Tips to Improve Self Confidence: ఆత్మవిశ్వాసం ఉండాలే గానీ.. ఏదైనా సాధించగలమనే నమ్మకం వస్తుంది. వ్యక్తిగత విషయాల్లో అయినా.. వృత్తిలో అయినా ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు, చేసే పనుల్లో మంచి ఫలితాలు వస్తాయి. ఇతరులతో సత్సంబంధాలు కొనసాగించగలరు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి, సవాళ్లను ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉంటారు. కానీ, కొంతమందిలో ఇదే లోపించి.. ఏ పనిని చేయలేకపోతుంటారు. ఏ పని చేయాలన్నా ఇతరులపై ఆధారపడాల్సి వస్తోందని బాధపడుతుంటారు. మరి అలాంటి వారిలో ఆత్మవిశ్వాసం పెరగాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయంటున్నారు మానసిక నిపుణులు.. అవేంటంటే..?
వారికి దూరం: కొంతమంది కావాలని మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతుంటారు. ఇటువంటి వారి వల్ల మీ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. కాబట్టి ఇటువంటి వారిని దూరం పెట్టడమే మంచిది.
కచ్చితమైన లక్ష్యాలు: మీరు ఎంచుకున్న లక్ష్యాలు సాధించగలిగనవై ఉండాలి. ఆచరణ సాధ్యం కాని గోల్స్ పెట్టుకోవద్దు. వాటి వల్ల ఇతర పనులు కూడా చేయలేరు. దీంతో ఏం చేయలేమన్న స్థితికి చేరుకుంటారు.
స్ట్రాంగ్ ఇమ్యూనిటీ, బ్లడ్ షుగర్ నియంత్రణ! కరివేపాకుతో ప్రయోజనాలెన్నో
ఇతరులతో పోలిక వద్దు: జీవితం పోటీ కాదు. ఎవరి జీవితాలు వారివి. ఒకరి స్థితిగతులు ఎలా ఉంటాయనేది వారి చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి.. ఇతరులతో పోల్చి చూసుకోవడం మానేయాలి. ఇతరులతో పోల్చుకోవడం వల్ల అసూయ ఏర్పడుతుందట. దాని వల్ల వ్యక్తులు తమకు తాము తక్కువ చేసుకోవడంతో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుందని గత పరిశోధనల్లో తేలింది.
ఓటమి భయం వద్దు: ప్రతి మనిషికి భయాలు ఉంటాయి. కానీ, ఆ భయాలను జయిస్తేనే విజయాలు దక్కుతాయి. సవాలు ఎదురైతే భయపడి దాన్ని నుంచి తప్పుకునే ప్రయత్నం చేయొద్దు. సవాల్‌ను ఎదుర్కోవాలి. తొలి ప్రయత్నంలో ఓడినా భయం తొలగి.. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకునే అవకాశం లభిస్తోంది. దీంతో భవిష్యత్తులో విజయాలను అందుకునే ఆస్కారముంది.
మీ భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నాయా? ఈ సూచనలు పాటిస్తే బంధం స్ట్రాంగ్ అవుతుంది!
ఆ పదాలు నోటి వెంట రావొద్దు: నా వల్ల కాదు.. అసలు చేయగలమా?.. ఇది అసాధ్యం.. వంటి మాటలు మీ నోటి వెంట రాకుండా చూసుకోండి. అలాంటి మాటలు మిమ్మల్ని మరింత కుంగదీస్తాయి. దేన్నైనా నేను సాధించగలను అనే భావనతో ఉండాలి. నేను చేయగలను.. సాధించగలను అని మీకు మీరే తరచూ చెప్పుకుంటూ ఉండటం వల్ల మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది.
ఒంటరిగా ఉండొద్దు: ఒంటరితనం మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఏం చేయలేమన్న స్థితికి చేరుస్తుంది. అందువల్ల ఒంటరిగా ఉండటానికి ఇష్టపడకుండా.. నలుగురితో కలిసి వెళ్లే ప్రయత్నం చేయండి. తద్వారా మీరు విజయానికి చేరువవుతారని గమనించండి.
బరువు తగ్గడానికి "వాటర్ థెరపీ" - జస్ట్ నీళ్లు తాగితే చాలు కొండలాంటి పొట్ట వెన్నలా కరిగిపోతుంది!
దుస్తుల ఎంపిక: మీరు ధరించే దుస్తులు కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని తెలుపుతాయి. అందువల్ల మీకు నచ్చిన దుస్తులు ధరించేందుకు వెనుకాడకండి.
కీళ్లలో వచ్చే గౌట్ నొప్పితో బాధపడుతున్నారా? వీటికి దూరంగా ఉంటే వెంటనే తగ్గిపోతుంది!
హార్ట్ ఎటాక్ వస్తే సీపీఆర్ ఎలా చేయాలి? సింపుల్ స్టెప్స్ ఇవిగో!