ETV Bharat / sukhibhava

పీరియడ్స్ టైంలో నొప్పితో బాధపడుతున్నారా? ఈ 5 టిప్స్​ పాటిస్తే మీకు ఫుల్​ రిలీఫ్​! - నెలసరి సమయంలో ఏ విధంగా నొప్పినుంచి ఉపశమనం పొందాలి

Home Remedies To Reduce Period Pain : నెల‌స‌రి స‌మ‌యంలో కొంద‌రు మ‌హిళ‌ల బాధ వ‌ర్ణనాతీతం. ఆ నొప్పి భ‌రించ‌లేక నెలసరి సమయంలో మహిళలు విల‌విల‌లాడిపోతారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ బాధ‌ల‌ నుంచి కాస్త ఉపశమనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే?

periods homemade tips
Home Remedies To Reduce Period Bloating
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 3, 2023, 8:33 AM IST

Home Remedies To Reduce Period Pain : సాధారణంగా పీరియడ్స్​ అంటేనే కొందరు మహిళలు భయపడుతూ ఉంటారు! ఆ సమయంలో వచ్చే నొప్పి, రక్తస్రావం, చికాకు, ఇతర సమస్యల వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొందరికి భరించలేనంతగా నొప్పి వస్తూ ఉంటుంది. దీంతో బాగా నీరసించిపోతారు. ఎటువంటి పనులు కూడా సరిగ్గా చేయలేక పోతుంటారు. అయితే వీటి నుంచి ఉపశమనం పొందేందుకు వైద్యులు​ కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. అవేంటో తెలుసుకుందాం.

8 గంటల నిద్ర అవసరం
పీరియడ్స్ సమయంలో మహిళలకు ఎనిమిది గంటల నిద్రపోవడం చాలా అవసరం అంటున్నారు నిపుణులు. "నెలసరి సమయంలో తక్కువగా నిద్రపోవడం వల్ల మరింత నొప్పికి కారణం కావొచ్చు. ఎనిమిది గంటల పాటు కచ్చితంగా నిద్రపోవాల్సిందే" అని స్త్రీ ప్రసూతి వైద్య నిపుణురాలు కెల్లీ రాయ్ తెలిపారు.

పీచు పదార్థాలను తక్కువగా తీసుకోండి
Home Remedies For Period Stomach Pain : పీరియడ్స్ సమయంలో పీచు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు కాస్త దూరంగా ఉండాలని నిపుణులు​ తెలిపారు. పీరియడ్స్ సమయంలో పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఉబ్బరం పెరుగుతుందని చెప్పారు. సారా ట్యోగుడ్ అనే వైద్యురాలు చేపట్టిన అధ్యయనంలో నెలసరి సమయంలో పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకోకపోవటమే మంచిదని తేలింది.

రోజుకు 8-10 గ్లాసుల త్రాగునీరు
Home Tips For Period Pain : పీరియడ్స్ సమయంలో రోజుకు 8-10 గ్లాసుల మంచినీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు. తక్కువ మోతాదులో నీరు తీసుకోవడం వల్ల మూత్రవిసర్జన చేసేటప్పుడు మంట, తలనొప్పి ఎక్కువగా వస్తుందని నిపుణులు తెలిపారు. డీహైడ్రేషన్ వల్ల అలసటగా ఉన్నట్లు అనిపిస్తుందని.. అందుకే రోజూ తగిన మోతాదులో నీరు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఒత్తిడి నుంచి విముక్తి
How To Relief From Stress In Period Time : పీరియడ్స్ సమయంలో మహిళలు ఒత్తిడికి గురవ్వడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఒత్తిడి గురైనా.. యోగా, ధ్యానం చేసి అందులో నుంచి బయటపడాలని సూచిస్తున్నారు.

నెలసరి టైమ్​లో కడుపు నొప్పా? వికారంగా ఉంటోందా?.. ఈ టిప్స్ మీ కోసమే!

నెలసరి క్రమం తప్పుతోందా.. కారణమిదే కావచ్చు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.