How to control sugar levels : షుగర్ వచ్చిందగానే చాలామంది భయానికి గురవుతారు. ఇక తమ పని అయిపోయినట్లేనని బాధపడుతూ ఉంటారు. తమకు ఇష్టమైన ఆహార పదార్థాలను దూరం పెట్టాల్సి వస్తుందని ఫీల్ అవుతూ ఉంటారు. ఇలా బాధపడుతూ ఒత్తిడికి గురి కావడం వల్ల షుగర్ స్థాయిలు మరింత పెరిగే అవకాశముంది. షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవడంపైనే బాధితులు దృష్టి పెట్టాలి. అదెలాగంటే..?
మధుమేహం బారిన పడగానే చాలామంది బాధపడుతూ ఉంటారు. ఆహార నియమాలు పాటించలేక, వ్యాయామం లాంటివి చేయలేక సమమతమవుతూ ఉంటారు. ఆస్పత్రులు చుట్టూ తిరగలేకపోవడంతో పాటు అదుపులో ఎలా ఉంచుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతూ ఉంటారు. షుగర్ స్థాయిలను ఎలా అదుపులో ఉంచుకోవాలనేది ఇప్పుడు చూద్దాం.
ఈ సమస్యలతో బాధపడుతున్నారా?
డయాబెటిస్ రోగులు మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. దీని వల్ల నిద్రకు పూర్తిగా దూరమవుతూ ఉంటారు. అలాగే చాలా మంది మధుమేహులు సమయం దొరకలేదని వ్యాయామం చేయడం మానేస్తారు. డయాబెటిస్ రోగులు చాలా మంది ఊబకాయం, ఇన్‌ఫెక్షన్లతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో షుగర్ స్థాయిలు మరింతగా పెరిగే అవకాశముందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
ఎలాంటి నియమాలు పాటించాలి..?
Sugar control tips:
- సరైన నిద్ర అవసరం
- రోజూ వ్యాయామం చేయాలి
- ఆహార నియమాలను తప్పనిసరిగా పాటించాలి.
- బరువు పెరగకుండా చూసుకోవాలి
- మంచినీరు ఎక్కువగా త్రాగుతూ ఉండాలి
- మానసిక ఒత్తిడిని దూరం పెట్టాలి
మందుల వల్ల నిరూపయోగమే.!
ఎలాంటి ఆహార నియమాలు, వ్యాయామం లాంటివి చేయకుండా మందులు, ఇంజెక్షన్ల వల్ల మధుమేహన్ని తగ్గించుకోవడం కష్టమే. మందులు, ఇంజెక్షన్లు వాడినప్పుడు షుగర్ లెవల్స్ తగ్గినా... ఆ తర్వాత మళ్లీ కొన్ని రోజుల తర్వాత పెరుగుతూ ఉంటాయి. సరైన ఆహారం, రోజూ వ్యాయామం చేయడం, శరీరానికి సరిపడ నిద్ర వల్ల ఫలితాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇవేమీ పాటించకుండా మందులను నమ్మకుంటే ప్రయోజనం ఉండదని సూచిస్తున్నారు.
కొంతమంది షుగర్ బారిన పడిన తర్వాత ఏళ్లుగా లెవల్స్‌ను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించరు. ఏళ్లు గడుస్తున్న సమయంలో నరాలు బలహీనపడిపోయి. గుండెటో బ్లాక్ వచ్చి ప్రాణానికి ముప్పు ఏర్పడే అవకాశముంది. దీంతో షుగర్ స్థాయిలను ఎప్పుడూ అదుపులోకి ఉంచుకుంటూ ఉండాలి. లేకపోతే అనేక వ్యాధులు వచ్చే అవకాశముంది. సరైన ఆహార నియమాలను, రోజూ వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకోవడం వల్ల షుగర్ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుకుని జీవితాన్ని హాయిగా గడపవచ్చు. అలా కాకుండా టెన్షన్ పడటం వల్ల షుగర్ లెవల్స్ మరింత పెరిగే అవకాశముంటుందని డాక్టర్లు చెబుతున్నారు.
ఆందోళనను తగ్గించుకునేందుకు యోగ లాంటివి చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవడం, మంచి ఆహారం తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. షుగర్‌ను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించడం వల్ల త్వరగా తగ్గించుకోవచ్చు. ఆలస్యం కావడం వల్ల హై షుగర్‌కు దారితీసే అవకాశముంది. హై షుగర్ బారిన పడితే తగ్గించుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది.
ఇవీ చదవండి :