ETV Bharat / sukhibhava

మెనోపాజ్‌ తర్వాత బ్లీడింగా? అయితే ఇవి కారణం కావచ్చు..! - womens health tips

మెనోపాజ్‌ అంటేనే మహిళల్లో నెలసరి ఆగిపోయే దశ. సాధారణ పరిస్థితుల్లో వరుసగా ఏడాది పాటు నెలసరి రాకపోతే.. వారు మెనోపాజ్‌ దశలోకి అడుగుపెట్టారని అర్థం. అయితే ఈ సమయంలోనూ కొంతమందికి అప్పుడప్పుడూ రక్తస్రావం కనిపిస్తుంటుంది. మరి, నెలసరి ఆగిపోయినా బ్లీడింగ్ అవుతోందంటే అది కచ్చితంగా ఏదో ఒక ప్రమాదకరమైన వ్యాధి/సమస్యకు సూచిక అంటున్నారు నిపుణులు. అందుకే దీన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుల్ని సంప్రదిస్తే అసలు సమస్యేంటో తెలుసుకొని ఆదిలోనే దానికి చెక్‌ పెట్టేయచ్చని చెబుతున్నారు.. లేదంటే దాని వల్ల ఇతర అనారోగ్యాలకూ దారితీసే ప్రమాదముందంటున్నారు. మరి, ఇంతకీ మెనోపాజ్‌ తర్వాత వెజైనల్‌ బ్లీడింగ్‌ ఎందుకవుతుంది? ఈ క్రమంలో ఇంకా ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఇంతకీ దీనికి చికిత్స ఉందా?, లేదా? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

womens health solutions
మోనోపాజ్ నిపుణుల వివరణ
author img

By

Published : Mar 31, 2021, 12:55 PM IST

సాధారణంగా యుక్త వయసులో ఉన్నప్పుడు నెలసరి వల్ల బ్లీడింగ్‌ అవుతుంటుంది. అదే మెనోపాజ్‌ దశకు చేరుకున్న వారిలో ఈ రక్తస్రావం పూర్తిగా ఆగిపోతుంది. అయితే ఆ తర్వాత కూడా బ్లీడింగ్ కనిపిస్తోందంటే మాత్రం అందుకు వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ (ఈ చికిత్స తీసుకున్న తర్వాత కొన్ని రోజుల వరకు రక్తస్రావం కనిపిస్తుంటుంది).. వంటివి కూడా కారణమవుతాయి. అంతేకాదు.. ఈ క్రమంలో మీ ఆరోగ్య స్థితి, లక్షణాలను బట్టి ఇతర అనారోగ్యాలు కూడా ఉండచ్చంటున్నారు నిపుణులు.

menopausebleedinghg650-1.jpg
నిపుణులను సంప్రదించండి

పాలిప్స్‌ ఉన్నాయేమో..?!
యుటరిన్‌ పాలిప్స్‌ అనేవి గర్భాశయం గోడలకు అతుక్కొని పెరుగుతాయి. అయితే వీటిలో చాలా వరకు క్యాన్సర్‌ రహితమైనవే అయినా.. కొన్ని మాత్రం క్యాన్సర్‌కు దారితీసే అవకాశాలూ లేకపోలేదంటున్నారు నిపుణులు. ఇలాంటివి ఉన్నప్పుడు ఇర్రెగ్యులర్‌గా రక్తస్రావం కావడం అనేది సహజం. మెనోపాజ్‌ దశకు చేరిన వారితో పాటు యుక్తవయసులో ఉన్న కొంతమంది మహిళల్లోనూ ఈ పాలిప్స్‌ ఏర్పడతాయట!
ఎండోమెట్రియల్‌ హైపర్‌ప్లేసియా
గర్భాశయం పొర (ఎండోమెట్రియం) దళసరిగా మారడాన్ని ఎండోమెట్రియల్‌ హైపర్‌ప్లేసియాగా చెబుతున్నారు నిపుణులు. మెనోపాజ్‌ తర్వాత బ్లీడింగ్‌ కావడానికి ఇదీ ఓ ప్రధాన కారణమే! ప్రొజెస్టిరాన్‌ స్థాయులు తగ్గిపోయి, ఈస్ట్రోజెన్‌ స్థాయులు పెరిగినప్పుడు ఇలా జరుగుతుందని, మెనోపాజ్‌ దాటిన మహిళల్లో ఇది కామనే అంటున్నారు. అయితే ఇందుకోసం దీర్ఘకాలం పాటు ఈస్ట్రోజెన్‌ మాత్రలు వాడితే ఈ సమస్య మరింత పెరిగి.. ఒక దశలో ఇది క్యాన్సర్‌కు కూడా దారితీయచ్చని హెచ్చరిస్తున్నారు. అలాగే గర్భాశయం పొర పలుచగా మారినా ఇలా రక్తస్రావం అవుతుందట! దీన్ని ఎండోమెట్రియల్ ఎట్రోఫీ అంటారు. ఏదేమైనా ఆదిలోనే సమస్యను గుర్తించి తగిన చికిత్స తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

