ETV Bharat / sukhibhava

ఈ గజ్జితో భరించలేని అవస్థ - మీరు బాధితులా? - ఈ పనులు చేయాల్సిందే! - Best Ways to Prevent Eczema

Best Ways to Prevent Eczema : చాలా మందిని కాలంతో సంబంధం లేకుండా ఎగ్జిమా అనే చర్మ సంబంధిత వ్యాధి వెంటాడుతూ ఉంటుంది. వాడుక భాషలో దీన్ని ఎండుగజ్జి అని పిలుస్తారు. దీనికి తగిన చికిత్స తీసుకోకపోతే.. ఇతరత్రా సమస్యలు చుట్టు ముడతాయి. మరి దీన్ని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడూ చూద్దాం.

Eczema
Best Ways to Prevent Eczema
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 13, 2023, 3:45 PM IST

Best Ways to Prevent Eczema in Telugu : చర్మ వ్యాధులు సీజన్​ సంబంధం లేకుండా ఇబ్బంది పెడుతుంటాయి. చలికాలంలో వాటి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఎండు గజ్జి(ఎగ్జిమా) లాంటి చర్మ సమస్యలు వస్తే.. ఒకపట్టాన తగ్గవు. తీవ్రమైన దురదతో వేధిస్తుంది. విపరీతంగా గోకటం వల్ల ఇన్​ఫెక్షన్ ఇతర భాగాలకు విస్తరిస్తుంది. కాబట్టి.. ఎగ్జిమా(Eczema) వచ్చినప్పుడు అలస్యం చేయకుండా.. చర్మం (Skin Care) అడ్డుకోవడం ముఖ్యం. మరి.. దీన్ని ఎలా ఎదుర్కోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

గోకకుండా ఉండేందుకు ట్రై చేయాలి : ఎగ్జిమా వంటి చర్మ సమస్యలతో దురద ఎక్కువగా ఉంటుంది. కానీ.. వీలైనంత వరకు గోకకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. గోళ్లతో గోకటానికి బదులు.. వేలి చివర్లతో మృదువుగా రుద్దొచ్చు. మరో ట్రిక్ ఏమంటే.. గజ్జి ఉన్న ప్రాంతాన్ని పదే పదే చూడొద్దు. దీనివల్ల ఆలోచన అటువైపు మళ్లి.. గోకాలనే ఆలోచన వస్తుంది.

చర్మం తేమగా : చర్మం దెబ్బతింటే.. ఆ ప్రాంతం తేమను సరిగా క్యాచ్​ చేయలేదు. కాబట్టి.. అక్కడ రోజులో చాలాసార్లు మందంగా మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. అలా చేయడం ద్వారా అది తేమను పట్టి ఉంచుతుంది. దాంతో దురద భావన తగ్గి హాయిగా ఉంటుంది. ఇందుకోసం మినరల్‌ నూనె, పెట్రోలియం జెల్లీ వంటివి వాడొచ్చు. అయితే వీటిల్లో స్కిన్​కు సరిపోయేవి ఎంచుకోవాలి.

ఓట్స్‌ నీటితో స్నానం : మీరు ఓట్స్‌ అటుకులను మెత్తగా పొడి చేసి, గోరు వెచ్చటి నీటిలో కలిపి 10 నిమిషాల తర్వాత స్నానం చేయటం మంచిది. ఎందుకంటే ఓట్స్‌లోని ప్రత్యేక రసాయన మిశ్రమాలు చర్మం పైపొరను బలోపేతం చేస్తాయి. అలాగే బాత్ చేశాక తువ్వాలుతో అద్దుకొని, చర్మం పొడిగా ఉండేలా చేసుకోవాలి. ఆ తర్వాత వెంటనే మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి.

అలర్జీ మందులు : ఎగ్జిమా వల్ల కలిగే దురద మరీ ఎక్కువగా ఉంటే సిట్రిజిన్‌, ఫెక్సోఫెనడైన్‌ వంటి యాంటీహిస్టమిన్‌ మాత్రలు యూజ్ చేయవచ్చు. ఇవి దురద నుంచి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తాయి. అయితే డైఫెనీడ్రమైన్‌ మందు మాత్రం నిద్రమత్తు కలిగిస్తుంది. కాబట్టి ఇలాంటి వాటిని పడుకునేటప్పుడే వేసుకోవాలి. అయితే.. వైద్యుడి సూచన మేరకు మందులు తీసుకోవాలి.

