ETV Bharat / sukhibhava

శృంగారంతో ఇమ్యూనిటీ పెరుగుతుందా? - శృంగారం ఉపయోగాలు

శృంగారంతో మానసిక ఉల్లాసమే కాదు ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి. శరీరంలో పలు సమస్యలకు దీని ద్వారా చెక్​ పెట్టొచ్చు! ఒత్తిడి దూరమవ్వడం, రోగనిరోధక శక్తి పెరగడం సహా మరెన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం..

sex life
సెక్స్​ లైఫ్​
author img

By

Published : Aug 18, 2021, 4:49 PM IST

శృంగారంతో ఆనందం, సంతోషం, ఉత్సాహం చేకూరుతాయన్నది మనకు తెలిసిందే. అయితే దీని వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయట! ఒత్తిడి దూరమై మెదడు చురుగ్గా పనిచేయడం, రోగనిరోధక శక్తి పెరగడం సహా ఇంకా చాలా లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..

ఇమ్యూనిటీ

సెక్స్​ చేయడం వల్ల సంతృప్తి చెందటమే కాకుండా మన శరీరంలో యాంటీబాడీస్​ పెరుగుతాయట. తద్వారా శరీరంలో ఇమ్యూనిటీ పవర్​ పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. క్రిములు, వైరస్​లను ఎదుర్కోవడానికి శృంగారం బాగా సహాయపడుతుందట.

బ్లాడర్​ లీకేజ్​కు చెక్​!

సెక్స్​ వల్ల మహిళల శరీరంలో కండరాలు బలంగా తయారవుతాయి. వారిలో యూరిన్​ లీక్​ సమస్య ఉంటే దానికి చెక్​ పెట్టొచ్చు! కార్యంలో పాల్గొనడం మహిళల ఆరోగ్యానికి మంచిది.

గుండెపోటు రిస్క్​ తగ్గుతుంది

శృంగారం.. శరీరంలో ఈస్ట్రోజన్​, టెస్టోస్టిరోన్​ లెవెల్స్​ సరిగ్గా ఉండేలా చూస్తుంది. ఒకవేళ ఈ హార్మోన్స్​ బ్యాలెన్స్​ తప్పితే హార్ట్​ ఎటాక్​ వస్తుంది. కాబట్టి తరచుగా సెక్స్​ చేయడం వల్ల గుండె పోటు, హృదయ సంబంధిత సమస్యలు రాకుండా జాగ్రత్త పడొచ్చు!

కాన్ఫిడెంట్ లెవెల్స్​

సెక్స్​లో పాల్గొనేవాళ్లలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఎనర్జీ లెవల్స్​ ఎక్కువగా ఉంటాయి. శరీరం చురుగ్గా పనిచేస్తుంది. చాలా మందిలో నిద్రలేమి సమస్య ఉంటుంది. అదే ఈ కార్యం క్రమం తప్పకుండా చేసుకుంటుంటే నిద్రలో నాణ్యత పెరుగుతుంది. బాగా నిద్రపోవాలని అనిపిస్తుంది. శరీరం రిలాక్స్​గా ఉంటుంది. తద్వారా మానసిక ఆనందాన్ని పొందుతారు.

ఇదీ చూడండి: శృంగారంతో జలుబు మాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.