ETV Bharat / sukhibhava

ఈ జాగ్రత్తలతో ఇక ఆన్‌లైన్‌లోనే ఆరోగ్యం!​

కరోనా విజృంభణ నేపథ్యంలో వివిధ ఆస్పత్రులు ఆన్‌లైన్‌ కన్సల్టేషన్‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చాయి. నిజానికి ఈ విధానం అంతకుముందు కూడా అందుబాటులో ఉన్నప్పటికీ.. లాక్‌డౌన్‌ తర్వాతే ఎక్కువ ప్రజాదరణ పొందింది. కరోనా కాలంలో నేరుగా ఆసుపత్రికి వెళ్లడం కంటే.. ఇంట్లో నుంచే డాక్టర్​తో మాట్లాడటం మేలనుకుంటున్నారు చాలామంది. మరి ఆన్​లైన్​లో డాక్టర్​ను సంప్రదించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

how-to-consult-online-doctor-in-telugu
ఈ జాగ్రత్తలతో.. ఆన్‌లైన్‌లో ఆరోగ్యం పొందండి!​
author img

By

Published : Jul 19, 2020, 10:31 AM IST

కరోనా వేళ కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రులతో పాటు కొందరు వైద్యులు వ్యక్తిగతంగా కూడా ఈ సేవలను అందిస్తున్నారు. దీంతో ఇంటి నుంచే ఫోన్‌ లేదా వీడియో కాల్‌ ద్వారా డాక్టర్‌తో మాట్లాడి, అనుమానాలను నివృత్తి చేసుకునే వెసులుబాటు లభిస్తోంది. ఈక్రమంలో ఆన్‌లైన్‌ కన్సల్టేషన్‌లో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

how-to-consult-online-doctor-in-telugu
ఈ జాగ్రత్తలతో.. ఆన్‌లైన్‌లో ఆరోగ్యం పొందండి!​

తొందరపడకండి..

సాధారణంగా డాక్టర్‌ ఎదుట ఉన్నప్పుడే మన సమస్యలను చెప్పుకోవడానికి తొందరపడుతుంటాం. ఆన్‌లైన్‌ కన్సల్టేషన్‌లో ఇది ఇంకొంచెం ఎక్కువేనని చెప్పాలి. అందులోనూ చాలామందికి ఇప్పటి వరకు వీడియో కాల్‌లో మాట్లాడిన అనుభవం ఉండి ఉండదు. కాబట్టి ఎలాంటి తొందరపాటు లేకుండా.. డాక్టర్‌ను మీరేం ప్రశ్నలు అడగాలనుకుంటున్నారో ఒక కాగితంపై ముందుగానే రాసిపెట్టుకోండి.

పాత రిపోర్టులను అందుబాటులో ఉంచుకోండి..

కొంతమంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటారు. వీరు కచ్చితంగా క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదిస్తుంటారు. ఇప్పుడు కూడా సాధ్యమైనంత వరకు రెగ్యులర్‌గా చూపించుకునే వైద్యులనే సంప్రదించడం మంచిది. ఒకవేళ వారు అందుబాటులో లేని సమయంలో మాత్రమే ఇతర వైద్యుల వద్దకు వెళ్లాలి. ఆన్‌లైన్‌లో సదరు డాక్టర్‌ను సంప్రదించే సమయంలో గతంలో ఇతర వైద్యులని సంప్రదించినప్పటి రిపోర్టులన్నింటినీ అందుబాటులో ఉంచుకోవాలి. ఆ రిపోర్ట్స్‌లోని సమాచారం ఆధారంగా వైద్యులకు మీ ఆరోగ్య స్థితిపై ఓ అవగాహన వస్తుంది.

పక్కన ఎవరైనా ఉండాలి..

