ETV Bharat / sukhibhava

షుగర్ పేషెంట్స్ స్వీట్స్ తినొచ్చా? తినకూడదా? మీకు తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 24, 2023, 1:26 PM IST

Diabetic Patients Can Eat Sweets : షుగర్‌ వ్యాధి ఉన్న వారికి సాధారణ వ్యక్తుల్లాగే స్వీట్లు తినాలని ఉంటుంది. కానీ, దీనివల్ల ఇంకా చక్కెర స్థాయులు పెరుగుతాయేమోనని తినకుండా ఉంటారు. అసలు షుగర్‌ ఉన్నవారు స్వీట్లను తినొచ్చా? దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

Diabetic Patients Can Eat Sweets
Diabetic Patients Can Eat Sweets

Diabetic Patients Can Eat Sweets : షుగర్‌ వ్యాధితో బాధపడే వారు ఏం తినాలన్నా చాలా ఆలోచిస్తుంటారు. ఏది తింటే ఇంకా షుగర్‌ పెరుగుతుందో అని కంగారు పడుతుంటారు. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు పెరిగి, తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తడమే దీనికి కారణం. మరి.. నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

Sugar Patients Can Eat Sweets : మధుమేహంతో బాధపడుతున్న వారు కూడా కొన్నిసార్లు తక్కువ మొత్తంలో స్వీట్లను తినవచ్చని నిపుణులు చెబుతున్నారు. కానీ.. కండిషన్స్ అప్లై అంటున్నారు. అదేమంటే.. అప్పుడప్పుడు మాత్రమే తినాలని.. అది కూడా నామమాత్రమేనని సూచిస్తున్నారు. రక్తంలో షుగర్‌ నియంత్రణ లేని వారు మాత్రం అస్సలు స్వీట్లను తినకూడదని చెబుతున్నారు. ఒకవేళ తింటే చక్కెర స్థాయులు మరింత పెరగవచ్చని హెచ్చరిస్తున్నారు. అందువల్ల షుగర్‌ ఉన్నవారు స్వీట్లు తినాలని అనిపిస్తే.. ముందు ఒకసారి షుగర్‌ లెవల్స్‌ చెక్‌ చేసుకోవాలని.. ఆ తర్వాతే తినాలని సూచిస్తున్నారు. ఇంకా ఏం చెబుతున్నారంటే...

షుగర్‌ ఉన్నవారు స్వీట్లను తినే ముందు ఈ నాలుగు విషయాలను గుర్తుంచుకోవాలి..

ఫైబర్, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం..
షుగర్ ఉన్నవారు స్వీట్లను తినాలనుకుంటే.. రోజువారి ఆహారంలో ఫైబర్‌, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే కొవ్వు పదార్థాలు, కార్బోహైడ్రేట్లను తక్కువగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కొద్ది మొత్తంలో స్వీట్లను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులలో ప్రభావం ఉండదని నిపుణులు చెబుతున్నారు. అలాగే స్వీట్‌ కంటెంట్ ఎక్కువగా ఉండే వాటికి దూరంగా ఉండాలంటున్నారు.

ప్రతీ వారం మటన్ తింటే - షుగర్ వస్తుందా?

ఖాళీ కడుపుతో తినకూడదు..
షుగర్ వ్యాధితో బాధపడుతున్నవారు ఎప్పుడూ ఖాళీ కడుపుతో స్వీట్లను తినకూడదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉందంటున్నారు. వీరు ఉదయాన్నే టిఫిన్‌ చేసిన తరవాత స్వీట్లను తినాలి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంటాయి.

రాత్రిపూట వద్దు..
కొంత మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నవారు రాత్రి సమయంలో ఫంక్షన్లకు వెళ్లినప్పుడు, స్వీట్లను తినకుండా అస్సలు ఉండలేరు. కానీ, ఇది ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట స్వీట్లను తినడం వల్ల తరచుగా మూత్ర విసర్జన చేయడం, వాంతులు జరిగే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు. దీనివల్ల నిద్రకు ఇబ్బంది కలుగుతుంది.

కూల్‌డ్రింక్స్‌, జ్యూస్‌లు వద్దు..
షుగర్‌ ఉన్నవారు కూల్‌డ్రింకులను, చక్కెర ఉండే జ్యూస్‌లను అస్సలు తాగకూడదు. వీటితో రక్తంలో షుగర్‌ స్థాయులు మరింత పెరుగుతాయి. టైప్‌ 1 డయాబెటిస్ ఉన్నవారు, రక్తంలో షుగర్‌ నియంత్రణ ఉండటానికి ఇన్సులిన్ తీసుకునే వారు ఎలాంటి స్వీట్లను తినకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాగే షుగర్‌ ఎక్కువ ఉన్నవారు కూడా స్వీట్లను తినవద్దు.

గమనిక : పైన తెలిపిన సమాచారం నిపుణుల అభిప్రాయం ప్రకారం మాత్రమే. ఇది కేవలం పాఠకుల అవగాహన కోసం. షుగర్ ఉన్నవారు ఏదైనా పదార్థాలను, స్వీట్లను తినాలనుకుంటే కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి.

ఈ లక్షణాలు మీ బాడీలో కనిపిస్తున్నాయా?- అయితే మీకు టైప్ 2 డయాబెటిస్ ఉన్నట్లే! జాగ్రత్త సుమా!!

బరువు తగ్గడానికి తిండి బంద్​ చేయొద్దు - ఈ పనులు చేయండి - తగ్గడం గ్యారెంటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.