ETV Bharat / sukhibhava

సులువుగా కొవ్వును కరిగించాలా? అయితే ఈ ఆహారం తీసుకోండి - బరువు తగ్గడం చిట్కాలు

Fat Fighting Foods: ఇష్టం వచ్చినట్లు తిని.. కొవ్వు పెరిగిన తర్వాత బాధపడుతుంటారు చాలా మంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. శరీరాన్ని బాధపెడుతుంటారు. అలా కాకుండా ఆహారంతోనే కొవ్వును తగ్గించుకోవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Fat Fighting Foods
సులువుగా కొవ్వును కరిగించాలా? ఈ ఆహారం తీసుకోండి
author img

By

Published : Dec 31, 2021, 6:59 AM IST

Fat Fighting Foods: శరీరంలో ఉండే అదనపు కొవ్వు పదార్థాలను తొలగించుకోవాలనుకుంటున్నారా? అయితే మీ పూర్తి ప్రణాళికలో మార్పులు చేసుకోండి. కొన్ని ఉత్తమ ఆహార పదార్థాలను తింటూ చిన్న చిన్న వ్యాయామాలు చేయడం ద్వారా కొవ్వులను తగ్గించుకుని సన్నగా నాజూకుగా తయారవ్వచ్చు. అదనంగా శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కణాలతో పోరాడటానికి సులభమైన, ప్రభావంతమైన మార్గం కొన్ని ఆహారాలను రెగ్యులర్​ డైట్​లో చేర్చుకోవడం. ఇలా చేయడం ద్వారా కొవ్వును తగ్గించుకోవచ్చు. ఆపిల్​, గుడ్డు, పెరుగు, దాల్చినచెక్క, తాజాపండ్లు, కూరగాయలు, మీగడ లేని పాలపదార్థాలు మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించడంలో చాలా గొప్పగా పనిచేస్తాయి.

  1. ఆపిల్​ కరిగే ఫైబర్​ను అధిక మొత్తంలో కలిగి ఉండి జీర్ణవ్యవస్థను ఆరోగ్యకర స్థాయిలో ఉంచడమే కాకుండా శరీరంలో ఉండే కొవ్వు పదార్థాలను తొలగిస్తుంది.
  2. అధిక ప్రోటీన్ల ఉండే కోడి గుడ్లను నిత్యం తీసుకుంటే శరీరానికి తక్కువ కేలొరీలు అందటమే కాకుండా కొవ్వులను కరిగిస్తాయి.
  3. ఫైబర్​ అధికంగా ఉండే ఓట్స్​.. కొలస్ట్రాల్​ లెవెల్స్​ను​ సమతుల్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది.
  4. పచ్చిమిర్చిలోని క్యాప్సైసిల్స్​ శరీరంలోని జీవక్రియల రేటును పెంచుతాయి. వీటిని తిన్న 15 నిమిషాలకే కేలొరీలను కరిగిస్తాయి.
  5. శరీరంలో పేరుకుపోయిన కొవ్వులను తగ్గించటంలో క్వినోవా చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. వీటిలో ప్రోటీన్​ అధికంగా ఉండటమే కాకుండా ఫైబర్​, జింక్​, సెలీనియమ్​, విటమిన్​- ఈ అధికంగా ఉండి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి.
  6. కొవ్వులపై పోరాడే మరో వంటింటి దినుసు దాల్చిన చెక్క. ఇది రక్తంలో గ్లూకోజ్​ స్థాయిని సమంగా నిలపడం సహా ఆకలిని కట్టడి చేయడంలో గొప్పగా పనిచేస్తుంది.
  7. వెల్లుల్లిలో అలిసిన్​ అనేది కలిగి ఉండి యాంటీబ్యాక్​టీరిల్​ లక్షణాలతో శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది.
  8. సిట్రస్​ పండ్లలో ఉండే విటమిన్-​ సి మన శరీరానికి కావాల్సి ఎనర్జీని అందించడమే కాకుండా జీవక్రియల రేటును పెంచి కొవ్వును కరిగిస్తుంది.

అదే విధంగా పుచ్చకాయ, ద్రాక్ష, బెర్రీలు, స్వీట్​ పొటాటో, ముడి కూరగాయ ముక్కలు, కాఫీ, గ్రీన్​టీ, నట్స్​ తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వులు పేర్కొకుండా తీసుకోవచ్చు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి : IBD disease: ఎంత తిన్నా ఒంట పట్టట్లేదా.. అయితే మీ సమస్య ఇదే కావొచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.