ETV Bharat / sukhibhava

మహిళలు రోజూ డ్రైఫ్రూట్స్ తింటే ఆ సామర్థ్యం డబుల్!

author img

By

Published : Apr 6, 2022, 5:25 PM IST

Women diet plan: చక్కటి నాజూకైన శరీరం, అందమైన చర్మం, మెరిసే జుట్టుతో మహిళలు అందంగా కనిపించాలంటే ఆహారపు అలవాట్లే ప్రధాన కారణమవుతాయి. కేలరీలు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉండే మంచి ఆహారం తీసుకుంటే ఎక్కువ కాలం యంగ్‌ లుక్‌తో కనిపించవచ్చు.

Best foods for Women
డ్రైఫ్రూట్స్​తో గర్భం

Women diet plan: మహిళలు ఆరోగ్యంగా, శక్తిమంతంగా మారాలంటే బలవర్థక ఆహారం తినాలి. సూపర్‌ ఉమన్​గా మారాలంటే ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలి. బలవర్ధక ఆహార పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం.

  • మీగడ లేని పెరుగు: శరీరానికి మేలు చేసే ప్రోబ్యాక్టీరియాతో పాటు క్యాల్షియం ఎక్కువగా ఉండే మీగడ లేని పెరుగు ఎంతో శ్రేష్ఠం. ఎముకల సామర్థం ఉంటేనే అన్ని పనులూ సమర్థంగా చేసుకోగలుగుతారు. రోజూ పెరుగు తీసుకోవటం మహిళలకు మంచిదే!
  • చేపలు: చేపలలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు శరీరంలోని ప్రతి అణువుకూ ఆరోగ్యాన్నిస్తాయి. గుండె జబ్బులు, హైపర టెన్షన్, మానసిక్త ఒత్తిడి, కీళ్లనొప్పులు వంటివి చేపలలో ఉండే ప్రొటీన్ల వల్ల తగ్గుతాయి. ఈ ఫ్యాటీ ఆమ్లాలుండే వాల్‌నట్స్, అవిసెగింజలు కూడా తీసుకుంటే మరింత మంచిది.
  • టమాట: టమాటలో లైకోపిన్ అనే పోషకం పుష్కలంగా ఉంటుంది. సి విటమిన్‌ కూడా సమృద్ధిగా ఉంటుంది. టమాట తీసుకోవటం వలన రొమ్ము క్యాన్సర్ వంటి వ్యాధులను కొంతవరకు నిరోధించవచ్చని ఆహారనిపుణులు చెపుతున్నారు.
  • ఆకు కూరలు: ముదురు ఆకు పచ్చ రంగులోని ఆక్కకూరల్లో విటమిన్ ఎ, సి సమృద్ధిగా ఉంటాయి. అలగే క్యాల్షియం కూడా. ఇవి కంటికి, ఎముకల బలానికి, జీర్ణక్రియకు సాయపడతాయి.
  • ఎండు ఫలాలు: రోజూ గుప్పెడు ఎండు ఫలాలు తింటే ఆరోగ్యం బాగుంటుంది. డ్రైఫ్రూట్స్ ఆకలిని నియంత్రించడమే కాకుండా తీపి తినాలనే ఆలోచననూ తగ్గిస్తాయి. వీటిలోని ఫైటో ఈస్ట్రోజెన్స్​ హార్మోన్ల సమతుల్యానికి సహకరిస్తాయి. మహిళల్లో పునరుత్పత్తి సామర్థ్యాన్నిపెంచుతాయి. ఎండిన ఖర్జూర, ఆప్రికాట్స్, నేరేడు పళ్లలో ఫైటో ఈస్ట్రోజెన్ అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని తప్పక తీసుకోవాలి.

మహిళలు శారీరకంగా బలహీనంగా ఉంటే రంగు, రూపు, అన్నీ ఉన్నా కుటుంబాన్ని సరైన దారిలో నడిపించగల శక్తిసామర్థ్యాలు ఉండవు. అందుకే అధిక బరువు తగ్గాలనుకున్నా, మెదడును చురుకుగా ఉంచాలన్నా మంచి ఆహారపు అలవాట్లు ఉండి తీరాల్సిందే!

ఇదీ చూడండి: నిగనిగలాడే చర్మంకోసం పాలపొడితో ప్రత్యేక ప్యాక్..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.