ETV Bharat / sukhibhava

జర్నీలో వాంతులు అవుతున్నాయా? - ఈ టిప్స్​తో ఈజీగా చెక్ పెట్టండి! - జర్నీలో వాంతులయితే బెస్ట్ టిప్స్

Best Tips to Avoid Motion Sickness : కొంతమందికి ప్రయాణాలు అంటే భయం.. కారణం జర్నీ సమయంలో వాంతులు, వికారం తీవ్రంగా ఇబ్బంది పెట్టడమే. అలాంటి వారు ఈ నాలుగు టిప్స్ ఫాలో అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా జర్నీ చేయవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Vomiting
Vomiting
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 8, 2023, 9:51 AM IST

Best Tips to Avoid Vomiting While Travelling : ప్రతి ఒక్కరూ తమ అవసరాల రీత్యా ఎప్పుడో ఒకప్పుడు జర్నీ చేసే ఉంటారు. అయితే కొందరికీ ప్రయాణాలు అంటే చాలా ఇష్టం ఉంటుంది. కానీ, మరికొందరికీ జర్నీ(Journey) అంటే చాలు తెలియని భయం వెంటాడుతుంది. ఇక బస్సు, కారులో ప్రయాణమంటే చాలు ఎక్కువ ఆందోళన చెందుతారు. అందుకు ప్రధాన కారణం.. ప్రయాణం చేసేటప్పుడు ఎక్కడ వికారం కలిగి 'వాంతులు' అవుతాయోనని భయం. దీంతో వారు పెద్దగా జర్నీ చేయడానికి ఇష్టపడరు. ఇక కొందరిలో అయితే ప్రయాణం స్టార్ట్ కాగానే వాంతుల సమస్య మొదలవుతుంది.

Best Tips to Prevent Motion Sickness : మరికొందరిలో మాత్రం ఆ వాహనం కండీషన్ బట్టి ఉంటుంది. వాహనంలో ప్రయాణించే వ్యక్తులకు అందులో వాసన వచ్చినసరే.. వికారంగా ఉంటుంది. అలాగే ఘాట్​రోడ్లు, ఎక్కువసేపు ప్రయాణం, ఎగుడుదిగుడు రోడ్లు వల్ల వాంతులు అనేవి సంభవిస్తాయి. ఈ సమస్య బస్సు, కారులోనే కాదు.. కొందరికీ రైళ్లు, విమానం ఎక్కినా కూడా ఉంటుంది. అలాంటివారు ప్రయాణం చేసేటప్పుడు ఈ నాలుగు టిప్స్ ఫాలో అయ్యారంటే చాలు. ఇకపై ఎలాంటి భయం లేకుండా హ్యాపీగా తమ జర్నీని కొనసాగించవచ్చు. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

సరైన సీటును ఎంచుకోవాలి : మనం వాహనంలో కూర్చునే చోటుతోనూ వాంతి భావన కలగొచ్చు. కాబట్టి సరైన సీటును ఎంచుకోవడం ముఖ్యం. కారులో ప్రయాణిస్తున్నట్లయితే.. ముందు సీటులో కంటే వెనక కూర్చుంటే వాంతులు అయ్యే అవకాశమెక్కువ. కాబట్టి ఫ్రంట్ సీటు బెటర్. ఇకపోతే బస్సులోనూ వీలైనంతవరకు ముందు వరుసలో కూర్చోవటం మంచిది. రైలులోనైతే రైలు కదిలే దిశవైపు ముఖం పెట్టి కూర్చోవాలి. కిటికీ పక్కన కూర్చుంటే ఉత్తమం. విమానంలో అయితే రెక్కల మీద సీటు ఎంచుకోవడం బెటర్. ఇలా సరైన సీటును సెలెక్ట్ చేసుకోవడం ద్వారా వాంతుల సమస్య తగ్గించుకోవచ్చు.

సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి : జర్నీలో వాంతులు కాకుండా ఉండడానికి మరో చిట్కా ఏంటంటే.. సరైన వెంటిలేషన్. ఎందుకంటే వాహనం లోపల మంచి వెంటిలేషన్ ఉంటే ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తే వెళ్లి పోయేలా.. తగినంత గాలి తగిలేలా ఉంటుంది. అలాగే బయట వాతావరణాన్ని వీక్షిస్తూ ఆ భావన నుంచి బయటపడవచ్చు. తగినంత గాలి కోసం కారులో ఏసీ వాడుకోవచ్చు. రైలులో, బస్సులో అయితే కిటికీ నుంచి వచ్చే గాలి ముఖానికి తగిలేలా చూసుకోవాలి.

దూర ప్రయాణం చేస్తున్నారా? అయితే ఇవి పాటించండి..

కడుపు నిండా తినొద్దు : ప్రయాణానికి ముందు కడుపు నిండా తినొద్దు. కావాలంటే మామూలు ఆహారం కొద్దిగా తినొచ్చు. ప్రయాణానికి ముందు, ప్రయాణం చేసేటప్పుడు వేపుళ్లు, మసాలా, నూనె పదార్థాలు, పుల్లటి పదార్థాల జోలికి వెళ్లొద్దు. ఇవి జీర్ణాశయంలో ఆమ్లాన్ని పెంచి వాంతి భావన కలిగిస్తాయి. ఒంట్లో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. తగినంత నీరు తాగాలి. అలాగే కొన్ని అల్లం క్యాండీలు లేదా స్నాక్స్ ప్యాక్ చేసుకోండి. ఎందుకంటే అల్లంలో వికారం తగ్గించే లక్షణాలు ఉన్నాయి. ప్రయాణంలో రుచికరమైన, సహజమైన నివారణగా ఉంటుంది.

విరామం తీసుకోండి : సుదూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో మధ్యమధ్యలో కాస్తా గ్యాప్​ తీసుకోవాలి. కారులో ప్రయాణిస్తున్నప్పుడు.. మధ్యమధ్యలో విరామం తీసుకోవాలి. అవసరమైతే కిందికి దిగి కాసేపు నడవండి. తాజా గాలి పీల్చుకోండి. మీ శరీరాన్ని రీకాలిబ్రేట్ చేయండి. అలాగే సంగీతం వినటం వల్ల కొంత మానసిక ప్రశాంతత చేకూరుతుంది. దాంతో వాంతి భావన రాదు. కొందరికి పడుకుంటే ఈ భావన కలగదు. అలాంటి వారు వీలుంటే నిద్ర పోవడానికి ట్రై చేయండి. ఇలా పైన పేర్కొన్న చిట్కాలు మీరు గుర్తుంచుకున్నారంటే ఎలాంటి భయం లేకుండా హాయిగా మీ జర్నీని కొనసాగించొచ్చు.

Ayurvedic Items must have in travelling : మీరు జర్నీ చేయబోతున్నారా..? ఇవి వెంట తీసుకెళ్లడం మరిచిపోవద్దు!

What to Do If You Lost your Passport in Abroad : విదేశీ ప్రయాణంలో మీ పాస్​పోర్ట్ పోతే..? ఏం చేయాలి..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.