ETV Bharat / sukhibhava

ఫుడ్ అలెర్జీతో పోయిన అందాన్ని ఇలా తిరిగి పొందండి ! - beauty tips

ఆపాదమస్తకం అందంగా మెరిసిపోవాలనుకోవడం సహజం. ప్రత్యేకించి చర్మ సంరక్షణ విషయంలో మరింత శ్రద్ధ వహించడమూ కామన్. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం ఎంతో కీలకం. మన శరీరతత్వానికి సరిపడని ఆహారం తీసుకుంటే ఫుడ్ అలర్జీ వస్తుంది. దీంతో చర్మ సౌందర్యం చెరిగిపోతుంది. మరి సహజసిద్ధమైన చిట్కాలతో అందాన్ని కాపాడుకోవడం ఎలాగో తెలుసుకుందాం రండి..

how to control food allergy and tips get back skin beauty
ఫడ్ అలెర్జీతో పోయిన అందాన్ని తిరిగి పొందండి !
author img

By

Published : Aug 15, 2020, 10:30 AM IST

చర్మ సంరక్షణ విషయంలో భారతీయులు ఓ రకంగా చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఫుడ్‌ అలర్జీకి సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలు మనకు ఉండవు. అయితే కొద్దిమందికి మాత్రమే ఈ సమస్యలు ఎదురవుతుంటాయి. ఉదాహరణకు కీరా దోస, టొమాటో, క్యాప్సికమ్‌, బంగాళా దుంప వంటి కూరగాయలు తింటే కొందరికి పడవు. చర్మ సంరక్షణ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఎందుకిలా జరుగుతుందో అర్థం కాదు. అలాంటప్పుడు చర్మ సంరక్షణకు సంబంధించి ఈ చిట్కాలు ఎంతో మేలు చేస్తాయి.

కనీసం 2 లీటర్ల నీరు తాగండి!

మన శరీరానికి సరిపడే ఆహారం తీసుకోవాలి. అదే మన ఆరోగ్యానికి మంచిది. ప్రత్యేకించి జంక్‌ ఫుడ్స్‌, డెయిరీ ప్రొడక్ట్స్‌ తినే విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. చర్మానికి జిడ్డుదనం కలిగించే ఆహార పదార్థాలకు వెనువెంటనే స్వస్తి పలికేయండి. ఇక రోజుకు కనీసం 2 లీటర్ల నీళ్లు తాగడం తప్పనిసరి.

చర్మానికి సన్‌ స్క్రీన్‌ రాసుకోకుండా ఇంటి నుంచి అసలు బయటికెళ్లొద్దు.

డెర్మటాలజిస్ట్‌ సలహా మేరకు సి-విటమిన్‌ అధికంగా లభించే సీరంను రోజూ చర్మానికి రాసుకోండి. ఇది మీ చర్మసంరక్షణకు ఎంతగానో ఉపకరిస్తుంది.

చర్మంలో తేమ స్థాయులు తగ్గకుండా ఉండేందుకు మాయిశ్చరైజర్‌ రాసుకోండి. ప్రత్యేకించి మెడ భాగంలో, కళ్ల కింద మాయిశ్చరైజర్‌తో మృదువుగా మర్దన చేసుకోండి.

రోజుకు రెండు సార్లు కచ్చితంగా శుభ్రమైన నీటితో ఫేస్‌ వాష్‌ చేసుకోండి. ముఖం కడుక్కునేటప్పుడు చేతులతో మరీ కఠినంగా రుద్దకండి. ఎందుకంటే ఇలా చేస్తే చర్మం పొడిబారిపోయే ప్రమాదముంది.

పెదాలపై మచ్చలు, మొటిమలు ఏర్పడితే వాటిని అస్సలు గిల్లకండి. అలా చేస్తే పెదాలు మరింత అందవిహీనంగా తయారవుతాయి.

ఇదీ చదవండి: అమ్మ ఒడిలో ఉండగానే బిడ్డకు ఆరోగ్యం నూరిపోద్దామిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.