ETV Bharat / sukhibhava

సెక్స్ కోరికలు తగ్గియా? కారణం అదేనట! - Symptoms of Fatty Liver

Fatty Liver Symptoms : మనిషి ఆరోగ్యంలో కాలేయం పాత్ర ఎంతో కీలకం.. దాని పని అది సజావుగా చేసుకుంటే.. ఏ సమస్యా ఉండదు. కానీ.. అక్కడ తేడా వచ్చిందంటే అన్నింటికీ ముప్పు వాటిల్లినట్టే. చివరకు.. సెక్స్ కోరికలు తగ్గడానికి కూడా కారణం అదే కావొచ్చట!

Fatty Liver Symptoms
Fatty Liver Symptoms
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 24, 2023, 1:10 PM IST

Fatty Liver Symptoms : కాలేయం మన శరీరంలో ఎంతో ముఖ్యమైన భాగం. ఇది మనకోసం ఎంతో కష్టపడుతుంటుంది. రక్తంలో నుంచి టాక్సిన్స్​ తొలగించడంతో పాటు, ఆహారం సులభంగా జీర్ణమవడానికి ఎంతో శ్రమిస్తుంది. రక్తంలో గ్లూకోజ్​ స్థాయులను స్థిరంగా ఉంచడానికీ సహాయం చేస్తుంది. ఇన్ని విధాలుగా మనల్ని ఆరోగ్యంగా ఉంచే లివర్​ను​ కొన్ని రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కాలేయానికి కొవ్వు పట్టే సమస్య (ఫ్యాటీ లివర్‌) వేధిస్తుందని అంటున్నారు. ఈ ఫ్యాటీ లివర్​ వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ముంచుకొస్తాయని హెచ్చరిస్తున్నారు. చివరకు సెక్స్ కోరికలు కూడా తగ్గిపోతాయని చెబుతున్నారు. మరి.. దీన్ని ఎలా తగ్గించుకోవాలి ? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మన శరీరంలో ప్రతి చోటా కొవ్వు పదార్థం ఉంటుంది. అలాగే లివర్​లో కూడా కొవ్వు ఉంటుంది. కానీ.. కాలేయంలో 5 శాతం కన్నా ఎక్కువ కొవ్వు ఉంటే దాన్ని ఫ్యాటీ లివర్​గా పేర్కొంటారు. ప్రధానంగా రెండు రకాల ఫ్యాటీ లివర్​ వ్యాధులున్నాయి. అవి 1.నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) ఇది ఊబకాయం, మధుమేహం వంటి ఇతర కారణాల వల్ల వస్తుంది. 2. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (AFLD) ఇది ఎక్కువ మద్యం తాగడం వల్ల వస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీరిలో కాలేయంలో కొవ్వు పెరుకుపోతుందట. ఈ కాలేయ వ్యాధి లక్షణాలు తొందరగా బయట పడవు. 50 నుంచి 60 శాతం దెబ్బతిన్నా పైకి లక్షణాలు కనిపించవు. వ్యాధి చివరి స్టేజ్​కు వచ్చే సమయంలో మాత్రమే లక్షణాలు కనిపిస్తాయి.

మూర్ఛ వ్యాధి - ఎవరికైనా రావొచ్చు! ఎందుకు వస్తుంది?

ఫ్యాటీ లివర్​ లక్షణాలు..

  • తొలిదశలో కడుపు ఉబ్బరం, గ్యాస్‌ వంటి సాధారణ ఇబ్బందులు ఎదురవుతాయి.
  • జబ్బు ముదురుతున్నకొద్దీ కామెర్లు వస్తాయి. దీంతో చర్మం, కళ్లు పసుపు పచ్చగా అవుతాయి.
  • వీరిలో మూత్రం ముదురు రంగులో వస్తుంది.
  • ఎగువ కుడి పొత్తికడుపులో నొప్పి లేదా అసౌకర్యంగా ఉంటుంది.
  • ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం వంటివి కనిపిస్తాయి.
  • కడుపులో నీరు చేరడం, కాళ్లు, చేతులు ఉబ్బడం, వాపులు తలెత్తడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన వారిలో లైంగిక కోరికలు తగ్గుతాయట.
  • అలాగే కొందరు రక్తం వాంతులు చేసుకోవడం, కోమాలోకి వెళ్లడం (హెపాటిక్‌ కోమా) జరుగుతుందని తెలియజేస్తున్నారు.

ఈ వ్యాధి రాకుండా ఉండటానికి ఏం చేయాలి ?

  • కొవ్వులు, నూనె పదార్థాలను తినడం తగ్గించాలి.
  • వీటికి బదులుగా అవిసె గింజలు, తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను రోజువారి ఆహారంలో తీసుకోవాలి.
  • షుగర్​ ఎక్కువగా ఉండే కూల్‌డ్రింకులు, స్పోర్ట్స్‌ డ్రింకులు, ఎనర్జీ డ్రింకులకు దూరంగా ఉండాలి.
  • మద్యం అలవాటు చేసుకోకూడదు. ఒకవేళ అలవాటుంటే కొద్ది మొత్తంలో తీసుకోవాలి.
  • సిగరెట్లు, బీడీలు, చుట్టల వంటివి తాగకూడదు.
  • రోజు క్రమం తప్పకుండా కొంత శారీరక శ్రమ చేయాలి. ఇందుకోసం నడక, పరుగు చేయాలి.

గుడ్డు పచ్చసొన తింటే నిజంగానే ఆరోగ్యానికి ముప్పు? - రీసెర్చ్​లో ఆసక్తిర విషయం!

బయటికి చెప్పుకోలేరు - భరించలేరు - ఫ్యూచర్​లో చాలా ప్రమాదకరం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.