ETV Bharat / sukhibhava

కాల్షియం లోపమా? ట్యాబ్లెట్స్ కన్నా ఈ ఫుడ్ తినడం​ చాలా బెటర్​!

Best Calcium Foods For Bones : వయసు, ఆరోగ్య పరిస్థితులరీత్యా చాలా మంది ఎముకల దృఢత్వం కోసం కాల్షియం ట్యాబ్లెట్లను వాడుతుంటారు. అయితే కాల్షియాన్ని పెంచుకోవడం కోసం ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదమా? కాల్షియం అధికంగా లభించే ఆహార పదార్థాలేంటి? ఓ సారి తెలుసుకుందాం.

best calcium foods for bones
best calcium foods for bones
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 24, 2023, 10:23 AM IST

Best Calcium Foods For Bones : శరీరానికి అన్ని రకాల పోషకాలు అందితేనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుంది. అయితే వాటిలో కూడా కొన్ని పోషకాలు మరీ ముఖ్యంగా అవసరం అవుతాయి. మనకు సాధారణంగా కాల్షియం అనే పోషకం తప్పనిసరి. అది కూడా శరీరానికి సరిపడా ఉంటే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. ఎముకలు దృఢంగా ఉండాలన్నా, మెదడు చురుకుగా పని చేయాలన్నా శరీరానికి సరిపడా మోతాదులో కాల్షియం ఉండాలి.

Calcium Supplements Good Or Bad : పెరుగుతున్న పిల్లల్లో, మహిళల్లో, వృద్ధుల్లో సాధారణంగా కాల్షియం లోపం వస్తుంటుంది. అందుకే వైద్యులు కాల్షియం సప్లిమెంట్లను లేదా ట్యాబ్లెట్లను ఇస్తుంటారు. అయితే ఇది చాలా వరకు మంచిది కాదని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాల్షియం ఆరోగ్యానికి ఎలాగైతే అవసరమో, శరీరానికి కావాల్సిన దాని కన్నా ఎక్కువ కాల్షియం శరీరానికి అందడం వల్ల అనేక ఆనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. అందుకే ట్యాబ్లెట్ల రూపంలో కాకుండా ఆహారం ద్వారా శరీరానికి కాల్షియం అందేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

పాలు, పాల ఉత్పత్తులైన పెరుగు, వెన్న, నెయ్యి, పన్నీరు వంటి పదార్థాల్లో కాల్షియం అధికంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. అలాగే పాలకూర, పప్పులు, బీన్స్, బఠాణీలు, సోయా వంటివి తినడం వల్ల కాల్షియం పెంచుకోవచ్చని చెబుతున్నారు. ట్యాబ్లెట్ల రూపంలో కాల్షియాన్ని శరీరానికి అందించడం కన్నా సహజ పద్ధతిలో, ఆహారం ద్వారా అందించడం ఎంతో మంచిదని సూచిస్తున్నారు.

"ఎముకలు దృఢంగా మారాలంటే కాల్షియం చాలా అవసరం. శరీరానికి తగినంత కాల్షియం అందాలంటే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, పన్నీరు, పాలకూర, పప్పులు, బీన్స్, బఠాణీలు, సోయాను రోజు వారి ఆహారంలో భాగం చేసుకోవాలి. పాలిష్ పట్టని ఆహారధాన్యాలు, టమాటాల ద్వారా కూడా కాల్షియం అందుతుంది. అయితే శరీరంలో కాల్షియం ఎక్కువైనా ఆరోగ్యానికి చేటు చేస్తుందని గుర్తించాలి. "
- డా.అంజలీ దేవి, పోషకాహార నిపుణులు

కాల్షియం లోపం ఉన్నవారు ట్యాబ్లెట్లను వాడితే సరిపోతుందని చాలామంది భావిస్తుంటారు. కానీ కాల్షియంను ట్యాబ్లెట్ల రూపంలో తీసుకోవడం వల్ల అనారోగ్యం బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. కాల్షియం ఎక్కువైతే రాళ్ల రూపంలోకి మారుతుందని హెచ్చరిస్తున్నారు. ఇది కాల్షియం ఆక్సలేట్, కాల్షియం పాస్పేట్ కింద మారి శరీరానికి హాని చేస్తుందని అంటున్నారు. అలాగే కాల్షియం తగినంత తీసుకోవడం సహా విటమిన్ డి శరీరానికి అందితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని వైద్యులు వివరిస్తున్నారు.

కాల్షియం లోపమా?- ట్యాబ్లెట్స్ కన్నా ఈ ఫుడ్​ చాలా బెటర్​!

మహిళలు సెక్స్ విషయంలో ఆసక్తి లేనప్పుడు ఏం చేస్తారో తెలుసా?

ఉప్పు ఎక్కువగా తీసుకుంటున్నారా? ఎన్ని జబ్బులు వస్తాయో తెలుసా? రోజుకు ఇంతే తినాలట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.