ETV Bharat / sukhibhava

దేశంలో కొత్త కరోనా వేరియంట్.. వాటికంటే డేంజర్.. చైనాలో ఇప్పటికే విధ్వంసం..

చైనాలో కరోనా కేసుల సునామీకి కారణమైన ఒమిక్రాన్‌ ఉపరకం కొత్త వేరియంట్‌ బీఎఫ్‌-7 దేశంలోనూ బయటపడింది. ఇప్పటివరకు 4 కేసులు నమోదుకాగా అందులో 3 గుజరాత్‌లోనే బయటపడినట్లు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. ఈ వేరియంట్‌కు రీ-ఇన్‌ఫెక్షన్‌ కలిగించే సామర్థ్యం ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

New variants of corona
కరోనా కొత్త వేరియంట్​
author img

By

Published : Dec 21, 2022, 6:09 PM IST

Updated : Dec 21, 2022, 9:17 PM IST

తొలిసారి కొవిడ్‌ బయటపడిన చైనాలో ఆ మహమ్మారి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. అయితే, అక్కడ వైరస్‌ విజృంభణ ఒమిక్రాన్ ఉపరకం బీఎఫ్-7 కారణమని నిపుణులు తేల్చారు. ఈ వేరియంట్ భారత్‌లోనూ బయటపడింది. తొలి కేసును గుజరాత్ బయో టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అక్టోబర్‌లోనే గుర్తించింది. దేశవ్యాప్తంగా బీఎఫ్‌-7 వేరియంట్ కేసులు ఇప్పటివరకు 4 నమోదైనట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. అందులో 3 గుజరాత్‌లో నమోదుకాగా.. మరో కేసు ఒడిశాలో వెలుగుచూసినట్లు పేర్కొన్నాయి.

కొత్త వేరియంట్‌ బీఎఫ్‌-7 బయటపడినా.. కరోనా కేసుల్లో పెరుగుదల పెద్దగా లేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో నిపుణులు తెలిపారు. అయినప్పటికీ, వ్యాప్తిలో ఉన్నవాటితోపాటు కొత్తగా బయటపడుతున్న వేరియంట్లపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అవసరమని సూచించారు. ఈ నేపథ్యంలోనే జీనోమ్‌ సీక్వెన్సింగ్‌పై దృష్టి పెట్టాలని రాష్ట్రాలకు సూచించినట్లు సమాచారం.

ప్రస్తుతం చైనాలో ఒమిక్రాన్‌ వేరియంట్‌, దాని ఉపరకాల విజృంభణ కొనసాగుతోంది. బీజింగ్‌, మరికొన్ని నగరాల్లో బీఎఫ్‌-7 వేరియంట్‌ ప్రధానంగా వ్యాప్తిలో ఉంది. ఈ వేరియంట్‌ కారణంగానే చైనాలో కొవిడ్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇదివరకు ఇన్‌ఫెక్షన్‌ బారిన పడకపోవడం, వ్యాక్సిన్‌ సమర్థత కారణంగా అక్కడి ప్రజలు తక్కువ రోగనిరోధక శక్తి కలిగి ఉండటం వంటివి చైనాలో వైరస్‌ విస్తృతంగా వ్యాప్తి చెందడానికి కారణంగా తెలుస్తోందని భారత ప్రభుత్వవర్గాలు తెలిపాయి.

ఒమిక్రాన్‌ వేరియంట్‌ బీఏ-5కు చెందిన ఉపరకమే బీఎఫ్‌-7 విస్తృతవేగంతో వ్యాప్తి చెందే ఈ వేరియంట్‌కు బలమైన ఇన్‌ఫెక్షన్‌ కలిగించే సామర్థ్యం కూడా ఉంది. ఈ వేరియంట్‌ ఇంక్యుబేషన్‌ వ్యవధి కూడా చాలా తక్కువ. అంతేకాకుండా రీఇన్‌ఫెక్షన్‌ లేదా వ్యాక్సిన్‌ తీసుకున్న వారికీ కూడా ఇన్‌ఫెక్షన్‌ కలిగించే సామర్థ్యం ఈ వేరియంట్‌కు ఉంది. చైనాలోనే కాకుండా అమెరికా, బ్రిటన్‌తోపాటు బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్‌, డెన్మార్క్‌ వంటి ఐరోపా దేశాల్లోనూ ఈ వేరియంట్‌ ఇప్పటికే వెలుగు చూసింది.

Last Updated : Dec 21, 2022, 9:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.