. ఆ తర్వాత తిరిగి నార్మల్ అయ్యారు కదా! ఎన్నోసార్లు ఏడ్చి ఉంటారు.. మరెన్నోసార్లు హాయిగా నవ్వుకుని ఉంటారు.. ఇప్పుడు ఈ కండిషన్లో ఉన్నారు. ఇది కూడా శాశ్వతం కాదు. ప్రతిదానికీ ఎక్స్​పైరీ డేట్ ఉంటుంది. కాబట్టి.. తిరిగి కొత్త ఉషోదయం మీ జీవితంలో మొదలవుతుంది. ఈ విషయాన్ని మీ మనసుకు బలంగా చెప్పండి.

పది నిమిషాలు..

పైన చెప్పిన విషయాన్ని స్ట్రాంగ్​ డోస్​గా రోజుకు మూడు పూటలా మీ మనసుకు ఇస్తూ.. మరికొన్ని పనులు చేయండి. ఉదయాన్నే కేవలం పది నిమిషాలపాటు వాకింగ్ చేయండి. స్విమ్మింగ్.. జాగింగ్.. స్ట్రెచ్చింగ్ వంటివి ఏదో ఒకటి చేయండి. మనసు తేలికవుతుంది.

టైమ్​కు నిద్ర...

అలసిపోయిన మెదడుకు.. నిద్రను మించిన మందులేదు. కాబట్టి.. రాత్రివేళ త్వరగా నిద్రపోండి. రోజూ ఒకేసమయానికి పడుకోవడానికి ట్రై చేయండి. మొదట్లో కాస్త కష్టంగా ఉన్నా.. తర్వాత అలవాటైపోతుంది.

షెడ్యూల్..

మీరు ఆఫీసుకు వెళ్లేవారైనా.. పొలానికి వెళ్లేవారైనా.. బిజినెస్ మేన్ అయినా.. స్టూడెంట్ అయినా.. ఆ రోజు చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. కాబట్టి.. ఉదయాన్నే మీరు చేయాల్సిన పనులతో ఓ లిస్టు రాసిపెట్టుకోండి. సిల్లీగా తీసిపారేయకండి. దీనివల్ల మీ పనులు టైమ్​కు పూర్తవుతాయి. దాంతో.. మీపైన మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

టూర్..

టైమ్ లేదని చెప్పకండి.. కచ్చితంగా దొరుకుతుంది. కావాల్సింది మేనేజ్ చేసుకోవడమే. ఆ టైమ్ కుదుర్చుకొని నెలకు ఒకసారి దగ్గర్లోని ప్రాంతాలకు.. ఆర్నెల్లకోసారి దూర ప్రాంతాలకు టూర్లకు వెళ్లండి. రోజూలో కాసేపు మాత్రం పార్కులోనో.. మరో చోటనో ప్రకృతిలో గడపండి. ఈ క్షణాలు ఎంతో పాజిటివ్​ ఆలోచనలు కలిగిస్తాయి.

నవ్వు.. నువ్వు..

చివరగా ఖర్చు లేనిదీ.. టైమ్ తో పని లేనిదీ.. అందరికీ సాధ్యమైనది నవ్వు. ఈ నవ్వుతో ఎన్ని సమస్యలు తొలగిపోతాయో చెప్పాలంటే.. ఓ పుస్తకం రాయాల్సిందే. మనిషి మానసిక ఆరోగ్యం నుంచి.. శారీరక ఆరోగ్యం వరకూ అన్నిటినీ సెట్​ చేసే శక్తి చిన్న నవ్వుకు ఉందంటే మీరు నమ్మాల్సిందే. అందుకే మిత్రులతో కలిసి నవ్వండి. పక్కన ఎవ్వరూ లేకపోతే.. కనీసం అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకునైనా నవ్వండి.

పైవన్నీ ఒక్కరోజులోనే రాకపోవచ్చు. కానీ.. వచ్చి తీరుతాయి. ప్రాక్టీస్ చేయండి. కంటిన్యూ చేయండి.. ఈ క్రమంలో వచ్చే మార్పు చూసి మిమ్మల్ని మీరే నమ్మలేరు. ఆశ్చర్యపోతారు. వెనక్కి తిరిగి చూస్తే.. డిప్రెషన్​ అనే ఊబి.. చక్కటి స్విమ్మింగ్​ పూల్​లా మారిపోయి కనిపిస్తుంది. నచ్చినపాటను హమ్ చేస్తూ అందులో స్విమ్ చేయండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.