ETV Bharat / sukhibhava

బరువు పెరగాలా? ఈ నిజాలు తెలుసుకోండి.. - etv bharat health

బరువు పెరిగే విషయంలో చాలామందికి రకరకాల అపోహలుంటాయి. బరువు పెరగాలంటే ఏది పడితే అది తినేయాలని కొందరనుకుంటారు. మరికొందరు ఏం తినాలన్నా ఆలోచిస్తారు. ఏ పదార్థాలు ఎలా తీసుకోవాలో తెలియదు. అలాంటి వారికి సాధారణంగా ఎలాంటి సందేహాలు ఉంటాయంటే..

how put on weight with simple tips?
బరువు పెరగాలంటే ఈ నిజాలు తెలుసుకోండి..
author img

By

Published : Sep 30, 2020, 10:31 AM IST

బరువు పెరగాలంటే ఎవరేది చెప్తే అది పాటించడం కాదు.. మీకంటూ కొన్ని నియమాలు పెట్టుకోవాలి. అలా చేయాలంటే.. ముందు మీరు ఈ వాస్తవాలు తెలుసుకోవాలి..

అపోహ: పిండిపదార్థాలు ఎక్కువగా తీసుకుంటే బరువు పెరుగుతారు!

వాస్తవం: ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ పిండిపదార్థాలు శరీరానికి అవసరమైనంత తీసుకోవాలి. అలా కాకుండా మాంసకృత్తులూ, కొవ్వులు ఏవి ఎక్కువగా తీసుకున్నా కూడా అవి శరీరంలో నిల్వగా మారతాయి. అలా కూడా బరువు పెరుగుతారు. అంతేగానీ పూర్తిగా పిండిపదార్థాల్ని దూరంగా పెట్టమని మాత్రం నిపుణులు చెప్పరు.

అపోహ: మాంసకృత్తులు ఉన్న పానీయాలు తాగితే కండలు వస్తాయా?

వాస్తవం: కండలు అనేవి వ్యాయామం సరిగా చేస్తూ తగిన ఆహారం తీసుకుంటే వస్తాయి. నిజానికి ఎవరైనా సరే 0.8గ్రా నుంచి 1.0గ్రా చొప్పున ప్రతి కేజీ బరువుకు మాంసకృత్తులు తీసుకోవాలి. అలా కాకుండా అతిగా తీసుకున్నా మంచిదికాదు. కణజాలం దెబ్బతినే ప్రమాదముంటుంది. బరువు పెరిగే అవకాశం కూడా ఎక్కువే.

అపోహ: దాహం వేస్తేనే నీళ్లు తాగాలి!

వాస్తవం: మనం తీసుకునే ఆహారం కంటే మంచి నీళ్లే ఎక్కువ శాతం శరీరానికి అందాలి. దాహం వేయకపోయినా ప్రతి అరగంటకోసారి మంచి నీళ్లు తాగాలి. రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే మాత్రం డీహైడ్రేషన్‌, తలనొప్పి, కండరాల నొప్పులూ, చర్మ సమస్యల వంటివి తలెత్తే ప్రమాదం ఉంటుంది.

అపోహ: బరువు తగ్గాలంటే... అల్పాహారం మానేయాలి!

వాస్తవం: అధ్యయనాల ప్రకారం అల్పాహారం తినేవారికంటే.. మానేసే వారే బరువు పెరుగుతున్నారని తెలుస్తోంది. నిజానికి అల్పాహారం జీవనశైలినీ, జీవక్రియల్ని క్రమబద్ధీకరిస్తుంది. ఆరోగ్యానికి కారణమవుతుంది. రాత్రిపూట ఎలాగూ డైటింగ్‌ అంటూ పొట్ట మాడ్చుకుంటారు కాబట్టి.. కనీసం ఉదయం పూటైనా కడుపునిండా అల్పాహారం తినమని సూచిస్తున్నారు వైద్యనిపుణులు.

ఇదీ చదవండి: సులభంగా సన్నగా అయిపోవడానికే ఈ సూత్రాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.