ETV Bharat / sukhibhava

అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా? - ఈ ఆహారాలు ఔషధం! - how to control bp with food in telugu

Diet For High BP Patients : చాలా మంది హైబీపీతో బాధపడుతుంటారు. ఈ సమస్య రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అయితే.. వీరు రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవడానికి ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

High BP Patients Food Diet
High BP Patients Food Diet
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 13, 2023, 3:57 PM IST

Diet For High BP Patients : ఆరోగ్యంగా ఉండాలంటే రక్తపోటును నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే.. రక్తపోటు తక్కువగా ఉన్నా లేదా ఎక్కువగా ఉన్నా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి, రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రక్తంలో ఉప్పు శాతం పెరిగినప్పుడు లేదా తగ్గినప్పుడు రక్తపోటు మారుతుంటుంది. దీన్ని నియంత్రించుకోవాలంటే సరైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. మరి.. ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

హైబీపీతో బాధపడుతున్నవారికి వైద్యులు మందులు సూచిస్తారు. వీటితోపాటు ఆహారంలో ఉప్పు వాడకాన్ని తగ్గించాలని చెబుతారు. ఉప్పు కారణంగా రక్తంలో ఫ్లూయిడ్ శాతం పెరుగుతుంది. అలాగే.. కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలను రోజు వారి ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తారు. మసాలాలు, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలంటారు. ఇవి సహజంగా చేసే సూచనలు. వీటితోపాటు.. మరికొన్ని ఆహార మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఫ్యాటీ ఫిష్‌..
సాల్మన్‌, ట్యూనా, మాకెరెల్ వంటి చేపలలో ఓమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. దీంతో రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఫలితంగా బీపీ తగ్గుతుంది.

విత్తనాలు..
అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారు అవిసె గింజలు, చియా విత్తనాలు, గుమ్మడి గింజలు తినాలి. ఎందుకంటే.. వీటిలో పొటాషియం, మెగ్నీషియం కంటెంట్ అధికంగా ఉంటుంది. దీంతో రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండి.. బీపీ స్థిరంగా ఉంటుంది.

మీరు ఈ ఆహార పదార్థాలు తింటున్నారా? - మీ పేగుల్లో విషం నింపుతునట్టే!

గుడ్డు తెల్లసొన..
హై-బీపీతో బాధపడుతున్నవారు గుడ్డులోని తెల్లసొన తినాలి. ఇందులో ఉండే ప్రొటీన్‌ కంటెంట్‌.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీంతో హైపర్‌టెన్షన్‌ తగ్గుతుంది.

గ్రీన్ టీ..
హైపర్‌ టెన్షన్‌ తగ్గించడానికి గ్రీన్‌ టీ కూడా సహాయపడుతుంది. గ్రీన్‌ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె ధమనులను విస్తరిస్తుంది. దీంతో రక్తప్రవాహం సులభంగా జరిగి, బీపీ స్థిరంగా ఉంటుంది.

చిక్కుళ్లు..
అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారు చిక్కుళ్లు తింటే బీపీ కంట్రోల్లో ఉంటుంది. చిక్కుళ్లలో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది.

బెర్రీస్..
బెర్రీస్ అనేవి చిన్న, తియ్యటి, రుచికరమైన పండ్లు. వీటిలో బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, క్రాన్బెర్రీస్, రాస్ప్బెర్రీస్, హాజెల్బెర్రీస్ వంటివి ఉంటాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయం చేస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

క్యాలీఫ్లవర్..
క్యాలీఫ్లవర్, బ్రకోలి వంటి కూరగాయలను తింటే రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇందులో ఉండే ఐరన్, పొటాషియం, కాల్షియం యాంటీ ఆక్సిడెంట్లు రక్త నాళాలను దెబ్బతినకుండా చూస్తాయి.

డార్క్ చాక్లెట్..
పాలు, చక్కెర కలపని డార్క్ చాక్లెట్‌ను తినడం వల్ల మానసిక ఉత్తేజం కలుగుతుంది. ఇది శరీరాన్ని ఉత్సాహంగా ఉంచే అడ్రినలిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో విటమిన్ Aతో పాటు అనేక ఖనిజాలు కూడా ఉంటాయి. డార్క్ చాక్లెట్‌లోని కోకో రక్త నాళాల్లోని రక్తాన్ని చిక్కబడనివ్వకుండా చేస్తుంది. దీంతో రక్తపోటు అదుపులో ఉంటుంది.

ఈ ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేస్తే - పార్లర్​కు వెళ్లకుండానే మెరిసే అందం మీ సొంతం!

మెడ నల్లగా ఉందని బాధపడుతున్నారా? - ఈ టిప్స్ ట్రై చేశారంటే తెల్లగా మారడం ఖాయం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.