fat burn foods: ఊబకాయం ప్రస్తుత సమాజంలో ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య. జంక్ ఫుడ్ల వల్ల, పని ఒత్తిడి వల్ల విపరీతంగా బరువు పెరిగిపోతున్నారు. దీనికి పరిష్కారం కోసం కొందరు జిమ్ బాట పడుతుంటే, మరికొందరు ఫుడ్ డైట్ ఫాలో అవుతున్నారు. అలా కాకుండా కొన్ని రకాల ఆహార పదార్థాలు కొవ్వును కరిగించడంలోనూ, పెరగకుండా చేయడంలోనూ ఉపయోగపడతాయని అంటున్నారు నిపుణులు. అవేవో తెలుసుకుందామా..
పెరుగు తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. పెరుగులో ప్రొటిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కొవ్వు కరగడంలో ఉపయోగపడతాయని చెబుతున్నారు. క్వినోవా ధాన్యంతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పీచు పదార్థం, విటమిన్ ఈ, ఐరన్, జింక్ ఉంటుందని అంటున్నారు. దాల్చిన చెక్కలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే శక్తి ఉందని సూచిస్తున్నారు. దీని వల్ల ఆకలి తగ్గుతుందని అంటున్నారు. పుచ్చకాయ, కర్బూజా వంటి నీటి శాతం ఎక్కువగా పండ్లను తినమని సూచిస్తున్నారు. వీటిలో ఉన్న ఫైబర్ శరీరానికి అంది.. ఆకలి తగ్గుతుంది అంటున్నారు. పచ్చికూరగాయలు, ఆపిల్, టమాటొ వంటి పండ్లను సలాడ్‌గా తినమని సూచిస్తున్నారు.
తరచుగా బ్లాక్ టీ తీసుకునే వాళ్లు బరువు తగ్గిన దాఖలాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. 'టీ'లో ఒక రకమైన ఫ్లెమనాయిడ్స్ ఉంటాయి. ఇవి జీవక్రియను మెరుగుపర్చి, శరీర కొవ్వులను త్వరగా విచ్ఛిన్నం చేయడంలో సహాయపడతాయని అంటున్నారు. అనేక 'టీ'లలో ఉండే కెఫిన్.. శక్తి వినియోగాన్ని పెంచుతుంది. దీని వల్ల శరీరం మరిన్ని కేలరీలను కరిగిస్తుంది. అలాగే గ్రీన్ టీని వల్ల కూడా బరువు తగ్గవచ్చని చెబుతున్నారు నిపుణులు. దీన్ని క్రమం తప్పకుండా తాగితే బరువు తగ్గవచ్చని అంటున్నారు. అలాగే బ్రౌన్‌రైస్, బార్లీ, ఓట్స్ వంటివి ఆహారంగా తీసుకోవడం మేలని అంటున్నారు నిపుణులు. ఆయిల్, మసాలా ఫుడ్స్ జోలికి వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: ఎక్కువ కష్టపడొద్దు.. 'స్మార్ట్'గా బరువు తగ్గండిలా..