ETV Bharat / sukhibhava

గర్భంతో ఉన్నవారు ఇవి అస్సలు  చేయకూడదు! - గర్భిణీలు బరువులు ఎత్తవచ్చా?

గర్భందాల్చినప్పటి నుంచి కాన్పయ్యే వరకు ఓ మహిళ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ క్రమంలో ఎవరికి తొచిన సూచనలు, సలహాలు వారు ఇస్తుంటారు. అయితే ఆ సమయంలో ఎవరి మాటలు వినాలి. ఏది చేయాలి? ఏది చేయకూడదు? ఏది నిజం? ఏది అపోహ? ఏది ఆరోగ్యకరం? ఏది అనారోగ్యానికి దారి తీస్తుంది? అనే ప్రశ్నలు ఎదురవుతాయి. అయితే అనుభవంతో పెద్దలు చెప్పే మాటల్లో నిజమెంత? ఆధునిక శాస్త్రపరిజ్ఞానం మీద అవగాహనతో వైద్యులు చెప్పే మాటల్లో వాస్తమెంత?

Do's and Don'ts of Pregnancy
గర్భిణిగా ఉన్నప్పుడు ఇవి చేయవచ్చా?
author img

By

Published : Aug 27, 2021, 4:01 PM IST

గర్భధారణ ఓ అనిర్వచనీయమైన అనుభూతి. అలాగే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం కూడా. ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలా వ్యవహరించాలి? ఇలా చాలా విషయాల్లో అనుమాలు వస్తూనే ఉంటాయి. ఏయే పనులు చేయవచ్చు? ఏవి చేయకూడదు? ఏ నెలలో ఏం చేయాలో అనే విషయాల్లో ఇళ్లల్లో పెద్దలు చెప్పే మాటలకు.. వైద్యులు చేసే సూచనలకు తేడా ఉండవచ్చు! అందువల్ల వైద్యుల మాటల వెనుక ఏముందో.. ఏ సందర్భంలో ఎలా వ్యవహరించాలి? వైద్యులు సలహాలు ఏంటో తెలుసుకుందాం.

ప్రెగ్నెంట్​ అని తెలిశాక రకరకాల ఆంక్షలు ఉంటాయి. తినే ఆహారం మొదలుకుని విశ్రాంతి తీసుకోవడం వరకు అడుగడుగునా వివిధ సూచనలిస్తుంటారు. అయితే అందులో కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి. ఏది నిజమో.. ఏది మూఢనమ్మకమో తెలుసుకుని వ్యవహరించాల్సిన బాధ్యత గర్భిణి మీద.. ఆమె కుటుంబసభ్యుల మీద ఉంటుంది. అయితే గర్భిణి చేయదగిన.. చేయకూడని పనులేంటో చూద్దాం.

గర్భిణిగా ఉన్నప్పుడు చేయాల్సినవి!

