ETV Bharat / sukhibhava

Childhood Obesity: చిన్న పిల్లల్లో స్థూలకాయం- కారణాలు ఇవే! - చిన్నపిల్లలో స్థూలకాయానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఊబకాయం లేదా అధిక బరువు (Childhood Obesity) అనేది చాలామందిని పట్టిపీడిస్తున్న సమస్య. పిల్లల్లో ఇది మరింత ఆందోళన కలిగిస్తుంది. బడి పిల్లల్లో ఎక్కువమంది నమ్మలేని రీతిలో ఊబకాయ సమస్యతో బాధపడుతున్నారు. చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లల్లో పెరుగుతున్న కొవ్వు గురించి ఆందోళన చెందుతున్నారు. శరీరంలో అవసరానికి మంచి కొవ్వు చేరి.. ఆరోగ్యానికి చెడు చేసే ఈ సమస్య గురించి, దాని పర్యావసానాలు, చికిత్సా విధానం గురించి, నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించే ఈ స్టోరీ.

Childhood Obesity
చిన్న పిల్లల్లో స్థూలకాయం
author img

By

Published : Sep 29, 2021, 1:30 PM IST

బరువు ఎక్కువ ఉన్నంత మాత్రాన ఊబకాయం ఉన్నట్లు కాదు. వారి ఎత్తును బట్టి బరువు ఎంత ఉండాలో ఓ లెక్క ఉంది. అంతకుమించినప్పుడు మాత్రమే.. ఊబకాయం (Childhood Obesity) అని అంటారు. చిన్నపిల్లల్లో వచ్చే స్థూలకాయం ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది. ఇలాంటి వారు పెరిగి పెద్దయ్యాక కూడా ఇదే సమస్యతో బాధపడడం, పదిమంది మధ్య ఆత్మనూన్యతతో బతకాల్సి రావడం ఇబ్బందికర పరిస్థితికి దారి తీస్తుంది. అందుకే ఈ సమస్య గురించి వివరంగా తెలుసుకుందాం.

స్థూలకాయం లేదా ఊబకాయం (Childhood Obesity).. శరీరంలో అవసరానికి మంచి కొవ్వు చేరి ఆరోగ్యానికి చెడు చేసే ఓ వ్యాధి. ఒక వ్యక్తి తన ఎత్తుకు ఎంత బరువు ఉండాలన్నది బాడీ మాస్​ ఇండెక్స్​ లేదా బీఎంఐ (Body Mass Index Obesity) సూచిస్తుంది. ఏ వ్యక్తికైనా చదరపు మీటర్​కు 30 కిలోలు ఉండే స్థూలకాయంగా లెక్కిస్తారు. కొంతమంది పిల్లల శరీర నిర్మాణం సగటు కంటే పెద్దదిగా ఉంటుంది. చిన్నప్పుడు పిల్లలు బొద్దుగా ఉండడం సహజం. పెరిగే కొద్ది మరింతగా పెరుగుతుండడం ఊబయకాయానికి గుర్తు. బరువు ఎత్తుకు సంబంధించిన పట్టిక చూసి డాక్టర్​లు స్థూలకాయాన్ని నిర్ధరణ చేస్తారు. కుటుంబంలో ఎవరికైనా ఊబకాయం ఉందా? లేదా? బరువు- ఎత్తు నిష్పత్తిలో స్థానం ఎక్కడుంది? పెరుగుదల క్రమం ఎలా ఉంది అనే అంశాలను బట్టి ఎలాంటి చికిత్స అవసరం అనేది నిర్ణయిస్తారు. దీని వల్ల గుండె వ్యాధులు, డయాబెటిస్​, నిద్రలో సరిగా ఊపిరి తీసుకోకపోవడం, గురక పెట్టడం, కీళ్ల వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్​ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

స్థూలకాయం ఉన్న పిల్లల శరీరాలు అలసటకు గురి కావడం తల్లిదండ్రులను ఆందోళన కలిగిస్తుంది. మార్కెట్​లో లభిస్తున్న వివిధ రకాల ఆయిల్​ ఫుడ్స్, తినుబండారాలు తీసుకోవడం వల్ల పిల్లల్లో ఎక్కువగా స్థూలకాయ సమస్య ఉత్పన్నం అవుతుంది.

కారణాలు..

  • ఆహార నియంత్రణ లేకపోవడం. సరైన ఆహారం, సమతుల్య ఆహారం లేకపోవడం అనేది ప్రధాన కారణం.
  • సరిగా నిద్రలేక పోవడం కూడా ఊబకాయానికి దారి తీస్తుంది.
  • శారీరక వ్యాయామం లేకపోవడం.
  • శరీరంలో హార్మోన్ల సమస్య ఉండటం.
  • జన్యుపరంగా కూడా ఊబకాయ వచ్చే అవకాశం ఉంది.
  • ఎక్కువ క్యాలరీలు ఉండే జంక్​ఫుడ్​ తీసుకోవడం. శీతల పానీయాలు ఎక్కువగా తాగడం వల్ల బీపీ, సుగర్​, కొలెస్ట్రాల్ పెరగడం, పొత్తి కడుపులో కొవ్వు పేరుకుపోవడం జరుగుతుంది. ఆస్తమా, నిద్రస మస్యలు రావడానికి అవకాశం ఉంది. మనసికంగా ఎక్కువ సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది.

ఇవ్వాల్సిన ఆహారం..

  • డ్రైఫ్రూట్స్​
  • పాలు
  • పాల ఉత్పత్తులు
  • సలాడ్లు
  • పండ్లు
  • స్వీట్లు తినడం తగ్గించాలి
  • నీరు ఎక్కువగా తాగాలి

మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ కింద ఉన్న వీడియోను పూర్తిగా చూడండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: Weight Gain Tips: బరువు పెరగాలా?- ఇలా చేయండి మరి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.