ETV Bharat / sukhibhava

Health tips for hair fall: జుట్టుకు 'ఉప్పు'తో ముప్పు.. ఇవి తెలుసుకోండి - జుట్టు ఒత్తుగా రావడానికి టిప్స్​

Health tips for Hair Fall: పోషకాహార లోపం, కాలుష్యం, ఒత్తిడి.. వీటన్నింటి ప్రభావం జుట్టుపై పడుతుంది. దీంతో పాటు ఉప్పుతో కూడా జుట్టుకు ముప్పు పరిణమిస్తోంది. ఫలితంగా చుండ్రు, జుట్టు పొడిబారడం, రాలడం, నెరవడం.. లాంటి సమస్యలు వస్తాయి. అయితే కొన్ని జాగ్రత్తలతో జుట్టు ఆరోగ్యం దెబ్బతినకుండా చూసుకోవచ్చు.

Health tips for hair fall
Health tips for hair fall
author img

By

Published : Feb 4, 2022, 7:17 AM IST

Health tips for Hair Fall: మనం రోజూ ఉద్యోగాలు, వ్యాపారాల మీద పలు చోట్లకు తిరుగుతుంటాం. ఇలాంటి పనుల్లో పడి పెద్దగా గమనించం గానీ గాలి, ఎండ వంటివి మన జుట్టు మీద గణనీయమైన ప్రభావం చూపుతాయి. సాయంత్రం ఇంటికి చేరుకునేసరికి- ఎండకు ఎండి, వానకు తడిసినట్టుగా జుట్టు కళ తప్పిపోతుంది. ఇది చాలదన్నట్టు ఇంట్లో స్నానానికి వాడే ఉప్పు నీటి (హార్డ్‌ వాటర్‌) శాపం ఒకటి. మనం ఉప్పునీటిగా పిలుచుకునే కఠినజలంలో ఖనిజాల శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా క్యాల్షియం స్థాయులు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి నీటితో స్నానం చేయగానే జుట్టంతా పొడిబారి, కళ తప్పిపోతుంటుంది. నునుపుదనం పోయి వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. వెంట్రుకల చివర్లు చిట్లిపోతుంటాయి కూడా. షాంపూలు, కండిషనర్లు వాడినా పెద్ద ప్రయోజనం ఉండదు. దీంతో ఒకటికి రెండు సార్లు షాంపూతో స్నానం చేస్తుంటాం కూడా.

ఉప్పు నీటితో తలస్నానం చేయటం వల్ల తలెత్తే మరో పెద్ద సమస్య జుట్టు రాలటం. ఒకవైపు జుట్టు కళ తప్పుతోందనే దిగులు.. మరోవైపు ఉన్న కొద్దిపాటి జుట్టు రాలటం. దీంతో ఎవరికైనా మనసు కకావికలమవుతుంది. ఇటీవలి కాలంలో చాలామందికి చిన్నవయసులోనే జుట్టు తెల్లబడటం ఎక్కువైంది. జట్టుకు రంగేసుకునేవారి సంఖ్యా పెరిగింది. ఇలాంటివారు ఉప్పునీటితో స్నానం చేస్తే రంగు త్వరగా వెలిసిపోతుంది. వెంట్రుకల కళ కూడా తగ్గుతుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలతో జుట్టు ఆరోగ్యం దెబ్బతినకుండా చూసుకోవచ్చు.

  • జుట్టు నిగనిగలాడటానికి కొబ్బరినూనె బాగా ఉపయోగపడుతుంది. ఇది వెంట్రుకల నుంచి ప్రోటీన్‌ పోకుండా కాపాడుతూ నిగనిగలాడేలా చేస్తుంది. ఇది ఉప్పునీటి దుష్ప్రభావాల నుంచి జుట్టును కాపాడుకోవటానికీ తోడ్పడుతుంది. ముఖ్యంగా కొబ్బరినూనెలోని లారిక్‌ యాసిడ్‌ అనే కొవ్వు ఆమ్లం వెంట్రుకలు పొడవుగా పెరగటానికి దోహదం చేస్తుంది. కాబట్టి తలస్నానం చేయటానికి ముందు, తర్వాత కూడా వెంట్రుకలు కాస్త కొబ్బరినూనె రాసుకోవటం మేలు. దీంతో వెంట్రుకలు దెబ్బతినకుండా చూసుకోవచ్చు.
  • వెనిగర్‌ వెంట్రుకల పీహెచ్‌ స్థాయులను నియంత్రిస్తుంది. జుట్టు నున్నగా ఉండటానికి, నిగనిగలాడుతూ కనబడటానికి తోడ్పడుతుంది. షాంపూతో స్నానం చేసిన తర్వాత మూడు కప్పుల నీటిలో చెంచా వెనిగర్‌ కలిపి జుట్టుకు రాసుకోవాలి. కొద్ది నిమిషాల తర్వాత నీటితో కడుక్కోవాలి. నిమ్మరసంతోనూ ఇలాంటి ఫలితమే కనబడుతుంది.
  • కాస్త ఖరీదైనా కుళాయిలకు నీటిలోని లవణాలను తొలగించే పరికరాలు వాడుకోవటం బాగా ఉపయోగపడుతుంది.

ఇదీ చూడండి: Cause of Migraine: మైగ్రెయిన్​కు ప్రధాన కారణమిదే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.