ETV Bharat / sukhibhava

కొబ్బరి నీళ్లతో ఎండ వేడే కాదు.. అజీర్తి, మలబద్దకం రోగాలు దూరం! - కొబ్బరి నీళ్లు ఉపయోగాలు

వేసవి వచ్చిందంటే చాలు చాలామందికి ఎండల వల్ల తీవ్రంగా దాహం వేస్తుంటుంది. అయితే కొంతమందికి ఎంత నీరు తాగినా లేదంటే వేరే రకరకాల డ్రింకులు తాగినా కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇలాంటి వాళ్లు దాహం తీరడానికి ఏం చేయాలో తెలుసుకుందాం.

coconut water benefits
coconut water benefits
author img

By

Published : Apr 11, 2023, 9:04 AM IST

వేసవి అనగానే అందరికీ గుర్తుకొచ్చేది పండ్లే. ముఖ్యంగా ఈ సీజన్లో మామిడి పండ్లు తినడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. మామిడి తర్వాత అందరికీ గుర్తొచ్చేది కొబ్బరి నీళ్లే. తియ్యని, చల్లని కొబ్బరి నీళ్లంటే అందరికీ ఇష్టమే. వేసవిలో ఇవి మరింత ప్రీతికరంగా అనిపిస్తాయి. కొబ్బరినీళ్లు మన దాహాన్ని తీర్చడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అలాంటి కొబ్బరి నీళ్లలో ఉండే పోషకాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

కొబ్బరి నీళ్లు అలసటను, నీరసాన్ని తగ్గిస్తాయి. వీటిని తాగడం వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది. అలాంటి కొబ్బరి నీళ్లలో కార్బొహైడ్రేడ్లతో పాటు మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం లాంటి ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. ఖనిజ లోపం ఉన్నవారు కొబ్బరి నీళ్లను తాగితే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి. కండరాలు సవ్యంగా పనిచేసేందుకు పొటాషియం అవసరం. కాల్షియం విషయానికొస్తే.. మనలో చాలా మంది శరీరానికి అవసరమైన కాల్షియం తీసుకోవడం లేదు. దీని వల్ల ఎముకలు బలహీనమవుతాయి.

కొబ్బరి నీటిలో అధిక స్థాయిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం మన ఆరోగ్యానికి చాలా అవసరం. శరీరంలో ప్రొటీన్లు తయారు కావాలన్నా, రక్తపోటు స్థాయులు, రక్తంలో చక్కెర నియంత్రణలో ఉండాలన్నా.. కండరాలు, నరాలు చక్కగా పనిచేయాలన్నా కూడా మెగ్నీషియం చాలా అవసరం అనే చెప్పాలి. ఖనిజ లోపం ఉన్నవారికి కొబ్బరి నీళ్లు ఔషధం లాంటిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

"వేసవిలో ఎక్కువగా దాహం వేస్తుంది. ఏదైనా తియ్యటి డ్రింక్ తాగాలని అనిపిస్తుంది. అయితే ఏ డ్రింక్స్, నీళ్లు ఏది తాగినా దాహం మాత్రం తీరదు. అలాంటప్పుడు కొబ్బరి నీళ్లు మంచి ఎంపికనే చెప్పాలి. వేసవి కాలం అనే కాదు.. ఎప్పుడైనా వీటిని తీసుకోవచ్చు. కొబ్బరి నీళ్లు తాగితే వేడి చేస్తుందేమోనని కొందరు జంకుతుంటారు. అలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొబ్బరి నీళ్లు ఎప్పుడైనా తాగొచ్చు. అయితే లేత కొబ్బరికాయలోని నీళ్లు తాగితే మంచిది. ఇవి అంత తీపిగా ఉండవు. వీటిల్లో కొవ్వు శాతం కూడా తక్కువగా ఉంటుంది. తరచూ ఒక గ్లాస్ కొబ్బరి నీళ్లు తాగితే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి"

-- మైలవరపు గౌరీ ప్రియ, డైటీషియన్

ఎక్కువగా శారీరక శ్రమ చేసేవారు, ఆటలు ఆడే అథ్లెట్లు, జిమ్​లో చెమట చిందించేవారు కొబ్బరి నీళ్లు తాగడం మంచిదని గౌరీ ప్రియ సూచించారు. అధిక శారీరక శ్రమ వల్ల శరీరంలో పొటాషియం, సోడియం అన్నీ పోతుంటాయని.. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల వీటిని మళ్లీ భర్తీ చేసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. ఎప్పుడైనా అజీర్తి, మలబద్దకం సమస్యలు తలెత్తినా కొబ్బరి నీళ్లు తాగడం ఎంతో ఉపయోగపడుతుందని గౌరీ ప్రియ వివరించారు.

