- స్క్వాట్స్... సులభంగా చేసుకోగలిగే వ్యాయామాల్లో ఇదొకటి. కాళ్లను కాస్త ఎడంగా ఉంచి చేతుల్ని ముందుకు చాచి కుర్చీలో కూర్చున్నట్టు కూర్చొని తిరిగి పైకిలేవడమే ఈ వ్యాయామం. దీనివల్ల నడుము కింది భాగాలు దృఢంగా తయారవుతాయి. ఒకసారి పదిచొప్పున రెండు మూడు విడతలు చేస్తే మంచిది.
- స్పాట్ జాగింగ్... నిల్చొన్నచోటనుంచి ముందుకు వెళ్లకుండా పరుగెత్తడమే ఈ వ్యాయామం. కాళ్లూ, చేతుల్ని నిజంగా పరుగెత్తుతున్నట్లే కదపాలి. క్రమంగా వేగాన్ని పెంచుతూ, తగ్గిస్తూ అయిదు నిమిషాలు చేస్తే చాలు. ఇలానే బట్ కిక్స్(కాలితో పిరుదుల భాగాన్ని తాకడం)నీ చేయొచ్ఛు మోకాళ్లు చేతులకి తాకినట్లూ ప్రయత్నించవచ్ఛు
- పవర్ ప్లాంక్స్... శరీరం మొత్తం ప్రభావం ఉండే వ్యాయామం. పది వరకూ స్క్వాట్స్ చేసి ఆపైన రెండు మూడు పుషప్స్ తీయండి. తర్వాత నేలమీద వెల్లికలా పడుకుని కాళ్లను పైకి లేపి నిటారుగా ఉంచండి. అలా ఉంటూనే శరీరాన్ని పైకిలేపి 20 సెకన్లపాటు ఉంచడానికి ప్రయత్నించండి.
- బర్పీస్... నిటారుగా నిల్చొని తర్వాత కాళ్లను వెనక్కి జరపండి. ఒక పుషప్ తీసి తిరిగి నిల్చొని పైకి ఒక జంప్ చేయండి. తరువాత యథాస్థితికి వచ్చేయండి. ఇలా అయిదు నుంచి పదిసార్లు ఒక విడతలో చేస్తే సరి.
- స్ట్రెచింగ్.. నేలపై బోర్లా పడుకుని చేతులూ కాళ్లను నేలనుంచి పైకి లేపండి. చేతుల్ని తల భాగానికి సమాంతరంగా ఉంచాలి. అలా పది సెకన్లపాటు ఉంచి కిందకు దించండి. ఇలా మీకున్న టైమ్‌లో ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు చేయండి.
ఈ వ్యాయామాలు.. ఎప్పుడైనా ఎక్కడైనా చేసేయొచ్చు! - exercise can be completed within minutes
టైమ్ లేదనో, వాతావరణం అనుకూలించట్లేదనో... చాలామంది వ్యాయామానికి తరచూ డుమ్మా కొడతారు. ఎలాంటి పరికరాలూ అవసరం లేకుండా ఎక్కడైనా ఎప్పుడైనా నిమిషాల్లో పూర్తిచేసి కెలొరీలు కరిగించే వ్యాయామాలున్నాయి. అవేంటంటే...
ఈ వ్యాయామాలు.. ఎప్పుడైనా ఎక్కడైనా చేసేయొచ్చు!