ETV Bharat / sukhibhava

కూరలో కారం, ఉప్పు ఎక్కువైతే మీరేం చేస్తారు? - ఇలా ఈజీగా లెవల్ చేయొచ్చు! - Easy Ways to fix Extra Salts in Curries

Tips to Reduce Spice and Salt in Curries : ఊహించని విధంగా ఒక్కోసారి కూరలో.. కారం, మసాలా, ఉప్పులో ఏదోఒకటి ఎక్కువవుతుంది. దీంతో.. కాస్త తగ్గితే బాగుండు అని ఫీలవుతారు. మరి.. వాటిని ఎలా తగ్గించాలో మీకు తెలుసా?

Tips to Reduce Spice in Curries
Tips to Reduce Spice in Curries
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 8, 2023, 6:48 PM IST

Best Tips to Reduce Spice in Curries : ఎంతో ఇష్టపడి వండుకున్న కూరల్లో ఒక్కోసారి కారం, ఉప్పు, మసాలా ఎక్కువ అవుతూ ఉంటాయి. దీంతో.. అప్​సెట్ అవుతూ ఉంటారు. కష్టపడి ప్రిపేర్ చేసుకున్న కర్రీని(Curry) పారేయాలంటే మనసొప్పదు. అలాగని దాన్ని ఆస్వాదించలేరు. ఇలాంటి సందర్భం ప్రతి ఒక్కరికీ ఎప్పుడో అప్పుడు ఎదురయ్యే ఉంటుంది. ఇకపై ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. ఈ టిప్స్ పాటించండి.

పెరుగుతో.. కూరలో కారం ఎక్కువైనప్పుడు పెరుగు వేస్తే.. అది కారాన్ని సమతుల్యం చేస్తుంది. అంతేకాదు.. మంచి టేస్టీ గ్రేవీని అందిస్తుంది. కేవలం పెరుగునే కాకుండా.. క్రీమ్ కూడా కర్రీస్​లో వేయొచ్చు. ఇది అధికంగా పడిన మసాల, ఉప్పు, కారాన్ని ఈజీగా లెవల్ చేస్తుంది.

బంగాళాదుంపలతో.. కర్రీలో ఉప్పు, కారం, మసాలా.. వీటిల్లో ఏది ఎక్కువైనా అందులో ఆలుగడ్డలు వేయొచ్చు. ఈ చిట్కా పూర్వం నుంచి ఆచరిస్తున్నదే. కానీ.. ఎక్కువమందికి ఇది తెలిసిఉండకపోవచ్చు. కాబట్టి ఈసారి ఎప్పుడై మీ కూరలో కారం లేదా ఉప్పు ఎక్కువైతే.. ఆలుగడ్డను కట్​ చేసి అందులో వేసి కాసేపు ఉడికించండి. అంతే రుచికరమైన కర్రీ రెడీ.

How to Prepare Mutton Curry : సండే పండగ.. అద్దిరిపోయే మటన్ కర్రీ.. ఇలా చేయండి!

కెచప్​తో.. సాధారణంగా టొమాటో కెచప్ అనేది​ తీపి రుచిని కలిగి ఉంటుంది. మనం వివిధ స్నాక్స్​తో కలిపి దీనిని తీసుకుంటూ ఉంటాం. అయితే ఎవరికీ తెలియని ట్రిక్​ ఏంటంటే.. ఈ కెచప్​తో కర్రీలో కారం తగ్గించుకోవచ్చు. అలాగే ఇది కర్రీకి మంచి రుచి​ని అందిస్తుంది.

నిమ్మకాయతో.. కారం, ఉప్పు, మసాలాలు ఇలా ఏది ఎక్కువైనా దానిని తగ్గించి తినే ఆహారానికి మరింత రుచిని అందించడంలో నిమ్మకాయది ముఖ్యమైనపాత్ర. అయితే మీరు కర్రీ వండుతున్నప్పుడు కారం ఎక్కువగా అనిపిస్తే.. అందులో కాస్త నిమ్మరసాన్ని కలపండి. ఆ టైమ్​కి నిమ్మకాయలు ఇంట్లో లేకుంటే వెనిగర్​ లేదా తరిగిన టమోటాలు వేయడం ద్వారా కూడా కారాన్ని తగ్గించుకోవచ్చు.

ఎందుకంటే.. ఇవి పూర్తిగా సిట్రస్ లక్షణాలతో నిండి ఉంటాయి. దీని వలన కర్రీలోని అదనపు కారం, మసాలాలను తగ్గిస్తాయి. చాలా మంది నాన్​వెజ్, స్పైసీ ఫుడ్ తింటున్నప్పుడు కచ్చితంగా నిమ్మరసాన్ని పిండుకుంటారు. ఇది టేస్ట్​తో పాటు అధిక మసాలాల వల్ల కలిగే అనారోగ్య సమస్యలను నిరోధిస్తుంది.

ఇతర కూరగాయలు వేయండి.. మీ కూరలో కారం ఎక్కువైనప్పుడు ఇంట్లో ఉండే కొన్ని కూరగాయలను కట్ చేసి అందులో వేయండి. అవి కూడా కారాన్ని, ఉప్పుని కంట్రోల్ చేస్తాయి. అయితే.. పొట్లకాయ, కాకరకాయ వంటి కూరగాయాలను మాత్రం వేయకుండా ఉంటేనే బెటర్.

Sunday Special Non Veg Curries : సండే స్పెషల్.. నాటుకోడి కూర.. బోటీ మసాలా ఫ్రై.. ఇలా చేశారంటే.. బొక్కకూడా వదలరు

How to Prepare Palak Prawns Curry : 'పాలక్ ప్రాన్స్ కర్రీ..' నోరూరిపోవాల్సిందే!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.