menopausebleedinghg650-2.jpg
తగిన చికిత్స తీసుకోవాలి

క్యాన్సర్‌ అని తేలితే..?!
మెనోపాజ్‌ దాటిన మహిళల్లో రక్తస్రావంతో పాటు వెజైనా దగ్గర నొప్పి కూడా వస్తోందంటే అది గర్భాశయ క్యాన్సర్‌ (ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌)కు సూచన కావచ్చని చెబుతున్నారు నిపుణులు. మెనోపాజ్‌ తర్వాత రక్తస్రావం అయ్యే మహిళల్లో సుమారు 10 శాతం మందిలో ఈ క్యాన్సర్‌ ఉన్నట్లు తేలింది. అయితే దీన్ని ఆదిలోనే గుర్తించడం మంచిదని, చాలా కేసుల్లో క్యాన్సర్‌కు చికిత్స చేసే క్రమంలో గర్భాశయాన్ని పూర్తిగా తొలగించాల్సి వస్తుందని చెబుతున్నారు.

బ్లీడింగ్‌తో పాటు..!
మెనోపాజ్‌ తర్వాత రక్తస్రావం కావడానికి అరుదుగా సర్వైకల్‌ క్యాన్సర్‌ కూడా ఓ కారణం కావచ్చంటున్నారు నిపుణులు. బ్లీడింగ్‌తో పాటు కలయిక సమయంలో నొప్పి, వెజైనల్‌ డిశ్చార్జ్‌.. వంటివి కనిపిస్తే ఈ క్యాన్సర్‌గానే అనుమానించాలంటున్నారు. అయితే ఇది అంత త్వరగా బయటపడదని, ఈ క్యాన్సర్‌ కణాలను గుర్తించడానికి ఎప్పటికప్పుడు సంబంధిత పరీక్షలు చేయించుకోవడం వల్ల ఆదిలోనే దీన్ని గుర్తించి తగిన చికిత్స తీసుకోవచ్చని సలహా ఇస్తున్నారు.

ఎలా గుర్తిస్తారు?

menopausebleedinghg650.jpg
ఎప్పటికప్పుడు సంబంధిత పరీక్షలు చేసుకోండి

మెనోపాజ్‌ తర్వాత బ్లీడింగ్‌ కనిపించినట్లయితే ఆలస్యం చేయకుండా సంబంధిత నిపుణుల్ని సంప్రదించడం ఉత్తమం. ఈ క్రమంలో వైద్యులు పాప్‌స్మియర్‌, ట్రాన్స్‌వెజైనల్‌ అల్ట్రాసౌండ్‌, హిస్టరోస్కోపీ.. వంటి పరీక్షల ద్వారా అసలు సమస్యేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే ఆయా సమస్యల్ని బట్టి ఎలాంటి మందులు, క్రీములు వాడాలో సూచిస్తారు.

ఇవి గుర్తుంచుకోండి!

menopausebleedinghg650-3.jpg
పోషకాహారం తీసుకోండి

* మెనోపాజ్‌ తర్వాత రక్తస్రావానికి ఎండోమెట్రియల్ ఎట్రోఫీ (గర్భాశయ పొర పలుచగా మారడం) కారణమైతే ఆదిలోనే దానికి చికిత్స తీసుకోవాలి. అప్పుడే అది క్యాన్సర్‌కు దారితీయకుండా జాగ్రత్తపడచ్చు.
* మెనోపాజ్‌ దశలో తలెత్తే సమస్యల్ని ఎదుర్కోవాలంటే నిపుణుల సలహా మేరకు చక్కటి పోషకాహారం, క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి ఆరోగ్యకరమైన జీవనశైలే మనల్ని ఎన్నో రకాల అనారోగ్యాలకు/వ్యాధులకు దూరంగా ఉంచుతుంది.
* రక్తస్రావం అయినా, కాకపోయినా రెగ్యులర్‌ చెకప్స్‌ చేయించుకోవడం అన్ని విధాలా మంచిది. ఈ క్రమంలో ఏదైనా సమస్య ఉంటే ముందుగానే గుర్తించడానికి వీలవుతుంది.
* మెనోపాజ్‌ దశలో మహిళలు ఎక్కువగా బరువు పెరుగుతుంటారు. ఇది కూడా ఎన్నో అనారోగ్యాలకు మూలమవుతుంది. కాబట్టి దీన్ని నియంత్రించడానికి నిపుణుల సలహాలు పాటించడం తప్పనిసరి.
* మెనోపాజ్ సమస్యల నుంచి విముక్తి పొందడానికి కొంతమంది హార్మోన్‌ రిప్లేస్‌మెంట్‌ థెరపీ చేయించుకుంటారు. ఈ విషయంలో ముందుగా డాక్టర్‌ సలహా తీసుకోవడం అన్ని విధాలా మంచిది.

ఇదీ చదవండి: ఇవాళ పదవి విరమణ చేయబోతున్నా: ఎస్​ఈసీ నిమ్మగడ్డ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.