  • గర్భం దాల్చిన మహిళలు సరైన పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి.
  • కాబోయే తల్లికి మంచి పోషకాహారం ముఖ్యం కాబట్టి.. పచ్చటి ఆకు కూరలు, గుడ్లు, పండ్లు, మాంసం లాంటివి ఆహారంగా తీసుకోవాలి.
  • సాధారణంగా మన ఆహారంలో పిండి పదార్థాలున్న పప్పులు, ధాన్యాలు, గోధుమ, బియ్యం, జొన్నలు, రాగులు, బంగాళదుంపలు, కర్రపెండలం, చిలగడదుంపలు, అరటి, బ్రెడ్​, పండ్లు ఉంటాయి. వీటితో పాటు మాంసకృత్తులు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి.
  • టీ, కాఫీలాంటివి పరిమితంగా తీసుకోవాలి.
  • గర్భిణికి ఎక్కువగా చమటలు పట్టడం సహజం. అందుకే ఎక్కువగా మంచినీళ్లు, నిమ్మరసం, కొబ్బరినీరు. తాజా పండ్ల రసాలు తీసుకోవాలి.
  • గర్భం దాల్చిన తర్వాత చాలా మందికి బెడ్​రెస్ట్​ మంచింది. అలా విశ్రాంతి తీసుకోవడం వల్ల పిండానికి ఎక్కువ రక్త సరఫరా జరిగే అవకాశం ఉంటుంది.
  • స్నానానికి, బాత్రూమ్​కు తప్ప లేవకుండా కూర్చోవటమో, పడుకోవటమో చేయాలని చెప్పడం. ఇలాంటి సందర్భాల్లో కాన్పయ్యే వరకు అలాంటి విశ్రాంతి అవసరమవుతుంది.
  • వేడినీళ్ల స్నానం మంచిదా.. కాదా అన్న విషయంలో కేవలం గోరువెచ్చని నీళ్ల వరకే పరిమితం కావాలన్నది వైద్యుల అభిప్రాయం.
  • శరీర ఉష్ణోగ్రతను 102.2 డిగ్రీలకు తీసుకెళ్లే వేడి జోలికి వెళ్లవద్దని వైద్యులు చెబుతారు. ఇలా చేస్తే.. శిశువు పెరుగుదలపై ప్రభావం చూపుతుందని... వీలైనంతవరకు శరీరాన్ని చల్లగా ఉంచుకోవడమే మంచిది.
  • ఆరోగ్య సమస్యలు లేనివారు శృంగారంలో పాల్గొనడంలో ఏ విధమైన అభ్యంతరాలు ఉండనక్కర్లేదు.
  • అయితే గర్భిణికి ముందస్తు కాన్పు జరిగే ప్రమాదం ఉందనుకున్నప్పుడు, కటివలయంలో సమస్యలు.. మాయ పొర దెబ్బతినడం, సుఖరోగాలు ఉన్నప్పుడు మాత్రం సెక్స్​లో పాల్గొనవద్దు
  • గర్భిణుల్లో హోర్మోన్ల మార్పుల వల్ల.. థైరాయిడ్​ పరీక్షలు చేయించుకోవడం మంచింది. ఈ సమస్య గర్భస్రావానికి సైతం దారితీసే ప్రమాదం ఉంది.
  • కాన్పు జరిగేవరకు తేలిక పాటి వ్యాయామాలు చేయవచ్చు. చిన్నచిన్న పనులు చేస్తూ.. చురుగ్గా ఉంటే సుఖప్రసవం అవుతుంది. ఇది గర్భిణుల్లో నిద్రలేమి సమస్యకు పరిష్కారం చూపుతుంది.
  • రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగడం వల్ల నిద్ర బాగా పడుతుంది. రాత్రి పూట 8 నుంచి 10 గంటలు, పగలు ఒక గంట నిద్ర లేదా విశ్రాంతి అవసరం.
  • నిద్రపోయేటప్పుడు ఎడమ వైపు తిరిగి పడుకోవాలి.
  • కాళ్లకు సరిపోయే సౌకర్యవంతమైన చెప్పులు ధరించాలి.
  • గర్భిణులు బరువు పెరుగుదలను గమనించాలి. తొమ్మిదో నెల వచ్చేసరికి 8 నుంచి 9 కిలోలు బరువు పెరిగేలా చూసుకోవాలి.
  • గర్భిణి తన గురించి.. తన బిడ్డ గురించి జాగ్రత పడే క్రమంలో రక్తపోటు స్థాయిని పరీక్షించుకోవాలి. సాధారణంగా ఈ రక్తపోటు గర్భం దాల్చిన 20వారాల్లో రావడం సహజం. సకాలంలో గుర్తించి పరీక్షించుకోవాలి.

చేయకూడనవి!

  • గర్భవతిని బాగా ప్రభావితం చేసేది ఆమె తీసుకునే ఆహారం. ఎందుకంటే దీని ప్రభావం ఆమెతో పాటు కడుపులో పెరుగుతున్న బిడ్డపైన కూడా పడుతుంది. అందుకే బలవర్థకమైన ఆహారం ఎంత ముఖ్యమో.. తినకూడని వాటిని దూరంగా పెట్టడం కూడా అంతే ముఖ్యం.
  • గర్భిణులు ఫుడ్​ పాయిజనింగ్​కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఉడికి ఉడకని మాంసం, గుడ్లు తినకూడదు.
  • వైద్యులు అనుమతిస్తే తప్ప.. హెర్బల్​ టీ జోలికి పోకూడదు.
  • పచ్చిగుడ్ల వాడకం మంచిది కాదు.
  • చేపలు తినడం మంచిదే అయినా.. కొన్ని చేపల్లో పాదరసం స్థాయి అధికం ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల వాటి జోలికి వెళ్లకూడదు. అలాంటి చేపలు తినడం వల్ల శిశువు నాడీమండలం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది.
  • గర్భిణిగా ఉన్నప్పుడు ఇద్దరు కోసం తినాలని చెబుతుంటారు.. అంతమాత్రానా రెట్టింపు ఆహారం తినాలని కాదు. మితిమీరి బరువు పెరగడం వల్ల కాన్పులో ఇబ్బందులతో పాటు పుట్టబోయే బిడ్డకు ఊబకాయం రావచ్చు. మితంగా తినడం మంచిది.
  • పిల్లల్ని ఎత్తుకోవడం లాంటి బరువు పనులేవి చేయకూడదు. ఇంటి పరిసరాలకే పరిమితం కావడం మంచిది. భారీ వ్యాయామాలు జోలికి వెళ్లకూడదు.

అపోహాలు..

  • అలాగే బొప్పాయి తినడం వల్ల గర్భస్రావం అవుతుందన్నది కేవలం అపోహా మాత్రమే.
  • విశ్రాంతి తీసుకోవడం వల్ల ముందస్తు కాన్పు జరగకుండా సహాయ పడుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు.

ఇదీ చూడండి: అమ్మాయిలు.. అలసటగా ఉంటోందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.