సాధారణంగా ఆసుపత్రికి వెళ్లే సమయంలో ఎవరినో ఒకరిని తోడుగా తీసుకెళుతుంటాం. దీనివల్ల మనతో ఓ వ్యక్తి ఉన్నాడనే ధైర్యంతో పాటు మన సమస్యను దగ్గరుండి చూస్తారు కాబట్టి.. దాని గురించి డాక్టర్‌కు వీలైనంత స్పష్టంగా వివరించగలుగుతారు. ఆన్‌లైన్‌ కన్సల్టెన్సీ విషయంలోనూ ఇదే వర్తిస్తుందని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీ పక్కన మీ ఆరోగ్య సమస్య గురించి బాగా అవగాహన ఉన్న వ్యక్తి ఉండేలా చూసుకోండి. మరీ ముఖ్యంగా వయసు మళ్లిన వారు వీడియోకాల్‌లో అంత సులభంగా మాట్లాడలేరు. ఇలాంటి వారికి కచ్చితంగా సహాయకులు ఉండి తీరాల్సిందే.

పేమెంట్‌ విషయంలో జాగ్రత్త..

ఇంటర్నెట్‌ వేదికగా ఎన్నో ఆన్‌లైన్‌ డాక్టర్‌ కన్సల్టెన్సీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ కార్పొరేట్‌ ఆసుపత్రులు కూడా ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. కాబట్టి మీకు నచ్చిన, మీకు నమ్మకం కలిగిన ఆసుపత్రి ద్వారా ఎక్కడి నుంచైనా సరే.. వైద్యులను సంప్రదించవచ్చు. అయితే ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌ వేదికగా కొన్ని ఫేక్‌ వెబ్‌సైట్లు (మోసపూరిత) కూడా ఉంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సదరు వెబ్‌సైట్‌ను పూర్తిగా చూసిన తర్వాత.. నిజమైనదేనని నమ్మకం కలిగితేనే డబ్బులు చెల్లించాలి. కాబట్టి డబ్బులు చెల్లించే విషయంలో అప్రమత్తత తప్పనిసరి. సాధ్యమైనంత వరకు మీకు బాగా పరిచయమున్న వైద్యులు, ఆస్పత్రులనే సంప్రదించడం మంచిది.

అలసత్వం వద్దు...

ఆన్‌లైన్‌ కన్సల్టెన్సీ సేవలు కేవలం సాధారణ వ్యాధులకు మాత్రమే పరిమితమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అత్యవసర సేవల కోసం నేరుగా ఆయా ఆసుపత్రులను, వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. ఉదాహరణకు హృదయ, శ్వాస సంబంధిత సమస్యలేవైనా కనిపిస్తే.. ఆన్‌లైన్‌ కన్సల్టెన్సీలపై ఆధారపడకుండా వెంటనే దగ్గర్లోని వైద్యుణ్ని సంప్రదించాలి.

భాష కూడా ముఖ్యమే..

ఆన్‌లైన్‌ కన్సల్టెన్సీలో భాగంగా డాక్టర్‌ను ఎంపిక చేసుకునే క్రమంలో.. సదరు డాక్టర్‌ ఏయే భాషలు మాట్లాడగలడో తెలుసుకోవాలి. ఆయా సంస్థలు ఈ విషయాన్ని తమ వెబ్‌సైట్లలో పొందుపరుస్తుంటాయి. వీటిని జాగ్రత్తగా పరిశీలించి వైద్యుణ్ని ఎంచుకోవాలి. ఒకవేళ డాక్టర్‌తో మీకు కమ్యూనికేషన్‌ గ్యాప్‌ ఉంటే.. మీ సమస్యను స్పష్టంగా వివరించలేకపోతారు.

మారుతోన్న కాలానికి అనుగుణంగా మనమూ మారుతూ ఇలాంటి కొన్ని చిట్కాల ద్వారా ఆన్‌లైన్‌ కన్సల్టెన్సీ సేవలను సమర్థంగా ఉపయోగించుకోవచ్చు.

ఇదీ చదవండి: బల్గేరియా అందగత్తెల ​రహస్యం ఇదే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.