ETV Bharat / sukhibhava

హైదరాబాద్​లో బ్లాక్ ఫంగస్​ ఆనవాళ్లు! - కోవిడ్ రోగుల్లో ప్రమాదకర శిలీంధ్ర వ్యాధి

గత 3-4 వారాలుగా హైదరాబాద్ నగరంలో కొవిడ్ రోగులు మ్యూకోర్ మైకోసిస్ అనే శిలీంధ్ర వ్యాధి బారిన పడుతున్నట్టు తెలుస్తోంది. కొవిడ్ రోగులకు పొంచి ఉన్న ఈ కొత్త ప్రమాదం ఏమిటో తెలుసుకుందాం.

Deadly fungal infection found among covid patients in hyderabad
కోవిడ్ రోగుల్లో ప్రమాదకర శిలీంధ్ర వ్యాధి
author img

By

Published : May 11, 2021, 4:23 PM IST

Updated : May 11, 2021, 4:53 PM IST

హైదరాబాద్ నగరంలో పేరు గల ఒక పెద్ద ఆసుపత్రిలో కొందరు కొవిడ్ రోగులకు చాలా ప్రమాదకరమైన మ్యూకోర్ మైకోసిస్ అనే శిలీంధ్ర వ్యాధి సోకి ప్రాణాంతకంగా మారుతుండటాన్ని వైద్యులు గమనించారు. గత నెలలో ఐదుగురికి మ్యూకోర్ మైకోసిస్ సోకినట్టు గుర్తించారు. దీర్ఘకాలం ఆసుపత్రిలో ఉండటం, స్టెరాయిడ్ ఔషధాలు వాడుతుండటం వల్ల రోగ నిరోధక శక్తి బలహీన పడుతోంది. ఈ కారణంగా మరింత నష్టం కలుగజేసే ఈ శిలీంధ్ర వ్యాధి రోగుల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తోంది.

"కళ్ల చుట్టూ వాపు, మొహంపై ఒక వైపు నొప్పి, ఒక కంటిలో నొప్పి, చెక్కిళ్లపై స్పర్శ తగ్గటం, ముక్కులో నుంచి రక్తంతో కూడిన స్రావం మొదలైన లక్షణాలు కనిపించవచ్చు. ఇవన్నీ మ్యూకోర్ మైకోసిస్ వ్యాధి లక్షణాలే. వీరికి శిలీంధ్ర హర ఔషధాలను వాడాలి. లేదా శస్త్ర చికిత్స చేయించుకోవాలి" అని కాంటినెంటల్ ఆస్పత్రి గొంతు, ముక్కు, చెవి వైద్య నిపుణులు డా. దుష్యంత్ గణేషుని చెబుతున్నారు.

వైద్యుని సలహా లేకుండా యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ లాంటి ఔషధాలు అనుచితంగా వాడితే రోగ నిరోధక శక్తి తగ్గి మ్యూకోర్ మైకోసిస్ లాంటి రెండో శ్రేణి జబ్బులు కలుగుతాయి. అందువల్ల జ్వరం, జలుబు, దగ్గు లాంటి సమస్యలకు కూడా సొంత వైద్యం చేసుకోకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. కొవిడ్ లక్షణాలు తీవ్రంగా ఉన్న రోగుల్లో 5-23% మందిలో శిలీంద్ర వ్యాధులు కలుగుతున్నట్టుగా, వారిలో 50% మంది మరణిస్తున్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా జరిగిన కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. మ్యూకోర్ మైకోసిస్ సోకి చనిపోయిన వారిలో 31% మంది కొవిడ్ సోకని వారు కూడా ఉన్నారు.

కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో 40 మందికి మ్యూకోర్ మైకోసిస్ సోకినట్టు గుజరాత్ రాష్ట్రంలో సూరత్ నగరంలో గమనించారు. వీరిలో 8 మందికి కంటి చూపు పూర్తిగా పోయింది.

ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్​లో పనిచేసే నిపుణులకు ఈ విషయాలు స్పష్టంగా తెలిసి ఉండాలి. ఈ ప్రమాదం కొవిడ్ లక్షణాలు తగ్గుతూ కోలుకుంటున్న సమయంలో కలుగవచ్చు. స్టెరాయిడ్స్​ను హేతుబద్ధంగా వాడుతూ, రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రించుకుంటూ, ముఖ పరిశుభ్రతను కాపాడుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటేనే మ్యూకోర్ మైకోసిస్​ను నివారించవచ్చు. 0.5% బెటాడిన్ చుక్కలను ముక్కులో వేసుకోవటం, సెలైన్ ఐసోటానిక్ సొల్యూషన్​ను నేసల్ స్ప్రేగా రోజుకు రెండు, మూడు సార్లు వాడుతూ జాగ్రత్తలు తీసుకుంటే ఈ శిలీంధ్ర వ్యాధిని ఆపగలం.

Last Updated : May 11, 2021, 4:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.