బరువు తగ్గటానికి రకరకాల మార్గాలున్నాయి. అందులో ఆరోగ్యకరమైన డైట్‌ను (weight loss diet plan) అలవరుచుకోవడం కూడా ఒకటి. అయితే.. మీ డైట్లో బార్లీ నీళ్లు తప్పకుండా ఉండాలని చెబుతున్నారు నిపుణులు. ఇవి శరీరంలో బరువును తగ్గించేందుకు(weight loss diet) బాగా తోడ్పడతాయని అంటున్నారు.
అధిక బరువును తగ్గించే ఆహార పదార్థాలు
- కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారం (weight loss techniques) తీసుకోవద్దు. సాధారణ కార్బోహైడ్రేట్స్ వల్ల బరువు ఎక్కువ పెరుగుతారు. పిజ్జా, బర్గర్ వంటివి ఈ కోవలోకి వస్తాయి.
- కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. రైస్‌కు బదులుగా బ్రౌన్ రైస్, రెడ్ రైస్ తినాలి.
- తృణధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలి.
- బరువు తగ్గించటంలో క్వినోవా ఎంతగానో ఉపయోగపడుతుంది.
- చియా సీడ్స్ డైట్లో ఉండే విధంగా చూసుకోవాలి.
- అల్పహారంలో రొటీన్‌గా కాకుండా ఫ్రూట్ సలాడ్, వాల్నట్, దోసకాయ సీడ్స్, పుచ్చకాయ వంటివి ఉండేలా చూసుకోవాలి.
- మధ్యమధ్యలో బట్టర్ మిల్క్, గ్రీన్ టీ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి.
- ఎక్కువగా నీరు తాగాలి.
- ఉప్పు వాడకం తగ్గించాలి.
- అప్పుడప్పుడు బార్లీ పొడి కలిపిన నీటిని తీసుకోవాలి. దీనితో బరువును తగ్గించవచ్చు.
- వ్యాయామం తప్పకుండా (weight loss tips) చేయాలి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి:బరువు తగ్గడానికి సర్జరీ చేయించుకోవచ్చా?