ETV Bharat / sukhibhava

బైక్​పై వెళ్తున్నారా?.. ఈ జాగ్రత్తలతో మీ కళ్లు సేఫ్​! - కంటి సమస్యలతు చెక్

ప్రస్తుతం కాలంలో చాలా మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. కళ్లు పొడిబారిపోవడం, ఎర్రగా మారడం వంటి సమస్యల బారిన పడుతున్నారు. అయితే కంటి సంరక్షణకు పలు జాగ్రత్తలు చెబుతున్నారు నిపుణులు. బైక్​పై వెళ్లేటప్పుడు హెల్మెట్​, కళ్లద్దాలు పెట్టుకోవడం వల్ల కాలుష్యం బారి నుంచి బయటపడొచ్చని అంటున్నారు. మరి కంటి సంరక్షణకు ఏం చేయాలో ఓ సారి చూద్దామా.

eye care tips in telugu
కంటిని కాపాడుకునే చిట్కాలు
author img

By

Published : Mar 27, 2023, 2:37 PM IST

సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. అలాంటి కళ్లను కాపాడుకోవటం ఎంతో ముఖ్యం. కళ్లు మనలోని ఎన్నో హావభావాలను వ్యక్తపరుస్తాయి. కంటి ఆరోగ్యమే అన్నింటి కన్నా మిన్నా. కళ్లు బాగుంటేనే ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్కని అంటారు కొందరు. ఎందుకంటే కంటి సమస్యలతో బాధపడితే కొన్నాళ్లకు చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వాహనాలపై వెళ్లేవారికి కంటిలో ధూళి, దుమ్ము పడతాయి. దీంతో కళ్లు ఎర్రగా మారిపోతాయి. అయితే ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఏం చేయాలో ఓ సారి తెలుసుకుందాం.

గాలి కాలుష్యం వల్ల..
రోజూ అనేక పనుల మీద బైక్​, ఇతరత్రా వాహనాలపై బయటకు వెళ్తుంటాం. ఎండాకాలంలో అయితే వేడి బెడద ఉండనే ఉంటుంది. రోడ్డు మీద దుమ్ము, ధూళి సరేసరి. అయితే దుమ్ము, ధూళి వల్ల కళ్లు తీవ్రంగా దెబ్బతింటాయి. ఉద్యోగ, వ్యాపార నిమిత్తం బైక్​పై తిరిగేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని నిపుణులు చెబుతున్నారు. అప్పుడు కంటిలో దుమ్ము, ధూళి పడవని అంటున్నారు. అలాగే కళ్లద్దాలు (ప్రొటెక్టివ్ గ్లాసెస్) ఉపయోగించాలని సూచిస్తున్నారు.

'అతి నీలలోహిత (యూవీ ) కిరణాల ముప్పును తప్పించుకునేందుకు కళ్లద్దాలు వాడడం ఉత్తమం. అలాగే కళ్లద్దాలు వాడడం వల్ల కంట్లోకి దుమ్ము, ధూళి కూడా పడవు. అందువల్ల కళ్లు పొడిబారటం, ఎర్రగా అవ్వడం వంటి సమస్యలు తలెత్తవు. అందుకే వాహనదారులు వాయు కాలుష్యం నుంచి తప్పించుకునేందుకు జాగ్రత్తలు పాటించండి.'

--నిపుణులు

కార్నియా జాగ్రత్త సుమా..
కళ్లను నిర్లక్ష్యం చేస్తే.. వాటి లోపలి నల్లగుడ్డు (కార్నియా) దెబ్బ తింటుంది. దీంతో కంటికి ఇన్ఫెక్షన్ సోకుతుంది. అప్పుడు తీవ్రమైన కంటి సమస్యలు రావచ్చు. శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. రెటీనా అంటే కంటి గుడ్డు లోపల అద్దంలా ఉండే పలుచని పొర. దీనిపై ఏ మాత్రం ఒత్తిడి పడినా కంటికి ప్రమాదం.

'కొన్ని సార్లు కంటి వ్యాధుల వల్ల శాశ్వతం చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే కంటి సమస్యలు రాగానే వైద్యుడిని సంప్రదించాలి. కంటి పట్ల అలసత్వం వహించడం అసలు మంచిది కాదు. ఎప్పుడైనా కళ్లు ఎర్రబారినా, వాచినా, ఉబ్బినట్లు కనిపించినా ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.' అని నిపుణులు సూచిస్తున్నారు.

ఒత్తిడి పడకుండా..
కాలుష్యం, ఎలర్జీ వంటి కారణాలతో కళ్లు కొన్నిసార్లు దురద పెడుతుంటాయి. ఆ సమయంలో కళ్లను చేతులతో నలిపేస్తుంటాం. అలా చేయడం వల్ల కళ్లు ఎర్రగా మారిపోతుంటాయి. వీటి నుంచి ఉపశమనం పొందేందుకు లూబ్రికెంట్స్ వాడడం మేలని నిపుణులు చెబుతున్నారు. అయితే ముఖ్యంగా ప్రతిరోజు కళ్లను ఎప్పటికప్పుడు మంచి నీటిని శుభ్రంగా కడుక్కోవడం మంచిదని అంటున్నారు. దీనివల్ల కంటిలో వల్ల దుమ్ము, ధూళి తగ్గుతాయని చెబుతున్నారు.

బైక్​పై వెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలతో మీ కళ్లు సేఫ్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.