ETV Bharat / sukhibhava

Summer safety tips: వేసవిలో ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

Summer safety tips: రాష్ట్రంపై భానుడు ప్రతాపం చూపుతున్నాడు. వేసవి తాపానికి అనేక మంది వడదెబ్బ బారినపడుతున్నారు. అక్కడక్కడా వడదెబ్బతో మరణాలూ నమోదవుతున్నాయి. నీడలో ఉండేవారికి వడదెబ్బ తగిలే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వేసవిలో ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రముఖ వైద్యులు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావుతో ఈటీవీ భారత్​ ప్రతినిధి రమ్య ముఖాముఖి...

Summer safety tips
Summer safety tips
author img

By

Published : May 6, 2022, 4:43 PM IST

Summer safety tips: ఎండలో తిరిగేవాళ్లు రోజుకు 4 లీటర్ల వరకు నీళ్లు తాగాలని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు సూచించారు. ఇంట్లో ఉండేవాళ్లు రోజు 3లీటర్ల వరకు నీళ్లు తాగాలని తెలిపారు. బయటకు వెళ్లేప్పుడు నూలు దుస్తులు, టోపీ ధరించాలని పేర్కొన్నారు. ఎండలో పనిచేసేవాళ్లు గంటకొకసారి నీడ పట్టున విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగుల పట్ల జాగ్రత్త వహించాలని అన్నారు.

ఎక్కువ జ్వరం ఉంటే వెంటనే ఆస్పత్రికి తరలించాలని.. లోబీపీ, వణకటం వంటి సమస్యలున్నా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ రాజారావు అన్నారు. కొబ్బరి నీళ్లు సహా మజ్జిగలో ఉప్పు వేసుకుని తాగాలని తెలిపారు. పిల్లలను ఎండలో ఆడుకోవడానికి పంపకూడదని.. ఆహారం మళ్లీ మళ్లీ వేడి చేసుకుని తినకూడదని స్పష్టం చేశారు. కూరగాయలు, ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.

వేసవిలో ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

ఇదీ చదవండి : ఖబడ్దార్‌... పిచ్చిపిచ్చిగా మాట్లాడితే నాలుక చీరేస్తాం బిడ్డా.. : శ్రీనివాస్‌ గౌడ్‌

పెళ్లి కోసం ప్రేయసి పక్కా ప్లాన్​.. ప్రియుడి కండోమ్​కు రంధ్రాలు.. చివరకు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.