మాయిశ్చరైజర్​తో చర్మం జిడ్డుగా మారుతోందా?.. ఈ నిపుణుల సలహాలు మీకోసమే!

చర్మ సంరక్షణతోనూ ఉపశమనం :

  • ఎండు గజ్జి నుంచి ఉపశమనం పొందటానికి రోజువారీ చర్మ సంరక్షణ పద్ధతులూ తోడ్పడతాయి. అలాగే స్కిన్ మరింత దెబ్బతినకుండా కాపాడతాయి.
  • కఠినమైన, మరీ ఘాటు వాసనలతో కూడిన సబ్బుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవి చర్మం నుంచి సహజ నూనెలను ఎక్కువగా తొలగిస్తాయి. అదేవిధంగా వీటిల్లోని రంగులు, వాసనలు, సుగంధ ద్రవ్యాలు.. లాంటివి దురద, అలర్జీకి కారణం కావొచ్చు. కాబట్టి మృదువైన సబ్బులు స్నానానికి వాడుకోవాలి.
  • ధరించే దుస్తువుల విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా బిగుతైనవి, గరుకుగా ఉండే ఉన్ని దుస్తులకు దూరంగా ఉండడం మేలు. ఇవి చర్మానికి చికాకు కలిగిస్తాయి. అందుకే వదులైన దుస్తులు, మెత్తటి, నూలు వేసుకోవడం ఉత్తమం.
  • ఇక గజ్జి ఉన్నవారికి చెమట మరిన్ని చిక్కులు తెచ్చిపెడుతుంది. కాబట్టి గదిలో ఫ్యాన్‌, ఏసీ వేసుకోవాలి. గాలి ఆడే దుస్తులు ధరించాలి.
  • వేడి, పొడి గాలి చర్మం నుంచి తేమను లాగేసి.. దురద పుట్టేలా చేస్తుంది. అందువల్ల వీలైతే ఇంట్లో హ్యూమిడిఫయర్‌ పరికరం అమర్చుకోవాలి. ఇది నీటి ఆవిరిని గాలిలోకి వెదజల్లి.. చర్మ సంరక్షణకు తోడ్పడుతుంది.
  • ఎండుగజ్జితో బాధపడే వారు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటమూ ముఖ్యమే. ఎందుకంటే ప్రతికూల ఆలోచనలు ఉంటే గజ్జి ఉద్ధృతమయ్యేలా చేస్తాయి. కాబట్టి యోగా, ప్రాణాయామం వంటి పద్ధతులతో మనసు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే మానసిక నిపుణుల సాయమూ తీసుకోవాలి.
  • ఇక చివరగా ఆహారంలో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేసే ప్రొబయాటిక్స్‌ను చేర్చుకోవటమూ ఉపయోగపడుతుంది. ఇవి గజ్జి అదుపులో ఉండటానికి, లక్షణాలు తగ్గటానికి తోడ్పడుతున్నట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
  • అదేవిధంగా ప్రొబయాటిక్స్‌ రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజితం చేస్తాయి. అలర్జీలను నియంత్రిస్తాయి. మనం రోజూ వాడే పెరుగు, మజ్జిగ ప్రొబయాటిక్స్‌గా బాగా ఉపయోగపడతాయి. ఇవి మంచి బ్యాక్టీరియా వృద్ధికి ఎంతగానో తోడ్పడతాయి.

NOTE : పరిస్థితి ఇబ్బందిగా ఉండే.. డాక్టర్​ను కలిసి చికిత్స తీసుకోవాలి.

కామెర్లు ఉన్నవారితో సెక్స్ ప్రమాదకరమా?

పేరెంట్స్‌లో అలర్జీలుంటే అవి పుట్టే పిల్లలకు వస్తాయా?

శీతాకాలంలో చర్మ సంరక్షణకు వంటింటి చిట్కాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.