ETV Bharat / sukhibhava

కళ్ల కింద డార్క్ సర్కిల్స్ వచ్చాయా?.. ఈ ఇంటి చిట్కాలు ట్రై చేస్తే చాలు! - కళ్ల క్యారీ బ్యాగ్స్ తగ్గే చిట్కాలు

మనలో కొందరికి కళ్ల కింద నల్లటి వలయాలు(డార్క్ సర్కిల్స్) కనిపిస్తుంటాయి. మరికొందరి కళ్ల కింద చర్మం ఉబ్బినట్లు కనిపిస్తుంది. చాలా మంది మహిళలు, పురుషులు ఇలా కళ్లు కనిపించడం వల్ల ఇబ్బంది పడుతుంటారు. ఎలాగైన ఈ సమస్యను తగ్గించుకోవాలని ప్రయత్నిస్తుంటారు. కంటి వైద్యుడిని సంప్రదిస్తారు. ఖరీదైన మందులను వాడుతారు. అయితే సులువుగా ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించి ఈ సమస్యను అధిగమించవచ్చు. అవేంటో ఓ సారి పరిశీలిద్దాం.

eye dark circles treatment
కళ్ల కింద డార్క్ సర్కిల్స్ తగ్గేందుకు చిట్కాలు
author img

By

Published : Mar 13, 2023, 7:50 AM IST

'సర్వేంద్రియానాం నయనం ప్రధానం' అన్నట్లు మన శరీరంలో కళ్లకు ఎంతో ప్రాధాన్యముంది. అయితే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పడి చాలామంది తమ కంటి సంరక్షణను పెద్దగా పట్టించుకోవడం లేదు. కొంతమందికి కళ్ల కింద నల్లటి వలయాల్లాంటి మచ్చలు ఉంటే, మరికొంతమందికి కళ్ల కింద చర్మం ఉబ్బినట్లు కనిపిస్తుంది. సరైన నిద్రలేకపోవడం, ఎక్కువ సమయం కంప్యూటర్‌పై గడపడం, టీవీ ఎక్కువగా చూడడం, పదే పదే కాఫీ-టీలు తాగడం, అధిక ఒత్తిడి, ఆందోళనకు గురికావడం, పోషకాహార లోపం... ఇవన్నీ కంటి సమస్యలకు కారణమవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఉబ్బిన కళ్లు అమ్మాయిలను అందవిహీనంగా మార్చేస్తున్నాయి. మరి, ఇలాంటి సమస్య నుంచి బయటపడే మార్గాలేంటో ఓసారి తెలుసుకుందాం. కళ్ల కింద నల్లటి వలయాలు, కంటి కింద చర్మం ఉబ్బకుండా ఉండేందుకు ఇంట్లోనే హోమ్ రెమిడీస్ తయారు చేసుకోవచ్చు.

దోసకాయ ముక్కలు..
దోసకాయ ముక్కలు సన్నగా కోయాలి. వాటిని 10-12 నిమిషాలపాటు కళ్లపై ఉంచాలి. కళ్ల మీద డార్క్ సర్కిల్స్, వలయాల మీద సున్నితంగా రుద్దాలి. దోసకాయ ముక్కల్ని అలాసే కాసేపు ఉంచి రిలాక్స్ అవ్వండి. అలాగే బంగాళదుంప ముక్కలను కూడా ఇదే విధంగా చేయవచ్చు. కళ్లు అలసిపోవడం, కళ్ల కింద క్యారీ బ్యాగ్స్.. వంటి సమస్యలతో బాధపడుతున్న వారు చల్లటి కీరాదోస ముక్కల్ని కళ్లపై కాసేపు పెట్టుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

eye dark circles treatment
దోసకాయ ముక్కలు

బాదం నూనె..
బాదం నూనె కూడా కళ్లకు ఉపశమనాన్ని ఇస్తుంది. దూది మీద బాదం నూనెను వేసి కంటి డార్క్​ సర్కిల్స్ వద్ద మర్దన చేయండి. ఇలా చేసేటప్పుడు కంటిలో బాదం నూనె పడితే కళ్లు మండుతాయి. కాస్త జాగ్రత్త వహించండి. మరుసటి రోజు ఉదయాన్నే నీళ్లతో కడుక్కోండి. ఇదే పద్ధతి రోజ్ వాటర్‌తో చేసినా చక్కటి ఫలితం ఉంటుంది.

గ్రీన్ టీ..
టీ బ్యాగ్స్ కళ్ల నల్లటి వలయాలను పోగొట్టడంలో బాగా సహాయపడతాయి. దీనికోసం 20 నిమిషాల పాటు ఫ్రిడ్జ్​లో ఉంచిన టీ బ్యాగ్స్‌ను కళ్లపై 15-30 నిమిషాల పాటు ఉంచి రిలాక్స్ అవ్వాలి. ఇలా చేయడం వల్ల నల్లటి వలయాలు తగ్గుముఖం పడతాయి.

eye dark circles treatment
గ్రీన్ టీ

టొమాటొ..
టమాటో చర్మ సౌందర్యాన్ని పెంచడంలో కీలక పాత్ర వహిస్తుంది. అలాగే కంటి కింద డార్క్ సర్కిల్స్ తొలగించడంలోనూ ఉపయోగపడుతుంది. కొంచెం టమాటో రసంలో కొద్దిగా నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ నెమ్మదిగా మర్దనా చేయాలి. ఇలా చేస్తే నల్లటి వలయాలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. ఇలా కనీసం వారానికి రెండు సార్లు చేయాలి.

eye dark circles treatment
టమాటొ

కలబంద జెల్​..
కలబంద జెల్​తో కళ్ల కింద మర్దన చేసుకోవాలి. అలా 5-7 నిమిషాల పాటు మసాజ్ చేస్తే కళ్ల డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి. కాసేపటి తర్వాత శుభ్రంగా నీటితో కడుక్కోవాలి.

eye dark circles treatment
కలబంద

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.