bathing benefits: మనం చేసే ప్రతి పని.. మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. తినే ఆహారం మాత్రమే కాదు.. పళ్లు తోమే విధానం, స్నానం చేసే విధానం, ఆలోచనా విధానం అన్నింటి ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. అయితే చలి కాలంలో స్నానం చేయడానికి కొన్నిసార్లు ఆలోచిస్తుంటాం. పెద్దగా చమట పట్టడం లేదు కదా అని అనుకుంటాం. కానీ స్నానం చేయడం శుభ్రత కోసం మాత్రమే కాదు అని మీకు తెలుసా? ఇంతకీ స్నానం ఎందుకు చేయాలంటే..
శరీర ఉష్ణోగ్రతల నియంత్రణ కోసం..
మనం చర్మంపై మురికిని పోగొట్టడానికి మాత్రమే స్నానం చేయం. చర్మంపైన స్వేద రంధ్రాలుంటాయి. వాటి నుంచి శరీరంలోని మలినాలు విడుదలవుతుంటాయి. ఈ మలినాల కారణంగా కొన్నిసార్లు స్వేద రంధ్రాలు మూసుకుపోతాయి. స్నానం చేయడం వల్ల ఈ మలినాలు పోయి.. రంధ్రాలు తెరుచుకుంటాయి. తద్వారా వాటి నుంచి చమట బయటకు వెళ్లి శరీరంలోని ఉష్ణోగ్రతలు కంట్రోల్ అవుతాయి.
వేడి నీళ్లా, చన్నీళ్లా?
శరీరం తీరు, వాతావరణాన్ని బట్టి చన్నీళ్లతో స్నానం చేయాలా లేదా వేడి నీటితో చేయాలా అనేది నిర్ణయించుకోవాలి. వెచ్చటి నీటితో స్నానం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. దీనివల్ల శరీరంలోని మలినాలు త్వరగా బయటకు వెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది.
అయితే మరీ ఎక్కువ వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మాన్ని మృదువుగా ఉంచడానికి సహజంగా ఏర్పడే తైలాలు (రక్షక పొర) కోల్పోవాల్సి వస్తుంది. దాని వల్ల చర్మం త్వరగా పొడిబారి, దురద, దద్దుర్లు వంటి బారిన పడతాం.
ఇదీ లాభం..
స్నానాన్ని ఆస్వాదిస్తూ చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు అనే పదార్థం విడుదలవుతుందని నిపుణులు చెబుతున్నారు. అవి మనం ఆనందంగా ఉండేందుకు సహాయపడతాయట.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: పొట్టలో కొవ్వు ఎందుకొస్తుంది? కరిగించుకునే మార్గాలేంటి?