రోజుకో గ్లాస్ తీసుకుంటే చాలు
"కొబ్బరి నీళ్లు చర్మ ఆరోగ్యానికి మంచివి. నీళ్లు ఎక్కువగా తాగనివారు, బయట అధికంగా భోజనం చేసేవారు, ప్యాకేజ్డ్ ఫుడ్ తినేవారికి ముఖంపై మొటిమలు వస్తుండడాన్ని చూడొచ్చు. ఈ సమస్య తగ్గడానికి కొబ్బరి నీళ్లు బాగా దోహదపడతాయి. శరీరాన్ని కొబ్బరి నీళ్లు శుద్ధి చేస్తాయి. రోజువారీగా కొబ్బరి నీళ్లు తీసుకోవడం చాలా అవసరం. వేడి చేసినప్పుడల్లా ఒక గ్లాస్ కొబ్బరి నీళ్లు తీసుకుంటే సరిపోతుంది. సమయం ప్రకారం కొబ్బరి నీళ్లు తీసుకుంటే శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి" అని డైటీషియన్ మైలవరపు గౌరీ ప్రియ సూచించారు.

క్రీడాకారులకు కలిగే ప్రయోజనాలెన్నో..
విరేచనాలు లేదా డీహైడ్రేషన్​కు గురైనప్పుడు కొబ్బరి నీళ్లను వాడుతుంటారు. వీటిల్లో పొటాషియం ఎక్కువ స్థాయిలో ఉండటం వల్ల అధిక రక్తపోటు సమస్యలు ఉన్నవారికి కూడా మేలు చేస్తాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల క్రీడాకారులు తమ శారీరక సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవచ్చు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా అని.. కొబ్బరి నీళ్లను ఎక్కువగా తీసుకోవద్దు. ముఖ్యంగా పొటాషియం, కాల్షియం స్థాయులు తక్కువగా ఉండి, క్యాలరీలు తక్కువ తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నవారు కొబ్బరి నీళ్లను అధికంగా తాగడం మంచిది కాదు.

అలాంటి వాళ్లు తాగకూడదు
సాధారణంగా రక్తంలో పొటాషియం స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు అది మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. అయితే మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే ఈ పని సవ్యంగా జరగదు. అందుకే మూత్రపిండాల సమస్య ఉన్నవారు వైద్యుల సలహా లేకుండా కొబ్బరి నీళ్లను తాగకూడదు. ఇకపోతే.. గర్భిణులు, పాలిచ్చే తల్లులు వీటిని తాగొచ్చా అనే విషయంలో సరైన సమాచారం అందుబాటులో లేదు. కాబట్టి ఆ స్థితిలో ఉన్న మహిళలు కొబ్బరి నీళ్లను వైద్యుల సలహా తీసుకోకుండా తాగడం మంచిది కాదు. అలాగే ఇవి సురక్షితమే అయినా.. అనారోగ్యంతో బాధపడే పిల్లలకు వీటిని తాగించాలని అనుకుంటే ముందుగా వైద్యుల సలహాలు తీసుకోండి.

కొబ్బరి నీళ్లు తాగితే ఎంతో మేలు.. ఎండ వేడే కాదు.. రోగాలు దూరం

ఇవీ చదవండి : ప్రెగ్నెన్సీని ఏ తేదీ నుంచి లెక్కించాలి? డాక్టర్లు ఏమంటున్నారు?

ఎంత ట్రై చేసినా నిద్ర పట్టడం లేదా? ఇలా చేస్తే సెట్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.